జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తీవ్ర జ్వరం పోయింది. పిఠాపురం పర్యటనలో పవన్‌కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడినట్టు జనసేన వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండుమూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు రెండు రోజుల క్రితం జనసేన అధికారికంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో పవన్ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ వెలువడింది. ఈ నెల 6 నుంచి ఉత్తరాంధ్రలో పవన్‌కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర మొదలవుతుందని తెలిపారు. మొదటి రోజు నెల్లిమర్ల, 7న అనకాపల్లి, 8న ఎలమంచిలి నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు.
వరుసగా నాలుగు రోజులు షెడ్యూల్ ప్రకటించడాన్ని గమనించొచ్చు. పవన్‌కల్యాణ్ ఒక రోజు జనంలో వుంటేనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటిది వరుసగా నాలుగు రోజులు పర్యటనలు ఉండడంపై జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. పవన్‌కల్యాణ్ వ్యవహారం అంతా ఒక రోజు జనంలో వుంటే, రెండు రోజులు విశ్రాంతి అనేలా తయారైంది. కీలకమైన ఎన్నికల సమయంలో పవన్‌కల్యాణ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు.
ఈ నెల 3న తెనాలిలో పవన్ బహిరంగ నిర్వహించాలని ముందు అనుకున్నారు. అయితే తీవ్ర జ్వరంగా వుండడంతో రద్దు చేసుకున్నారు. మళ్లీ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర షెడ్యూల్ వెలువడింది. తెనాలిపై క్లారిటీ రావాల్సి వుంది.