అక్క‌డి అరాచ‌కం.. వైసీపీకి హెచ్చ‌రిక‌!

అరాచ‌కాన్ని త‌ప్పు ప‌ట్టేవాళ్లు, మంచి పాల‌న అందిస్తార‌ని ఎవ‌రైనా ఆశిస్తారు. అయితే ఆ ప‌ని జ‌రుగుతోందా?

వైసీపీ పాల‌న‌లో అంతా అరాచ‌కం అని కూట‌మి నేత‌లు నిత్యం విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ప్ర‌తిదానికీ అరాచ‌కం అనే ట్యాగ్‌లైన్ త‌గిలించి వైసీపీని కూట‌మి నేత‌లు తూర్పార‌ప‌డుతుంటారు. అరాచ‌కాన్ని త‌ప్పు ప‌ట్టేవాళ్లు, మంచి పాల‌న అందిస్తార‌ని ఎవ‌రైనా ఆశిస్తారు. అయితే ఆ ప‌ని జ‌రుగుతోందా? అనే ప్ర‌శ్నకు స‌మాధానం చెప్పేవాళ్లు కావాలి.

తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అక్క‌డ అరాచ‌క రాజ‌కీయం రాజ్య‌మేలుతోంద‌నే మాట చాలా చిన్న‌ద‌ని న‌గ‌ర‌వాసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అభ్య‌ర్థి శేఖ‌ర‌రెడ్డికి సంబంధించి ఆస్తుల‌పై అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని విధ్వంసానికి కూట‌మి ప్ర‌భుత్వం తెర‌లేపింది. బుల్డోజ‌ర్లు, పోలీసుల‌తో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు న‌గ‌రంలో వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న శేఖ‌ర్‌రెడ్డి భ‌వ‌నాల వ‌ద్ద‌కు వెళ్లారు.

కూల్చివేత‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో యోగి స‌ర్కార్ పాల‌న‌ను గుర్తుకు తెస్లోందనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ కార్పొరేట‌ర్ల‌కు ఫోన్లు చేసి, మ‌రీ బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌తంలో వైసీపీ ప‌ది శాతం అరాచ‌కానికి పాల్ప‌డితే, దాన్ని నాలుగింత‌లు చేసి చూపిస్తామ‌ని కూట‌మి నేత‌లు ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. చివ‌రికి వైసీపీ త‌ర‌పున విప్ జారీ చేసే కార్పొరేట‌ర్ ఇంటికి వెళ్లి, కూట‌మి నేత‌లు బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం ఏ ర‌క‌మైన ప్ర‌జాస్వామ్య‌మో అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో ప్ర‌జ‌ల‌కు అస‌లు ఏ సంబంధం లేద‌న్న‌ట్టుగా కూట‌మి నేత‌లు వ్య‌వ‌హ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుప‌తిలో డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా కూట‌మి నేత‌లు అనుస‌రిస్తున్న తీరు చూస్తే…. రానున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు నామినేష‌న్లు కూడా వేసే ప‌రిస్థితి లేదు. వైసీపీ ఒక ర‌క‌మైన త‌ప్పుల్ని చేస్తే, కూట‌మి అంత‌కు మించి దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించ‌డం పౌర స‌మాజాన్ని ఆవేద‌న‌కు గురి చేస్తోంది.

6 Replies to “అక్క‌డి అరాచ‌కం.. వైసీపీకి హెచ్చ‌రిక‌!”

  1. అరాచకం అనిపిస్తే…వైచీప్ గాళ్ళు కుత్త మూస్కొని చూడండి అంతే…

    ఎందుకంటే మీకు అరాచకం అనే పదం వాడే హక్కు లేదు….

    ఎందుకంటే అలాంటి పదాలకు మీరు మాత్రమే అర్హులు

  2. మనం చేసి చూపించిన అరాచకం, ఇపుడు మన మీదే ప్రయోగిస్తున్న వాళ్లకి.. అన్నాయ్ చెప్పునట్టు మనం అతి నిజాయితీ, అతి మంచితనం తో పోరాడితే అధికారం మనకే.. అప్పుడు వీళ్లే శాలువా కప్పి, సన్మానించి అవార్డ్స్ ఇస్తారు.

  3. ఇంత అరాచకాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు. పచ్చ మిత్రులు నాలుగు బూతులు రాసి జబ్బలకు నవరత్న అయిల్ రాసుకొని పడుకొంటే nijam అబద్ధం అవ్వదు.

  4. అప్పట్లో ఫేస్బుక్ లో పో*స్ట్ ఫార్వర్డ్ చేసింది అని ఒక హోటల్ ఓనర్ పెద్ద ఆవిడ నీ అర్థరాత్రి అరెస్టు చేసిన కొ*జ్జా కు*య్య గా*డిద ప్యా*లస్ పుల*కేశి ఎవడు ?

    అప్పడు గ్రేట్ ఆంద్ర నోట్లో ఎవడిది పెట్టుకున్నాడు ?

Comments are closed.