తనకుతాను జ్యోతిష్కుడిగా చెప్పుకునే వేణుస్వామి మరోసారి తెరపైకొచ్చాడు. ఈసారి ఆయన నేరుగా సమంతకు క్షమాపణలు చెప్పాడు.
“నాతో నీ జాతకం చెప్పించిన వ్యక్తులు, సంస్థల తరఫున నీకు క్షమాపణలు చెబుతున్నాను. నీ పట్ల జాలి లేకుండా రాక్షస భావజాలంతో ప్రవర్తించిన తెలుగు సమాజం తరఫున నన్ను క్షమించమని కోరుతున్నాను. నీకు జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు, నీకు ధైర్యం చెప్పడం తప్ప నేనేం చేయలేను.”
ఇలా సమంతను ఓదార్చే ప్రయత్నం చేశాడు వేణుస్వామి. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం చేసుకున్న తర్వాత.. సమంతపై సింపతీ పెరగకూడదనే ఉద్దేశంతో, కుట్రలో భాగంగా తనను మరోసారి తెరపైకి తీసుకొచ్చారని అంటున్నాడు.
“సమంతకు సింపతీ వస్తుందని, జనాలకు సమంతపై జాలి కలుగుతుందని, టోటల్ గా సబ్జెక్ట్ ను డైవర్ట్ చేయడానికి చేసిన కుట్రలో భాగంగా నన్ను తెరపైకి తీసుకొచ్చారు. సినిమా ప్రముఖుల జాతకాల్ని వేణుస్వామి అడగకుండా చెప్పుతున్నాడని ఆరోపిస్తూ, సమంతను పూర్తిగా చర్చలో లేకుండా పక్కకు పంపించారు. ఒక స్త్రీకి జరిగిన నష్టంపై డిస్కషన్ జరగకుండా ఉండేందుకు తెలివిగా నన్ను తెరపైకి తెచ్చారు.”
తను తెలుగువాడ్ని కాబట్టి జాతకం చెబితే టార్గెట్ చేశారని.. ఇదే జాతకాన్ని ఏ తమిళవాడో, కన్నడవాడో చెబితే అతడి కాళ్లు కడిగి, నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తారని అంటున్నాడు వేణుస్వామి. ఇతడిపై జర్నలిస్ట్ సంఘాలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కమిషన్ అతడికి నోటీసులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో సమంతకు క్షమాపణలు చెప్పాడు వేణుస్వామి.
Mari anna ki kuda sorrrrryyyyyyy cheppu.
nashtam street ki maatrame endhuku jaruguthondi, divorce mutual.. I think venu swamy is trying to protect himself by bringing samantha into picture
వీడి మెల్లకన్ను ద్రుష్టి లో తెలుగు సమాజం అంటే శ్రీ రెడ్డి , ముక్కోడు ఫామిలీ , జగన్ రెడ్డి మాత్రమే ..
Vc available 9380537747
Vc estanu 9380537747
Samantha ki anyaayam jarigindhi
అస్తమాను వేరే వాళ్ళ జాతకాలూ ఎందుకులెండి ఈ సారి మీ జాతకం ప్రకారం ఎప్పుడు పోతారో చెప్పండి మీ కుటుంబ సభ్యులది కూడా చెప్పండి అప్పుడు మేము బేరీజు వేసుకొంటాం
Call boy jobs available 8341510897
జనం పట్టించుకోరు
Venu swamy correct jathakam
Marriage tharuvatha kuda affairs continue cheyadam valla anni problems