తండేల్ ఫంక్షన్ వాయిదా అందుకేనా?

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం తండేల్ ఫంక్షన్‌ను వేరే ఫంక్షన్ కారణంగా వాయిదా వేసారు.

అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా ఈ శనివారం సాయంత్రం తండేల్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసారు. కానీ ఉన్నట్లుండి దాన్ని క్యాన్సిల్ చేసారు. 4న చేసే అవకాశం వుందని తెలుస్తోంది.

సినిమా విడుదల ఇంక అయిదు రోజుల్లో వుండగా, ఇలా క్యాన్సిల్ చేయడం ఎందుకు? సినిమాకు పనికి వచ్చే ఫంక్షన్ కదా అనే అనుమానం వుండనే వుంటుంది. ఎందుకు క్యాన్సిల్ అయిందా అనే ఆసక్తి కూడా వుండనే వుంటుంది.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం తండేల్ ఫంక్షన్‌ను వేరే ఫంక్షన్ కారణంగా వాయిదా వేసారు. నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన సోదరి భువనేశ్వరి తమ స్వంత ఫార్మ్ హవుస్ లో ఈరోజు రాత్రి భారీ పార్టీ ఇస్తున్నారు.

నందమూరి- నారా కుటుంబ సభ్యులు, వారి వారి సర్కిల్స్ లోని సన్నిహితులను మాత్రం ఈ పార్టీకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానితుల్లో అల్లు అరవింద్ కూడా వున్నారని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ కార్యక్రమం బ్యాక్ బోన్ అల్లు అరవింద్ నే అన్న సంగతి కూడా తెలిసిందే.

ఈ ఫంక్షన్ కు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తారని తెలుస్తోంది. ఇలాంటి టైమ్ లో మరో భారీ ఫంక్షన్ అంటే బందోబస్త్ సమస్యలు కూడా వస్తాయి. అందుకే తండేల్ ఫంక్షన్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

One Reply to “తండేల్ ఫంక్షన్ వాయిదా అందుకేనా?”

Comments are closed.