సాధారణంగా వీకెండ్ ఎంజాయ్ చేస్తూ గడపాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రధానంగా సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ సంస్కృతి పెరిగిన తర్వాత.. వీకెండ్ అంటే కేవలం ఆదివారం మాత్రమే కాదు.. శనివారం కూడా అనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడుతూ ఉంటుంది.
కార్పొరేట్ల కంటె ఘనమైన జీవితం గడుపుతూ ఉండే ఎమ్మెల్యేలు, ఆస్థాయి రాజకీయ నాయకులు అదే అభిప్రాయంతో ఉన్నా ఆశ్చర్యమేం లేదు. శని ఆదివారాలు కుటుంబంతో గానీ.. ఇతరత్రా గానీ.. తాము ఎంజాయ్ చేస్తూ గడపాలని వారు కోరుకోవడం, ప్లాన్ చేసుకోవడం వింతకాదు. కానీ చంద్రబాబునాయుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతి శనివారాన్ని ‘లాక్’ చేసేస్తున్నారు. ప్రతి శనివారం వారు నియోజకవర్గాలలోనే ఉండది ఎటెండ్ కావాల్సిన విధిని నిర్దేశిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వారి కష్టాలు, సమస్యల గురించి వినతులు స్వీకరించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు చంద్రబాబునాయుడు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఉండి వినతులు స్వీకరించేలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయనే ప్రారంభించారు. ప్రతిరోజూ పార్టీ కార్యాలయంలో ఉండి వినతులు స్వీకరించడానికి కొందరికి టైంటేబుల్ లాగా షెడ్యూలు వేయడం ప్రారంభించారు.
అయితే.. పార్టీ కేంద్ర కార్యాలయానికి వందల సంఖ్యలో జనం వస్తోంటే.. కొందరిని మాత్రమే అనుమతిస్తున్నారని.. పెద్ద నాయకులు ఉన్న సందర్భాల్లో అనేక మందిని వెనక్కు తిప్పి పంపుతున్నారని.. దీని వల్ల.. సమస్యలు తీర్చడం వల్ల మంచి పేరు కంటె.. అనుమతించడడం లేదనే చెడ్డపేరు ఎక్కువవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చంద్రబాబునాయుడు ఇప్పుడు సిస్టమ్ ను మార్చేశారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతిరోజూ వచ్చి వినతులు ఇచ్చే వారికోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేస్తారు. శనివారం మాత్రం అక్కడ మంత్రులు ఉంటారు. అదే రీతిగా మరో ప్రతిపాదన తెచ్చారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం వల్లనే.. ప్రజలు కేంద్ర కార్యాలయానికి వస్తున్నారంటూ.. కొత్త ఏర్పాటు ప్రకటించారు. ప్రతి శనివారం ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉండి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని డిసైడ్ చేశారు. అంటే ఎమ్మెల్యేలు అందరికీ ఇకమీదట ప్రతి శనివారం లాక్ అయిపోయినట్టే అన్నమాట.
చంద్రబాబు ఒక సారి ఒక కార్యక్రమం ప్రకటించిన తర్వాత.. దానికి బీభత్సంగా ఫాలో అప్ లు కూడా ఉంటాయనే సంగతి అందరికీ తెలుసు. ఏ శనివారాలు ఏయే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదో.. అదంతా లెక్కతీసి.. పంచాయతీ పెడతారని.. ఇక తమ జీవితాల్లో శనివారాలను మరచిపోవాల్సిందేనని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు.
మీరు ఏమి చేసినా, ఎంత కష్టపడ్డా మావోడు గట్టిగా కళ్ళుమూసుకుంటే చాలు.. ‘EVM లు ప్రసన్నమై “ప్రోగ్రాం మార్చుకుని”, మాకు అధికారం తన్నుకుంటూ రావడం ఖాయం అంటున్నాడు.. దీనికి విరుగుడు కనిపెట్టండి first.. తర్వాత కస్టపడి అభివృద్ధి చెయ్యొచ్చు
Bolli gaani padi ekkinchevaraaku ap panikiraadu
సమస్యలు లేని ప్రజలు నియోజకవర్గం ఉన్నాయా అసలు? చిత్తశుద్ధి ఉండాలి కాని పరిష్కారం దొరికితే సంతోషం! లేదు అదో కంటి తుడుపు గా మిగిలిపోయింది.
ఇతనే ఇంత శ్రమ పడుతూ వుంటే, వయస్సులో చిన్నోడు అయిన జగన్ రెడ్డి అనే ముసలోడు ఇంకా ఎంత ఆక్టివ్ గా వుండాలి ?
ప్రతి వారం బెంగళూర్ ప్యాలస్ లో ఏసీ రూమ్ లో తొంగోదానికి వెళ్ళడం ఎందుకో మరి!
ఇవి పక్కన పెట్టు, బాబోరు ఎంత పెద్ద విజయం సాధించారు… తెలుసా మీకు
రొండు చిరిగినా చెడ్డీలు, మూడు ముక్కలైన డ్రాయర్స్, 10 పిప్పెర్ బిళ్ళలు, 4 చేగోడీలు,
సూపర్ కదా.
adhikaram lo vundi tdp office lo prajala vinathulu theessukovadam endo !!! now no one knows MLA do this activity . inthaku mundu spandana program better than this . gov officers are used to take .
ఆదరించిన రంగనాథ్ గారు,
మీరు చదువుకున్న, ఆలోచనలతో ఎదిగిన మనిషి. కానీ మీ మాటలు వింటుంటే, “ఇతనికి చదువు ఎక్కిందా? లేక కేవలం పరీక్షల కోసం పుస్తకాలు తిరగేసాడా?” అనిపిస్తోంది!
ఇది 2024, టాలెంట్ చూసే తరం. **కానీ మీరు మాత్రం 90s కాలపు కుల కచేరీ లెక్కలు చూసుకుంటూ, “ఈ జాతి, ఆ జాతి” అంటూ మైండ్ బ్లాక్ చేసుకుంటున్నారు.**ఇలా కొనసాగితే, మిమ్మల్ని చూసి కొత్త తరం – “ఇంకా వీriకి wifi connect కాలేదా?” అని ఫీలవుతుంది!