మెగాస్టార్ తో మరోసారి!

మైత్రీతో మరోసారి బాబీ జతకట్టబోతున్నారు. ఈసారి కూడా మెగాస్టార్ తోనే.

వాల్తేరు వీరయ్య… ఓ బ్లాక్ బస్టర్ సినిమా. మైత్రీ-బాబీ-మెగాస్టార్ కాంబినేషన్. సంక్రాంతికి వచ్చి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వాల్తేరు వీరయ్య సినిమా తరువాత, నందమూరి బాలకృష్ణతో డాక్యూ మహారాజా సినిమా చేసారు బాబీ. ఆ సినిమా తరువాత ఏమిటి? అన్నది పాయింట్. పీపుల్స్ మీడియాకు ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది ఎప్పుడు అన్నది తెలియదు.

కానీ మైత్రీతో మరోసారి బాబీ జతకట్టబోతున్నారు. ఈసారి కూడా మెగాస్టార్ తోనే. త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. నిజానికి విశ్వంభర తరువాత సినిమానే బాబీ చేయాల్సి ఉంది. కానీ కథ ఫైనలైజ్ కాలేదు. ఈ లోగా అనిల్ రావిపూడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాని తరువాత బాబీ సినిమా ఉంటుంది. ఈ మేరకు బాబీ స్క్రిప్ట్ వర్క్ కు రెడీ అవుతున్నారు.

మైత్రీతో చేయబోయే సినిమాలో మెగాస్టార్ కుమార్తె కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రితో ఓ సినిమా నిర్మించాలని ఆమె ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అది ఇప్పటికి నెరవేరే అవకాశం ఉంది.