వైసీపీ రాజ‌కీయ స‌న్యాసులు!

వైసీపీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర నిరాశ‌, నిస్పృహ ఏర్ప‌డ్డాయి.

వైసీపీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర నిరాశ‌, నిస్పృహ ఏర్ప‌డ్డాయి. అయితే కూట‌మి అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకోవ‌డం, ఇదే సంద‌ర్భంలో పాతాళంలోకి వైసీపీ జారిపోవ‌డంతో, ఇక భ‌విష్య‌త్ వుండ‌దేమో అనే భ‌యాన్ని ఏడు నెల‌ల క్రితం ఆ పార్టీ శ్రేణుల్లో క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో ఏకంగా కొంద‌రు రాజ‌కీయ స‌న్యాసం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మిస్తున్నామ‌నే ప్ర‌క‌ట‌న‌లు చేసిన నాయ‌కుల గురించి తెలుసుకుందాం.

మొట్ట‌మొద‌ట‌గా విజ‌య‌వాడ మాజీ ఎంపీ కేశినేని నాని నుంచి ఇలాంటి ప్ర‌క‌టన వ‌చ్చింది. అంత‌కు ముందు ఆయ‌న విజ‌య‌వాడ ఎంపీగా టీడీపీ నుంచి రెండుసార్లు గెలుపొందారు. అయితే టీడీపీ యువ‌నాయ‌కుడు లోకేశ్‌తో విభేదాల కార‌ణంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల ముందు వైసీపీలో చేరారు.

కేశినేని నానిని వైఎస్ జ‌గ‌న్ ఆద‌రించారు. విజ‌య‌వాడ ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే కూట‌మి సునామీలో ఆయ‌న ఓడిపోయారు. అనంత‌రం రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు గౌర‌వంగా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత సినీ న‌టులు అలీ, పోసాని కృష్ణ‌మురళి నుంచి కూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల్నే చూశాం. వీళ్ల‌ద్ద‌రికీ కూడా జ‌గ‌న్ త‌గిన ప్రాధాన్యం ఇచ్చారు. అలీ ఎప్పుడూ రాజ‌కీయ ప్రత్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌లేదు. కానీ పోసాని కృష్ణ‌ముర‌ళి చాలా సార్లు నోరు పారేసుకున్నారు. ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదైంది. ఆ త‌ర్వాత ఏమైందో కానీ, రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పారు.

తాజాగా వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి రాజ‌కీయ నిష్క్ర‌మ‌ణ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇంకా మూడున్న‌రేళ్ల రాజ్య‌స‌భ ప‌ద‌వి వుండ‌గానే, ఆయ‌న రాజ‌కీయ స‌న్యాసం తీసుకోవ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది. వ్య‌వ‌సాయం చేసుకుంటాన‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. అక‌స్మాత్తుగా విజ‌య‌సాయిరెడ్డి తీసుకున్న నిర్ణ‌యం రెండు తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌స్తుతానికి వైసీపీ రాజ‌కీయ స‌న్యాసులు వీళ్లే. మ‌రికొంద‌రు నేత‌లు… త‌మ‌ది టైమ్ కాద‌నే ఉద్దేశంతో మౌనాన్ని ఆశ్ర‌యించారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద్ గురించి చెప్పుకోవ‌చ్చు. అయితే వైసీపీలో రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న నేత‌ల్లో ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చిన కేశినేని నాని ఒక్క‌రే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌తో సంబంధం ఉన్న నేత‌. మిగిలిన నాయ‌కుల‌కు ఎలాంటి ప్ర‌త్య‌క్ష సంబంధం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

7 Replies to “వైసీపీ రాజ‌కీయ స‌న్యాసులు!”

  1. వైసీపీ తరుపున ప్రస్తుతం విపరీతంగా పోరాటాలు చేస్తున్నది ఒక్క గ్రేట్ ఆంధ్ర యాజమాన్యం వెంకటి రెడ్డి నే…

    సో వైచీపీ లో ప్రస్తుతానికి ఖాళీ గా ఉన్న ఏ2 స్థానాన్ని వెంటనే మా నాలుగో వదిన జగ్గమ్మ ఈ వేంకటి గాడికి ఇవ్వ వలసిందిగా మా విజ్ఞప్తి

    ఆమె న్…హ లు లూయ…

  2. మరి ఇంక్కెందుకు? వాళ్ళ మీద కూడా బురద చల్లటం మదలు పెట్టు!

    అల్రేడీ మొదలు (సన్యాసులు అంటూ) పెట్టగామ్మా అంటవా? సరె కాని!

  3. మగాడిని నమ్మి రాజకీయాలు చేయోచ్చు లేదా ఒక ఆడదాన్ని నమ్మి రాజకీయాలు చేయోచ్చు కాని అటు ఇటు గాని ఒక లం గా ని నమ్ముకుంటే చివరికి సన్యాసమే గతి మరి,

  4. పార్టీనుండి యా లీడర్ పోతాండాడు?? సొంతంగా 11 ఓట్లుకూడా తెచ్చుకోలేని సన్నాసులు పార్టీ లో ఉండి ఏమీ పీకుతారు వీళ్లంతా..

    పోతేపోనీ లెబ్బా .. ఏమైతాది??

    ఇంకా బలమైన భూతులు తిట్టే లీడర్లను తయారు చేస్తాను. చూస్తుండండి

    1. Na madda guduv puka anthaku munfu elaction inthakanna goram party odipoindi…. But epudu kuda pothhulaki pokunda single chestunna elctions ni meelaga kutami ani epudu edoka party ravadan kedu ga kojja bhathukulu

  5. నోటి దూల తీర్చుకుంటే ఇలాగే ఉంటాది మరి. అధికారం ఉంది కదా అని నూటికి ఎంత వస్తే అంత మాట్లాడడమేనా ? నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడే వీళ్ళు నాయకుల ? అందరూ మౌనం పాటించే సన్యాసం తీసుకుంటున్నారు / తీసుకున్నారు మన గ్రేట్ ఆంధ్ర వేశ్య మాత్రం కుక్కల మొరుగుతూనే ఉంది . అందరికీ ఏదో ఒక ఊసుపోక పదవి ఇస్తున్నప్పుడు జగన్ ఈ గ్యాస్ ఆంధ్ర వేశ్యకు పదవి ఇస్తే సరిపోతుంది ఏమో ? ఎందుకంటే అందరూ నోరు మూసుకున్న ఈయన మాత్రం మాత్రం మరుగుతూనే ఉన్నాడు .

Comments are closed.