సోష‌ల్ మీడియా యాక్టివిస్టులకు ప‌వ‌న్ వార్నింగ్‌!

సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి, ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే సీరియ‌స్‌గా తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. కాకినాడ పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య…

సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి, ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే సీరియ‌స్‌గా తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. కాకినాడ పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న ప్ర‌సంగిస్తూ ప్ర‌జా సంప‌ద దోచిన ఏ ఒక్క‌ర్నీ వ‌దిలిపెట్టమ‌న్నారు.

గ‌త ఐదేళ్ల‌లో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయ‌న్నారు. బ‌డికి వెళ్లిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేద‌ని మ‌రోసారి ఆయ‌న అన్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు బ‌లంగా వుండాల‌ని, అందులో రాజీప‌డ కూడ‌ద‌న్నారు. కొత్త త‌రం నాయ‌కుల్ని త‌యారు చేసుకోవాల‌న్నారు. ఇది మాట‌ల్లో కాదు చేత‌ల్లో చూపుతామ‌న్నారు. రాష్ట్ర అభివృద్ధికి ష‌ణ్ముఖ వ్యూహంతో ముందుకెళుతున్న‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. త‌మ‌పై ప్ర‌జ‌లు చాలా పెద్ద బాధ్య‌త పెట్టార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

కొన్ని విష‌యాల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇంకా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిలా మాట్లాడార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సుగాలి ప్రీతి క‌నిపించ‌కుండా పోయింది గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో. ఇప్పుడు ప‌వ‌నే అధికారంలో భాగ‌స్వామి. ఇంకా ఇలాంటి విష‌యాలు మాట్లాడ్డం ద్వారా ఏం సాధించాల‌ని అనుకుంటున్నారో ఆయ‌న‌కే తెలియాలి.

ఇక రెండు నెల‌లుగా రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు ఎలా ఉన్నాయో ప‌వ‌న్‌కు తెలియ‌ద‌ని అనుకోవాలా? ఏవో ఒక‌టి మాట్లాడాల‌న్న‌ట్టుగా ఆయ‌న ప్ర‌సంగం సాగిందనే విమ‌ర్శ లేక‌పోలేదు.

13 Replies to “సోష‌ల్ మీడియా యాక్టివిస్టులకు ప‌వ‌న్ వార్నింగ్‌!”

      1. 30000 మంది ఆడాళ్ళని కనిపెట్టారు రా! దీనికి సమాధానం చెప్పరా! చెప్పలేకపోతే పక్కకి మింగేయ్

  1. నీతి, నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థత, నిరాడంబరతతో కూడిన వ్యక్తిత్వంతో మరియు సామాజిక స్పృహ మరియు గొప్ప పరిజ్ఞానంతో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ప్రజావ్యక్తిగా, మహాశక్తిగా ఎదిగిపోతున్నారు…

    జగన్ గారికి ప్రజలు 151 ఎమ్మెల్యేల బలంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు.. కానీ జగన్ గారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.. అహంకారం మరియు సొంత అభిమాన భావంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారు… వ్యవస్థను నిర్వీర్యం చేశారు…..

    నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం జగన్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే….

  2. అవినీతి అధికారులను రాజకీయ నాయకులను గుర్తించి వాళ్ళ దగ్గర అవినీతి డబ్బు వసూలు చేస్తే కనీసం ఐదు లక్షల కోట్ల పైబడి లాగవచ్చు కోటి కుటుంబాలను పైకి తీసుకు రావచ్చు టీడీపీ జనసేన గట్టిగ తలచుకొంటే ఇదేమి పెద్దకష్టం కాదు దెబ్బకి జనసేన పేరు దేశవ్యాప్తంగా మారుమోగి పోతుంది

Comments are closed.