నా మనసు ఎప్పుడూ భోగితోనే..!

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, తన కొత్త సినిమా ‘భోగి’ ప్రచారానికి డుమ్మా కొట్టడంపై చాలా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, తన కొత్త సినిమా ‘భోగి’ ప్రచారానికి డుమ్మా కొట్టడంపై చాలా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

యూనిట్ కు అనుపమకు చెడిదంటూ కొంతమంది, డింపుల్ కు మైలేజీ ఇచ్చేందుకు అనుపమను సైడ్ చేశారంటూ మరికొంతమంది ప్రచారం చేశారు.

ఎట్టకేలకు ఈ ఊహాగానాలకు చెక్ పెట్టింది అనుపమ పరమేశ్వరన్. భోగి సినిమా ప్రచారాన్ని తాను మిస్ అయ్యానని చెబుతూనే, దానికి కారణాన్ని వెల్లడించింది.

సినిమా విడుదల తేదీలు మారడం వల్ల, ప్రచారం కోసం తను డేట్స్ సర్దుబాటు చేయలేకపోయానని వెల్లడించింది అనుపమ. అప్పటికే అంగీకరించిన డేట్స్ వల్ల తను ఊటీలో షూటింగ్ కు హాజరవ్వాల్సి వచ్చిందని, భోగి ప్రచారాన్ని మిస్ అవ్వడం బాధగా ఉందంటూ తెలిపింది.

కేవలం డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లనే తను ప్రచారానికి రాలేకపోయానని.. తన మనసు మాత్రం భోగితోనే ఉందని తన బాధను వ్యక్తం చేసింది. అలా చెబుతూనే, సోషల్ మీడియాలో సినిమా ట్రయిలర్ ను షేర్ చేసింది.

రేపు థియేటర్లలోకి వస్తోంది భోగి సినిమా. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ మెయిన్ హీరోయిన్. డింపుల్ సెకెండ్ హీరోయిన్. సినిమా రిలీజైన తర్వా, అనుపమ ప్రచారానికి అందుబాటులోకి వస్తుందేమో.

One Reply to “నా మనసు ఎప్పుడూ భోగితోనే..!”

Comments are closed.