Pushpa 2 Review: మూవీ రివ్యూ: పుష్ప 2 – ది రూల్

పుష్ప ఫైర్ అయితే ఇది వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఊహించినంత వైల్డ్ ఫైర్ అయితే కాదు.

చిత్రం: పుష్ప-2- ది రూల్
రేటింగ్: 2.75/5
తారాగణం: అల్లు అర్జున్, రష్మిక, రావు రమేష్, జగపతిబాబు, ఆదిత్య మీనన్, సునీల్, అనసూయ, అజయ్, ఫహద్ ఫాజిల్, తారక్ పొన్నప్ప తదితరులు
కెమెరా: మిరోస్లా కూబా బ్రోజెక్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి
దర్శకత్వం: సుకుమార్
విడుదల: 5 డిసెంబర్ 2024

2021లో ‘పుష్ప-1-ది రైజ్’ ఒక ఊపు ఊపింది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ని దేశమంతా చూసి ఓన్ చేసుకుంది. అది విజయవంతం కావడంతో అదే ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేస్తూ “పుష్ప-2-ది రూల్” తయారయ్యింది. టీజర్, ట్రైలర్, పాటలు అన్ని విషయాల్లోనూ క్రేజ్ ని పెంచుకుంటూ వచ్చి ఈ రోజు విడుదలయ్యింది. నేరుగా విషయంలోకి వెళ్లిపోదాం.

పుష్ప (అల్లు అర్జున్) కూలీ స్థాయి నుంచి బడా డాన్ గా ఎదుగుతాడు. వందల కోట్లల్లో దందా చేసే స్థాయికి చేరతాడు. ఎమ్మెల్యే సిద్ధప్ప (రావు రమేష్) తన పార్టీకి పుష్ప ద్వారా ఫండ్ ఇప్పిస్తుంటాడు. శ్రీవల్లి (రష్మిక) తన భర్త పుష్పని ముఖ్యమంత్రితో ఫోటో దిగి రమ్మని ఒక కోరిక కోరుతుంది. సిద్దప్పతో పాటు ముఖ్యమంత్రిని కలుస్తాడు పుష్ప. కానీ ఒక స్మగ్లర్ తో ఫోటో దిగితే రాజకీయంగా కొంపలంటుకుంటాయని చెప్పి నో అంటాడు ముఖ్యమంత్రి. దాంతో పుష్ప ఈగో హర్ట్ అవుతుంది. అయినప్పటికీ భార్య కోరిన కోరిక ఎలా తీరుస్తాడనేది ఒక పార్ట్.

ఆ ట్రాక్ లోనే షెకావత్ (ఫహద్ ఫాజిల్) తో పుష్ప క్లాష్ అయ్యేది. షెకావత్ (ఫహద్ ఫాజిల్) పుష్ప (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సమ్రాజ్యానికి అడ్డుకట్టవేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. దానికి ప్రధాన కారణం పుష్పతో ఈగో తప్ప వృత్తిపరమైన నిబద్ధత ఉండికాదు. షెకావత్ ఎత్తులకి పుష్ప పైఎత్తు ఎలా వేస్తూ ఎలా తప్పించుకుంటూ తన ఎర్రచందనం చెక్కల స్మగ్లింగ్ చేస్తుంటాడనేది తెరపై చూడాలి. అలాగే పుష్ప తన సవతి అన్న (అజయ్) తో ఆల్రెడీ క్లాష్ ఉందని పుష్ప-1 లో చూసాం. ఆ క్లాష్ ఎలా కొనసాగి ఎక్కడ ముగుస్తుంది అనేది రెండో ట్రాక్. ఆ ట్రాక్ లో షెకావత్ ఉండడు. అక్కడ విలన్ మరొకడు (తారక్ పొన్నప్ప).

కథగా చెప్పుకోవాలంటే ముప్పావుభాగం ఇది చందనం దుంగలతో దొంగాపోలీసాట. మిగిలిన పావుభాగం సవతి అన్నయ్య కెలుకులాటతో ఇంటిపేరు సెంట్రిక్ గా సాగే సెంటిమెంటాట!

ఇక్కడ రెండు భాగాలూ మాస్ అప్పీలింగ్ గా, హై ఇంటెన్సిటీతో తెరకెక్కించాడు దర్శకుడు. కథలో అద్భుతాలేవీ లేవు. ముఖ్యంగా ఇంటిపేరు విషయంలో సవతి అన్నయ్య ట్రాక్, అతని కూతురు కిడ్నాప్, ఫైట్..ఇదంతా పాతచింతకాయ రొట్టకొట్టుడు కథనంలా ఉంది. అయినప్పటికీ దానిని ఎమోషనల్ గా, హై ఎండ్ ఫైట్ సీక్వెన్స్ తో తెరకెక్కించడం వల్ల కథనంగా పాతవాసన కొడుతున్నా ప్యాకేజింగ్ వల్ల పాసైపోయిందనిపిస్తుంది.

ఈ సినిమాకి ఉండే పెద్ద సవాలు “అంచనాలు అందుకోవడం”. అదంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ కమర్షియల్ సినిమాలో హత్తుకునే సన్నివేశాలు మూడు నాలుగున్నా చాలు, గట్టెక్కెస్తుంటాయి. ఇక్కడ అదే జరిగింది. ఇందులో ప్రధానంగా పీక్ సీన్స్ కొన్నున్నాయి. అందులో ఇవి ఉన్నాయి:

* ముఖ్యమంత్రితో పుష్ప ఈగో క్లాష్ అయ్యే సన్నివేశం
* ఎర్రచందనం ఇంటర్నేషనల్ బార్డర్ దాటించే ఎపిసోడ్
* జాతరలో అమ్మవారి గెటప్పేసి పుష్ప చేసే డ్యాన్స్
* ఫహద్ ఫాజిల్ కి పుష్ప సారీ చెప్పే సీన్, దాని తర్వాత సీన్
* రౌడీల మెడలు కొరికి చంపే ఫైట్

అలాగే అతిగా ఉన్నవి, అతకనట్టుగా, అనవసరంగా ఉన్నవి కూడా కొన్ని అనిపించాయి.

* శ్రీవల్లి ఫస్ట్ పార్ట్ లో డీసెంట్ పల్లె పడుచు టైపులో కనిపిస్తే, సెకండ్ పార్ట్ లో ఆమెని “పీలింగ్స్” పాటలో మరీ పచ్చిగా చూపించినట్టు అనిపించింది. అది “అతిగా’ ఉంది. గ్లామర్ డోస్ ఓకే కానీ మరీ ఇలా పాత్ర ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని చంపేయడమెందుకో? సుకుమార్ స్థాయికి ఇది తగదు కదా అనిపించింది.

* దేశం మొత్తంలో షెకావత్ ఒక్కడే పోలీసా? ఇక వేరే వ్యవస్థ ఉండదా? తాను పట్టుకోవడం మిస్సైతే పక్క రాష్ట్రం పోలీసులని అలర్ట్ చేసి ఆపలేడా? కనీసం ఆ పయత్నం చేసినట్టైనా కనిపించొచ్చు కదా! అంతా ఒక్కడే లీడ్ తీసేసుకుని చేసేస్తుంటాడు. ఓడిపోయినప్పుడల్లా బాధపడిపోతుంతాడు. ఏవిటో అర్ధం కాదు. అందుకే ఇది “అతకనట్టుగా ఉంది”.

* అసలు సినిమాలో తొలి 15 నిమిషాలు ఎందుకు పెట్టాడో అర్ధం కాదు. జపాన్ లో ఫైట్, బాల్యంలో నీట మునిగే సీన్ దేనికి? అదంతా కల అని చెప్పడానికా? అది లేపేసినా కథకి ఏమీ తేడా వచ్చేది కాదు..హాయిగా నిడివి కలిసొచ్చేది. అందుకే ఇది “అనవసరం’ అనిపిస్తుంది.

ఇంకా చెప్పుకోవాలంటే..ఫస్ట్ పార్ట్ లో ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేసినట్టుగా కొన్ని పాత్రలు ఉన్నాయి తప్ప పెద్ద ప్రెజెన్స్, ఇంపాక్ట్ మాత్రం లేవు వాటికి.

అల్లు అర్జున్ మాత్రం తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. కానీ అసలే చిత్తూరు యాస, దానికితోడు నోట్లో కిళ్లీలాంటిదేదో పెట్టుకుని మాట్లాడుతుంటాడు. శ్రద్ధగా చెవులు రెక్కించుకుని వింటే తప్ప చిత్తూరేతరులకి అంత తేలిగ్గా అర్ధం కాని సంభాషణలు. అదొక్కటే మైనస్. అది కాక యాక్షన్ సీన్లు, డ్యాన్సులు టాప్ లెవెల్లో చేసాడు. మెడలు కొరుకుతూ చేసే క్లైమాక్స్ ఫైట్ సీన్ కాంతారా నుంచి స్ఫూర్తి పొందినట్టుగా అనిపించింది.

శ్రీవల్లిగా రష్మిక మందన్న ఈ పార్ట్ లో గ్లామర్ యాంగిల్ ఎక్కువ చూపించింది ఒక పాటలో. క్యారెక్టర్ పరంగా కూడా స్ట్రాంగ్ గానే కనపడింది.

ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటన కనబరిచాడు. కానీ అతని పాత్ర కంక్లూడ్ అయిన తీరు తేలిపోయింది.

రావు రమేష్ ది నిడివి ఉన్న పాత్ర. జగపతిబాబు క్యారెక్టర్ చిన్నదే. తారక్ పొన్నప్పకి సెకండాఫ్ లో స్క్రీన్ స్పేస్ ఎక్కువే ఇచ్చారు. కానీ చాలా రొట్టకొట్టుడు పాత్ర అతనిది.

అనసూయ, సునీల్ పాత్రలు ఇందులో తేలిపోయాయి. అజయ్ తమ్ముడుగా శ్రీతేజ్ కూడా కేవలం డైలాగ్ లేని ప్యాడింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నాడంతే.

టెక్నికల్ గా చూస్తే కెమెరా వర్క్ బాగుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ కోరీయోగ్రఫీ. అసహజంగా ఉన్నా ఎమోషన్ బాగా పండింది. ఇవన్నీ బాగున్నాయని అనిపించడానికి ముఖ్యకారణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఔట్ ఆఫ్ ది బాక్స్ అని అనలేం కానీ, ఎంత మోతాదులో ఉంటే ఫీల్ డ్రాప్ అవకుండా ఉంటుందో అంత మోతాదులో ఉంది నేపథ్యసంగీతం. దేవీశ్రీప్రసాద్, శ్యాం సీ.యస్ నిలబెట్టారు.

పాటల్లో మాత్రం “పుష్ప పుష్ప..”, “సూసేకి..” వినడానికి బాగున్నాయి కానీ చూడ్డానికి అటు ఇటుగా ఉన్నాయి. ‘పీలింగ్స్..”పాట కొరియోగ్రఫీ బాగుంది కానీ శ్రీవల్లి పాత్ర మీద మరీ పచ్చిగా ఉంది. “కిసిక్..” పాట మాత్రం వీకే. ఏ మాత్రం స్పెషాలిటీ లేదు.

ఓవరాల్ గా పైన చెప్పుకున్నట్టు ఈ చిత్రంలో ఫ్లోలో కట్టి పారేసే గుణం ఉందని చెప్పడంకంటే, అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ మాత్రం బాగా ఎంగేజ్ చేసాయి అని మాత్రం చెప్పొచ్చు. అంచనాలు భారీగా అందరికీ ఉన్న మాట వాస్తవం. కనుక అందరి అంచనాలూ అందుకోవడం కష్టం. కొన్ని అక్కర్లేని పార్టులు, చాలా వరకు ల్యాగులు తగ్గించి ఉంటే ఇంకాస్త ట్రిం అయ్యి ఉండేది. క్లైమాక్స్ సుఖాంతమైపోయిందన్నట్టుగా పాత సినిమాల స్టైల్లో గ్రూప్ ఫోటో వరకు వచ్చిన తర్వాత కూడా “ఢాం’ అని బాంబు పేల్చి “పుష్ప 3” అని ఎండ్ కార్డ్ పడింది. కనుక మూడో పార్టులో ఏం చెప్పదలచుకున్నారో తెలీదు. పుష్ప ఫైర్ అయితే ఇది వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఊహించినంత వైల్డ్ ఫైర్ అయితే కాదు.

బాటం లైన్: మాస్ జాతర

99 Replies to “Pushpa 2 Review: మూవీ రివ్యూ: పుష్ప 2 – ది రూల్”

  1. ఆ కట్టేదేదో చీరకట్టుతోనే ముఖ్యమంత్రి ప్రక్కన ఓ photo, పంజాబీ dresss లో ప్రధానితో మరో photo movie మొదట్లోనే దిగేసుంటే సరిపోయేదిగా.

    షెకావత్ కి sorry మాత్రమే చెబుతాడా లేక అతడి గారపట్టిన పళ్ళు కూడా తోముతాడా?

  2. ఒక సినిమాస్ లో అమూల్య తండ్రికి పద్మావతి వెడ్స్ పార్వతి అని వ్రాసిన్న పెండ్లి శుభలేఖ చూసి ఆ SI పద్మావతి బంధుమిత్రులేమనుకున్నారన్న సందేహం వచ్చినట్లుగా పుష్ప వెడ్స్ శ్రీవల్లి ని చూస్తే ఏమైపోతాడో?

  3. ఒక సినిమాస్ లో అమూల్య తండ్రికి పద్మావతి వెడ్స్ పార్వతి అని వ్రాసిన్న పెండ్లి శుభలేఖ చూసి ఆ SIx పద్మావతి బంధుమిత్రులేమనుకున్నారన్న సందేహం వచ్చినట్లుగా పుష్ప వెడ్స్ శ్రీవల్లి ని చూస్తే ఏమైపోతాడో?

  4. ఒక సినిమాస్ లో అమూల్య తండ్రికి పద్మావతి వెxడ్స్ పార్వతి అని వ్రాసిన్న పెంxడ్లి శుభలేఖ చూసి ఆ SI పద్మావతి బంధుమిత్రులేమనుకున్నారన్న సందేహం వచ్చినట్లుగా పుష్ప వె డ్స్ శ్రీవల్లి ని చూస్తే ఏమైపోతాడో?

  5. ఒక సినిమాస్ లో అమూల్య తండ్రికి పద్మావతి వెxడ్స్ పార్వతి అని వ్రాసిన్న పెంxడ్లి శుభలేఖ చూసి ఆ SI పద్మావతి బంధుమిత్రులేమనుకున్నారన్న సందేహం వచ్చినట్లుగా పుష్ప వె డ్స్ శ్రీవల్లి ని చూస్తే ఏమైపోతాడో?

  6. ఒక సినిమాస్ లో అమూల్య తండ్రికి పద్మావతి వెxడ్స్ పార్వతి అని వ్రాసిన్న పెంxడ్లి శుభలేఖ చూసి ఆ xSI పద్మావతి బంధుమిత్రులేమనుకున్నారన్న సందేహం వచ్చినట్లుగా పుష్ప వెxడ్స్ శ్రీవల్లి ని చూస్తే ఏమైపోతాడో?

  7. ఒక సినిమాస్ లో అమూల్య తండ్రికి పద్మావతి వెxడ్స్ పార్వతి అని వ్రాసిన్న పెంxడ్లి శుభలేఖ చూసి ఆ

    1. ఆ SI పద్మావతి బంధుమిత్రులేమనుకున్నారన్న సందేహం వచ్చినట్లుగా పుష్ప వె డ్స్ శ్రీవల్లి ని చూస్తే ఏమైపోతాడో?

    2. ఆ SIx పద్మావతి బంధుమిత్రులేమనుకున్నారన్న సంxదేహం వచ్చినట్లుగా పుxష్ప వె డ్స్ శ్రీవల్లి ని చూస్తే ఏమైపోతాడో?

  8. ఒక సినిమాస్ లో అమూల్య తండ్రికి పద్మావతి వెxడ్స్ పార్వతి అని వ్రాసిన్న పెంxడ్లి శుభలేఖ చూసి ఆ ఆ SI పద్మావతి బంధుమిత్రులేమనుకున్నారన్న సంxదేహం వచ్చినట్లుగా పుxష్ప వె డ్స్ శ్రీవల్లి ని చూస్తే ఏమైపోతాడో?

  9. సుకుమార్, గుణశేఖర్, కృష్ణవంశీ ఈ బ్యాచ్ అంతా లాగింగ్ మాస్టర్స్.అయితే టేకింగ్ స్టైల్ ,ఎమోషన్స్ పండించటం లో మాస్టర్స్.ఇక పోతే ఈ సినిమా ఓవర్ అల్ గా ఒక 20 మిన్స్ బోర్..2 hrs ఫుల్ ఎంటర్టైన్మెంట్… సాంగ్స్ అంచనాలను అందుకోలేదు.. పుష్ప1 కి మల్లే పదే పదే వినాలనిపించే..చూడాలని పించే అయితే కాదు..మొత్తం గా మూవీ బానే ఉంది..

  10. థియేటర్ లో మాత్రమే చూడవలసిన సినిమా నా? కాదా అనే క్లారిటీ ఐతే వచ్చింది. OTT నే అన్నమాట

  11. Teesukunna dabbuku parava ledu 2.75 GA nyayam chesadu, orey vedava GA , as a allu arjun fan cinema baledu 1000 bokka asalu expect cheyoddu fans ledu bochu vallaku dabbulu kavali manaki dhoola ekki? Bro plz don’t vaste your money and valuable time.

  12. ఇదేంటీ GA గారు సోషల్ మీడియాలో మన అన్నయ్య అభిమానులు తగ్గేదే లే అని హడావిడి చేస్తుంటే మీరు ఇలా రివ్యూ ఇచ్చారు..

    1. 😀😀😀😀 0 or -ve ivvalsindi rating lo.

      emi edusthunnaru ayya mega and janasena fans. Abbo vinadaaniki chaala baagundi. Movie chala ante chala baagundi. Nenu ippatike 2 saarlu chusa

      1. ఒ రే య్ బ్రో క ర్ క ర్రి కు క్క. ,…. లు చ్చా. ప ను లు. చే సే నీ అ ల్లు కు క్క

        కం టే. ప్ర జా లు కీ పీ డిం చి న వై సి పి గు ద్ద లో. గు న పం

        దిం పి న. మె గా బ్యా చ్ ..

  13. Emi ledhu film lo, much hyped Jathara episode lo acting kuda Rishab Shetty facial acting ki copy chesaru kani, it did not suit bunny, eventhough bunny is a good actor, this Kantara type of acting did not suit him, all heavily paid reviews, part-1 lo 30% kooda ledhu, story is just 2 lines. KGF-2 ki enni poor xerox lu teestaru ? LOL

    1. Ee Sukku and batch ni dooram pettadam better, many cringe scenes & confusing screenplay, lucky gaa 2-3 films work ayyayi anthe, he is highly overrrated. Craft better chesukokunda, paid reviews veyinchukunte, emi labham

  14. నిజంగా చెపుతున్న బ్రో మూవీకి 900 చాల బొక్క మూవీ చూసి చెపుతున్న 100/- ఐతే ఓకే ఒకసారి చూడచ్చు ఆంతే 😭

    1. అదీ కూడా వేస్ట్, ఆ పొట్టొడి ఎలవేషన్స్ డబ్బులు పెట్టీ చూడాల్సినంత విషయం లేదు సినిమాలో.

    2. మరి అంత పొదుకున్న మట్కాని ఎందుకు పొడుకోబెట్టారు అందరూ తలచుకున్న గానీ 😳

  15. జనాలు ఎవరు రేరూ అన ధియాటర్ దగ్గరకు వెళ్లి తల్లి కొడుకుని చంపేసిన * అత్తులు స్టార్ పుష్పవతి మేడమ్ గారు చనిపోయిన ఆ కుటుంబంనికి ఎవరూ బాధ్యతలు తీసుకొచ్టారూ అత్తులు స్టార్ పుష్పవతి మేడమ్ గారా ఊడికంకుక్కలా

  16. ఈ పొట్టి, తొట్టి అల్లు అర్జున్ హీరో కాదు, విలన్. ,నిజం జీవితం లో కూడా. ఒక మహిళ మృతి కి కారకుడు అయ్యాడు. వీడి వలనే ఆమె చనిపోయింది. వీడు పది కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలి

  17. ఈ ల వ డా మూ వీ ని లు చ్చా ప ను లు చే సే వై సీ పీ పా ర్టీ కు క్క ల కీ.

    త ప్ప. ఎ వ రి కి న చ్చా దూ .

  18. ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్……ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్” డైలాగ్ బాగా వైరల్ అవుతోంది.

    ఇది అయితే కొంతమందికి G lo కారం పెట్టినట్టే ఉంటుంది

        1. డైలాగ్ కి మడటం ఏమిటి రా 11 వరకు తెచ్చి G లో పెద్ద రాడ్ పెడితే…ఇప్పుడు అడుకుంటున్నాడు…మీ Paytm గాలు మంట ఇప్పటకీ తగ్గదు కాద

  19. నార్త్ లో మన సౌత్ హీరో ల సినిమా లు హిట్ అవ్వడానికి బీజేపీ సోషల్ మీడియా కూడా ఒక చెయ్యేస్తుంది, ఖాన్ హీరో ల మీద కోపం తో. జూ ఎన్టీఆర్, ప్రభాస్, KGF హీరో, అల్లు అర్జున్ మీద పాజిటివ్ పోస్ట్లు కనపడతాయి.

    1. అంటే మొన్న బీహార్ లో జరిగిన auddio releasse లxక్షల్లో వచ్చింది నిరుద్యోగ గాxలి యువత అనుకున్నారు..అయితే వారంతా బ్రహ్మచారి ముఠాల పటాలాలా?

      1. సోషల్ మీడియా సపోర్ట్ అన్నాను కాని వేరేలా అనలేదు. అయినా ఇదే మీడియా లో ఆర్టికల్ వేశారు కదా, బీహార్ ఫంక్షన్ మేనేజ్ చేశారు కాని కలెక్షన్స్ ఎలా తెచ్చుకుంటారో చూద్దాం అని.

  20. సరుకు సెన్నై దాటించడం అంటే సిన్నాయన్ని సంపి సియం అవడం అంత ఈజి అనుకుంటివా ఏమి ?

  21. Looking his face from side and straight with heavy hair and beard with 2 feet height, I am sorry he exactly looked like you know what I mean, I always wonder how they became leading men of the movies. I would be more good-looking as a leading man than them

  22. ఈ వెబ్ సైట్ వాడు,

    వాడి కులానికి అండగా నిలిచినందుకు,

    అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.

    మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?

    మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.

    ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు

Comments are closed.