లోకేష్ పర్యటించారు.. తిరిగొచ్చారు.. ఏం సాధించారు?

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగారు. తిరిగొచ్చారు. ఏం సాధించారు? ఈ ప్రశ్నకు మాత్రం ఎవ్వరివద్దా సమాధానం లేదు. మంత్రిస్థాయిలో ఒక నాయకుడు అమెరికా…

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగారు. తిరిగొచ్చారు. ఏం సాధించారు? ఈ ప్రశ్నకు మాత్రం ఎవ్వరివద్దా సమాధానం లేదు. మంత్రిస్థాయిలో ఒక నాయకుడు అమెరికా వంటి అగ్రదేశానికి కేవలం పెట్టుబడులకోసం అంటూ వెళ్లిన తర్వాత.. కనీసం ఒక్క ఒప్పందమైనా చేసుకోకుండానే తిరిగి రావడం చాలా అరుదు. ఆ ఘనత లోకేష్ ఖాతాలోకే చేరుతుంది.

అయితే ఇప్పుడు పచ్చమీడియా మాత్రం భిన్నమైన ప్రచారం చేస్తోంది. నారా లోకేష్ అమెరికా పర్యటనకు సంబంధించిన ఫలాలు.. 2025 జనవరిలో దావోస్ లో జరిగే పెట్టుబడిదారుల సదస్సులో కనిపిస్తాయని అంటున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడి వచ్చిన కంపెనీలన్నీ దావోస్ సదస్సులో ఒప్పందాలు చేసుకుంటాయట. చిత్రమైన భాష్యం చెబుతున్నారు.

లోకేష్ అమెరికా పర్యటనలో మైక్రోసాఫ్ట్, టెస్లా, ఆమెజాన్, ఎన్విడియా, యాపిల్, గూగుల్ క్లౌడ్, పెరోట్ గ్రూరపు, రేవేచర్, ఫాల్న్ ఎక్స్, జడ్ స్కాలర్ తదితర కంపెనీలతో భేటీ అయ్యారు. కేవలం పెద్ద కంపెనీల ప్రతినిధులను కలవడం మాత్రమే కాదు. లాస్ వేగస్ లో 23 దేశాలకు చెందిన 2300 చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఐటీ సర్వ్ సినర్జీ సమిట్ కు హాజరయ్యారు.

ఏపీలో ఉన్న సానుకూలతలను వివరించారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సెల్, ఇండియాస్పోరా ప్రతినిధులతో కూడా సమావేశం అయ్యారు. ఇంత మందితో సమావేశాలు విందులు జరిగాయే తప్ప.. కనీసం ఒక్క ఒప్పందం కూడా కుదరలేదు. కేవలం ప్రసంగాలు చేయడానికే లోకేష్ అమెరికాకు వెళ్లారా? అనిపిస్తోంది.

ఒకవేళ ప్రభుత్వం చెప్పుకుంటున్న బుకాయింపు మాటలు కూడా నిజమే అనుకుందాం. పెద్దసంస్థల వద్దకు ఇప్పుడు వెళ్లి మన గురించి చెప్పుకుని వస్తే.. వాళ్లు మూడు నెలల తరువాత దావోస్ సదస్సులోనే ఒప్పందాలు చేసుకుంటారని నమ్ముదాం. కానీ వేలాది చిన్న మధ్య తరహా ఐటీ పరిశ్రమల వారిని ఉద్దేశించి కూడా లోకేష్ పెట్టుబడులకోసం తన వంతు ప్రయత్నం చేసి వచ్చారు కదా.. వారిలో ఏ ఒక్కరూ స్పందించలేదా?

అమెరికాలోని భారతీయ పెట్టుబడిదారులు కూడా లోకేష్ వినతుల పట్ల నమ్మకం పెంచుకోలేదా? అనేది సందేహం. వారందరూ కూడా దావోస్ సదస్సుకు వెళ్లేంత పెద్దవారు కాకపోవచ్చు. అలాంటివారితో కూడా ఒప్పందాలు చేసుకోలేకపోతే… అసలు అమెరికా పర్యటన విఫలమైనట్లే కదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి లోకేష్ తరఫు వారు ఎలా సమర్థించుకుంటారో?

26 Replies to “లోకేష్ పర్యటించారు.. తిరిగొచ్చారు.. ఏం సాధించారు?”

  1. ఈ ముక్క మీరు 2022 లో విశాఖ సమ్మిట్ ఏర్పాటు చేసి 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అని అడిగినప్పుడు .. ఎన్నికల సమయం లో కోడిగుడ్డు మంత్రిని అడగాల్సింది.. 13 లక్షల కోట్లల్లో ఎన్ని రూపాయలు వచ్చాయో.. లెక్కపెట్టి చెప్పమని..

    కనీసం బిజినెస్ మీటింగ్స్ ఎలా జరుగుతాయో ఇంకిత జ్ఞానం లేకుండా .. లోకేష్ ని తక్కువ చేసి చూపడానికి రాతలు రాసుకొంటున్నారు..

    కొత్త ప్రభుత్వం వచ్చాక .. మొట్టమొదటి సారి అధికారిక హోదా లో ఆయా కంపెనీలను కలిశారు..

    లోకేష్ వచ్చాడు కలిసాడు కదా అని ఆయా కంపెనీలు ఆంధ్ర లో పెట్టుబడులు పెట్టేయరు .. లోకేష్ ఇచ్చే డీటెయిల్స్ తీసుకుని.. వాళ్ళ ఆలోచన కి రూపకల్పన చేసుకొంటారు..

    ఇది కేవలం.. మన రాష్ట్రం లో ఉన్న సదుపాయాలను వివరించడం కోసం వెళ్లి చేసిన ప్రయత్నం..

    ఆయా కంపెనీలకు నచ్చితే.. పెట్టుబడులకు సమ్మతి తెలియజేస్తూ.. మళ్ళీ మీటింగ్ అరెంజ్మ్నెట్స్ చేసుకొంటారు..

    మంచి కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని ఇలా తక్కువ చేసి మాట్లాడటం వల్లనే.. మీరు కట్టిన అథ్యాత్బుతమైన ఋషికొండ పాలస్ ని వాళ్ళు తక్కువ చేసి చూపుతున్నారు..

    మీరు ఒకటి అంటే.. వాళ్ళు వంద అంటారు.. మళ్ళీ మీరే ఏడుస్తారు..

  2. All these USA trips are bogus, be Lokesh,crmnl jagu or Ettu pirrala KTR.But the difference is that Lokesh can freely visit countries where as jagu need to take permission from courts. Nothing wrong in trying. Surely Lokesh knows more than Jaggu about USA.Either way ,nobody cares for these people in USA as every day some TOM,some Dik and some Haru visit USA

  3. Nobody cares for these visits in USA excepting low class TDP supporters and low class YSCRP supporters. But the difference is JA needs court permission and Lokesh don’t like Ettu pirrala KTR

    1. With thorough understanding of the working of India and USA in the Govt and corporate circles,I ask the honest question to the readers ” does Lokesh/Ja/KTR have the ability to organize panchayath,village festivals like Pawan?”

  4. Red book chapter 3 announce చేసాడుగా US వెళ్లి. ఇంక ప్రజలకి అంత కన్నా కావల్సింది ఏముంది?

  5. మన ప్రయత్నం మనం చేయాలి… చలిగా ఉంటుంది అని ఇంట్లో కూర్చుంటే పరిశ్రమలు రావు… (మీ ఎగ్ గోసి లాగ ).

    లోకేష్ వెళ్ళాడు. అందరిని కలిసాడు… ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు బాగున్నాయి వచ్చి చూడండి.. నచ్చితే పెట్టుబడులు పెట్టండి అని అడిగాడు (అడుక్కున్నడు అన్నా తప్పులేదు )

    మన నిషాని బ్యాచ్ కి CEO అంటే ఏదో తినేది అనుకుంటారు

  6. ఇలాంటి దరిద్రపు నెగటివ్ రాతల్ని నమ్మడంవల్ల ఏ జరుగుతుందో 2019-2024 మధ్యలో బాగా తెలిసొచ్చింది.

    ఇలాంటి పెద్ద ప్రయత్నాలు, అదికూజా ఒక ఐదేళ్లపాటు దరిద్రపు నాయకుడిని చూసిన తరావాత, కొంచెం టైం పడుతుంది అని అందరికీ తెలుసు.

  7. Unless government shows the value resulted from these trips, public money spent on these must be considered as wasted. It is now for people to decide.

    1. wow! Look at who is talking about public wastage

      • Govt building covered with party colors and removed as per high court orders – 1500 crores
      • Public money of 15 crs used for interiors and roads of ex. CM
      • Polavaram with the context of reverse tendering made reverse progress and thats costing 1000 crores additional to the initially spend 400 crores –
      • State total outstanding increased from 3L crores to 9.5L crores in 5 years
      • Anna builds palace for himself on Rishikonda – 500 crores

      I never saw you questioning any of this. But spending money to bring in investments is the concern. Just take a break and realize how blind you are.

  8. ఊరురికీ జెగ్గులు తెచ్చిన చేపల మార్కెట్, రొయ్యల మార్కెట్గు, గుడ్లు పొదిగే పరిశ్రమ కంటే లోకేష్ efforts విదంగా బెటర్ అంటావ్?

  9. ఏమయ్యా లొకేష, కస్టపడి నువ్వు తెచ్చే IT పరిశ్రమలు కూడు పెడతాయా??

    మావోడు పులివెందులకి కూడా చేపలు & రొయ్యలు మార్కెట్స్ తెచ్చి 10 లక్షల కోట్లు అప్పుచేసి అందరికీ పంచేసి, ప్రతీ ఒక్కరిని కోటేశ్వరుణ్ణి చేసేసాడు కదా??

    ఇంకా జాబులు ఎవడు చేత్తాడు??

  10. ఎఫర్ట్స్ చూస్తాం… అన్నీ ఫలించాలని లేదు. ఫలిస్తే సంతోషం. ఫలించకపోతే ప్రయత్నించాడు వేచి చూద్దాం అని అనుకుంటారు జనాలు. అసలు ప్రయత్నించకుండా గుడ్డు కథలు చెప్పడం కన్నా ఇది మేలు కదా

Comments are closed.