కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరట లభించింది. రూ.12 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వాళ్లకు ఆర్థిక మంత్రి తీపి కబురు అందించింది. ఆ మేరకు ఆదాయం ఉన్న వాళ్లు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రూ.12 లక్షల వార్షికాదాయం ఉన్న వాళ్లకు రూ.80 వేలు ఆదా అవుతుంది.
కేంద్ర ఆర్థిక బడ్జెట్ కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్ను విధానంలో రూ.25 లక్షల ఆదాయం ఉన్న వాళ్లకు రూ. 1.10 లక్షలు ఆదా అవుతుంది. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పన్న విధానాన్ని సరళతరం చేయడానికి, అలాగే పన్ను చెల్లించే వాళ్లకు ఉపశమనం కలిగించడానికి సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పన్ను విధానం ప్రకారం తక్కువ పన్ను రేట్లు విధిస్తారు. నాలుగు లక్షల లోపు ఆదాయం వుంటే రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. రూ.4లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య ఆదాయం వుంటే 5 శాతం, రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం వుంటే 10 శాతం, రూ.24 లక్షల పైన ఆదాయం వుంటే 30 శాతం పన్ను చెల్లించాల్సి వుంటుంది.
గత కొన్ని రోజులుగా రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా బడ్జెట్ వుంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే అంచనాకు మించే కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
People who wrote this article should use some brains! Howcome no tax upto 12 lakhs, when nil tax is just increased to 4 lakhs from 3 lakhs! They reduced slab rates and hyping as if no tax upto 12 lakhs and our media is just highlighting. This tax slabs change is in new regime where no housing loan rebates, insurance, education fee rebates are there. Very marginal reduction which anyway paying through increased cost of living and gst.
The slabs are revised however the rebate up to 12 lakh(Rs 60k) is announced (Rs 75k std deduction extra)..so probaby no tax on them..even 1 rupees increased above 12.75 lakh gross salery , no rebate will come ,so we have to pay as per slab system on total income
There is something called 87A rebate on final calculated tax upto 60k. That makes tax zero for income upto 12L non working 12.75L for working with 75k SD. He wrote correctly.
HBisw .If ur income is Rs 12.75 Laks pa . you need not pay income tax. Over Rs 12.75 Laks you have to pay income tax as per new tax rates
Because of 87A its zero tax upto 12L with 60K exempt on tax