ఆ ద‌ళిత ఎమ్మెల్యేను ప‌క్క‌న పెట్టిన టీడీపీ!

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని టీడీపీ అధిష్టానం ప‌క్క‌న పెట్టింది.

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని టీడీపీ అధిష్టానం ప‌క్క‌న పెట్టింది. ఆదిమూలం భ‌య‌ప‌డ్డ‌ట్టే జ‌రిగింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి లోకేశ్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా స‌త్య‌వేడు టీడీపీలో విభేదాల తొల‌గింపుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జరిగింది. తెలుగు మ‌హిళా నాయ‌కురాలి విష‌యంలో కోనేటి ఆదిమూలంపై ఏడు నెల‌ల క్రితం స‌స్పెన్ష‌న్ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే.

స‌త్యవేడు ఎమ్మెల్యేపై క్రిమిన‌ల్ కేసు, ఆ త‌ర్వాత న్యాయ‌స్థానంలో రాజీ త‌దిత‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ కోనేటి ఆదిమూలంపై స‌స్పెన్ష‌న్ వేటు మాత్రం ఎత్తివేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఆదిమూలంపై భారీస్థాయిలో అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. మహిళ‌ల విష‌యంలోనూ, అలాగే పార్టీ కేడ‌ర్‌ను అస‌లు ప‌ట్టించుకోలేద‌ని, ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టాల‌నే డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఈ ప‌రిస్థితిలో స‌త్యవేడులో లోకేశ్ ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఎమ్మెల్యేను పక్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం. లోకేశ్ మాట్లాడుతూ స‌త్య‌వేడు టీడీపీలో స‌మ‌స్య‌ల‌న్నీ త‌న‌కు తెలుస‌న్నారు. అందుకే ఇద్ద‌రు ప‌రిశీల‌కుల్ని నియ‌మించామ‌న్నారు. ఏవైనా స‌మ‌స్య‌లుంటే, వాళ్ల‌తో చ‌ర్చించి, ప‌రిష్క‌రించుకోవాల‌ని లోకేశ్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సూచించారు. ఇంకా అవ‌స‌ర‌మైతే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ ఉన్నార‌ని, ఆయ‌న‌తో స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌చ్చ‌న్నారు. అంద‌రూ అల‌కలు వీడి, పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని ఆయ‌న హిత‌బోధ చేశారు.

దీంతో స‌త్య‌వేడులో ఎమ్మెల్యే ఆదిమూలాన్ని అధిష్టానం ప‌క్క‌న పెట్టింద‌న్న సంకేతాలు శ్రేణుల్లోకి వెళ్లాయి. పేరుకే ఎమ్మెల్యే త‌ప్ప‌, ఆయ‌న‌కు ఏ మాత్రం విలువ లేద‌ని స్ప‌ష్ట‌త వ‌చ్చింది. అందుకే ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయ‌లేద‌నే స్ప‌ష్ట‌త వ‌చ్చింది. టీడీపీ అధిష్టానం పక్క‌న పెట్టిన రెండో ద‌ళిత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. మొద‌టి ఎమ్మెల్యే తిరువూరు నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొలిక‌పూడి శ్రీ‌నివాస్‌. అక్క‌డ కూడా ఇదే ప‌రిస్థితే.

10 Replies to “ఆ ద‌ళిత ఎమ్మెల్యేను ప‌క్క‌న పెట్టిన టీడీపీ!”

  1. ఒకవేళ కలుపుకు పోయుంటే ఈ ఆర్టికల్ వేరే విధంగా రాసేవాడివి.

    1. మరి.. మహిళతో.. అసభ్య న్గా ప్రవర్తించి.. ఆమెను అనుభవించాడు అని ఆ మహిళా గగ్గోలు పెట్టినప్పుడు C@ సు కట్టి.. న్యాయస్థానం లో.. ఆమహిళకు సహకరించక.. అదే మహిళతో వాడికి సంధి చేసి.. C@ సు నీరుగార్చి అప్పటికి పార్టీ ముఖ్యం మహిళా మానప్రాణాలు ముఖ్యం కాదు అని తేల్చేసినట్టు కదా ? మరి.. ఈ రోజు వాడిని పక్కన పెడుతున్నారు అంటే.. వాడు ఆ మహిళతో అసభ్య న్గా ప్రవర్తించాడు అని పార్టీ ఒప్పుకున్నప్పుడు న్యాయస్థానానికి ఎందుకు ఆ రోజు సహక రించలేదు?

      1. ధైర్యంగా మీడియా ముందుకి వచ్చిన ఆ మహిళ తరువాత కూడా గట్టిగా పోరాడాల్సింది సంధికి ఒప్పుకోకుండా.

  2. వాళ్ళు తప్పు చేసిన దళిత ఎంఎల్ఏ నీ పక్కన పెట్టారు….మనం దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినోడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాం

  3. ఆ ఎమ్మెల్యే పై ఆరోపణలు వచ్చినప్పుడు మహిళా పై అఘాయిత్యం చేసిన టీడీపీ mla అని రాస్తారు….సస్పెండ్ చేసి పక్కన పెట్టగానే, ఆ సస్పెన్షన్ ఇంకా ఏత్థకపోతే దళితుడు అని గుర్తుకు వచ్చింది మీకు…. ఇంకా కొలికపూడి శ్రీనివాస్ గారు, ఆయన దళితుడు అని పక్కన పెట్టలేదు…. అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అని పక్కన పెట్టారు…. అప్పట్లో జీవీ రెడ్డి ని రెడ్డి కాబట్టి చంద్ర బాబు పట్టించుకోలేదు అని రాసావు… ఏమిటో కులాల చిచ్చు పెట్టే పనిలోనే ఉంటావు ఎప్పుడూ

    1. రే రంగడు!

      మరి.. మహిళతో.. అసభ్య న్గా ప్రవర్తించి.. ఆమెను అనుభవించాడు అని ఆ మహిళా గగ్గోలు పెట్టినప్పుడు C@ సు కట్టి.. న్యాయస్థానం లో.. ఆమహిళకు సహకరించక.. అదే మహిళతో వాడికి సంధి చేసి.. C@ సు నీరుగార్చి నప్పుడు నీతి న్యాయం ధర్మం మరచినపుడు పార్టీ గుర్తుకు రాలేదా ర? అంటే అప్పటికి పార్టీ ముఖ్యం మహిళా మానప్రాణాలు ముఖ్యం కాదు అని తేల్చేసినట్టు కదా ర? మరి.. ఈ రోజు వాడిని పక్కన పెడుతున్నారు అంటే.. వాడు ఆ మహిళతో అసభ్య న్గా ప్రవర్తించాడు అని పార్టీ ఒప్పుకున్నప్పుడు న్యాయస్థానానికి ఎందుకు ఆ రోజు సహక రించలేదు? ఎర్రి పువ్వా.. నువ్వు …నీ భో….. గ్ మ్ కబుర్లు!

  4. ఇద్గరిపైనా నీకెందుకు జిల అది వాళ్ల పార్టీ అంతర్గత విషయం.

  5. అస్త్ర ధారుడై బుల్లెట్ ఫ్రూఫ్ తొడుగుతో కోడి కత్తి పట్టుకుని బాత్రూమ్ లో దొరికిన గొడ్డలి తో వెంట రోజా అంబటి గుట్కా అనిల్ జోగి విడుదల అవినాష్ లను తోడు చేసుకుని పిట్టల పొట్టివాడు పాయె

Comments are closed.