విజయసాయిరెడ్డిపై లుక్‌ ఔట్ నోటీసులు!

విజయసాయితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డిలపై సీఐడీ అధికారులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి గతంలో జరిగిన ఘటనపై వైసీపీ నేతలపై, ప్రభుత్వ అధికారులపై కేసులు పెడుతూ జైలుకు పంపే క్రమంలో తాజాగా వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ అయింది. విజయసాయితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డిలపై సీఐడీ అధికారులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.

కాకినాడ సీ పోర్టును బలవంతంగా లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు దేశం దాటి పోకుండా సీఐడీ ముందస్తు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరిని అరెస్టు చేసి విచారణ చేసేందుకు సీఐడీ పావులు కదుపుతోంది. మరోవైపు సీఐడీ లుక్‌ఔట్ నోటీసు నేపథ్యంలో వీరు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

కాగా, గతంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో మాట్లాడుతూ.. చంద్రబాబు – కర్నాటి వెంకటేశ్వరరావుకు ఏ విధంగా కాకినాడ పోర్టును కట్టబెట్టడానేపై పెద్ద ఎత్తున విమర్శించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు కూటమితో అధికారం పంచుకున్న పవన్ గతంలో కాకినాడ పోర్టుపై చేసిన విమ‌ర్శ‌ల‌పై సమాధానం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు.

గత వారంలో పవన్ కాకినాడ పోర్టులో చేసిన హడావిడి చేసిన మరుసటి రోజే నన్ను బెదిరించి బలవంతంగా కాకినాడ పోర్టును లాక్కున్నారని కేవీ రావు ఫిర్యాదు చేయడం వెనుక ప్రభుత్వం పెద్దలు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు, గెలిచిన తర్వాత కూడా రెడ్ బుక్ పార్ట్ 1, పార్ట్ 2 అంటూ మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను, అధికారులను బెదిరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి వందల మంది వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు జరిగిన విషయం తెలిసిందే. కేవీ రావు కేసులో విజయసాయిరెడ్డిని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో చూడాలి.

21 Replies to “విజయసాయిరెడ్డిపై లుక్‌ ఔట్ నోటీసులు!”

  1. కాకినాడ సీ పోర్ట్ ని బలవంతం గా లాక్కున్నారని ఫిర్యాదు చేశారా.. !

    అరెరే .. మరి తమరు ఆ వార్తే రాయలేదు ఇన్నాళ్లు ..

    అంటే.. ఎంతో కొంత నిజముందనేగా అర్థం..

  2. బాదితుడు ముందుకు వచ్చి పొర్ట్, SEZ లొ తన వాటాలని బెదిరించి లాకున్నారు అంటూ కె.-.సుకు పెడితె దీన్ని కూడా కక్ష సాదింపు అనట్టు రాస్తావెమిటి రా..?

    నిన్నె ఈ విషయం అన్ని పెపర్లలొ వచ్చినా, బులుగు మీడియా కాని, నాయకులు కాని కనీసం ఎ వివరణ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నరు అంటె అర్దం అవ్వటం లెదా?

  3. క్రిందటి ప్రభుత్వం లొ బాదితుడు KV రావు సుమ్మారు 900 ల కొట్ల అక్రమాలకి పాల్పడ్డారు అంటూ రిపొర్ట్ తయారు చెసి, ఆయన్ని జైలు పాలు చెస్తాం అని బెదిరించి, కారు చవకగా అరబిందొ కొన్నాక…అబ్బె సుమ్మారు 9 కొట్లె అవకతవకలు జరిగాయి అని మరొ నివెదిక ఇప్పించుకొని మాయ చెసారు అన్నది అబియొగం.

    మరి అలా రిపొర్ట్ లు ఇప్పించుకున్నది నిజమా కాదా? కాదు అయితె ఆ విషయం జగనొ, విజయ సాయి నొ ఆ మాటె చెప్ప వచ్చుగా!

  4. అపోజిషన్ లీడర్ అనేవాడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా అఫెన్స్‌లో ఉండాలి కానీ ఇలా ప్రతిరోజూ ఒక కొత్త కేసులో డిఫెన్స్ ఆడుతుంటే ఇక మాచ్ గెలిచేదెపుడు?

  5. అయినా లోకేష్ బెదిరిస్తే మన సింగల్ సింహాలు భయపడడం ఏంటి ? ఆయన పప్పు కదా ఏం పీకలేడు కదా ఈ ఆర్టికల్ లో ఆయన గురించి ఎందుకు? పప్పు ఇప్పుడు నిప్పు అయ్యి గువ్వ కాలుతుందా?

  6. మీకు అర్థం అవుతుందా. కూటమి ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం ప్రతి ఇరవై రోజులకి మీరు గతంలో చేసిన పనుల గురించి ఒక గుది బండ మీ నెత్తి మీద వేస్తుంది.

    మీ దరిద్రం ఏమిటంటే మీరు ఎంత చండాలపు పనులు చేసారని చెప్పినా, ఆధారాలతో సంబంధం లేకుండా ప్రజలు నమ్ముతున్నారు.

    ఒక పార్టీగా ఇంత క్రెడిబిలిటీ ఉండడం అన్న వల్లే సాధ్యం.

  7. ఏం లాభం? ముఠా నాయకుడు జగన్ గడప వరకు వెళ్లి వేణు తిరుగుతున్నాయి అన్ని న్యాయ సంస్థలు, కానీ గడప ధాటి లోనికి వెళ్లి ముఠా నాయకుడిని మటుకు ఈడ్చుకుని రోడ్డు పైకి లాక్కు రాలేక పోతున్నాయి. అంత ఇనుప ద్వారం ఏవిటో, జగన్ ను బొక్కలో వెయ్యటానికి?

  8. పూర్వ కలం యుద్ధాల్లో వాడే టెక్నిక్కే .. కోట ని చుట్టుముట్టి .. లోపలి వాళ్ళు బయటకి రాకుండా చేయడము ..

    1. ఇప్పుడు మీరు బతికే బట్ట కడితే…. నెక్స్ట్ సంగతి ఆలోచించుకోవచ్చు..

    2. అధికారం లో ఉన్నప్పుడు మా అన్నయ్య కి ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు..

      ఇప్పుడు అధికారం పోయింది కదా ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు కార్యకర్తలు మీరంతా కష్టపడి పనిచేసి నన్ను ముఖ్యమంత్రి ని చేయ్యండి అని బతిమాలికుంటున్నాడు..

      నాయకుడు అనేవాడు ఎప్పుడూ క్యాడర్ తో కలిసిపోవాలి వారి సమస్యలు వినాలి వాటిని తీర్చాలి..

  9. తొక్కి నార తీయాల్సిన వాడిని 12 ఏళ్లు బెయిల్ మీద వదిలిపెడితే ఇలాగే వుంటాయి పర్యవసానాలు

Comments are closed.