చిత్రం: డబుల్ ఇస్మార్ట్
రేటింగ్: 2.5/5
తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, గెటప్ శీను, ఆలి, సాయాజీ షిండే, మకరంద్ దేశ్ పాండే, ప్రగతి, ఝాన్సీ, టెంపర్ వంశీ తదితరులు
సంగీతం: మణిశర్మ
కెమెరా: శ్యాం కె నాయుడు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
విడుదల: 15 ఆగస్టు, 2024
తమ కాంబినేషన్లో హిట్టైన “ఇస్మార్ట్ శంకర్” కి సీక్వెల్ గా ఈ చిత్రంతో మన ముందుకొచారు రామ్- పూరీ జగన్నాథ్. కొన్ని సీక్వెల్స్ మొదటి పార్ట్ కంటే మెరుగ్గా ఉంటాయి, చాలావరకు తేడా కొడతాయి. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
శంకర్ (రామ్) ఓల్డ్ సిటీలో ఉంటుంటాడు. అతనొక దొంగ. అక్కడికి జన్నత్ (కావ్య థాపర్) అనే అమ్మాయి ఢిల్లీ నుంచి వస్తుంది. ఆమెను ప్రేమిస్తాడు. వీళ్ల మధ్య రొమాన్స్ నడుస్తుండగా బిగ్ బుల్ (సంజయ్ దత్) అనే ఒక మాఫియా డాన్ తనకి చావు లేకుండా ఉండేందుకు ఒక సైంటిష్ట్ (మకరంద్) ని పిలిపించి సలహా అడుగుతాడు. దానికి “యంగ్ బాడీలోకి మెమరీ ట్రాన్స్ఫర్ చేయడం” అనే సలహా ఇస్తాడు. ఆ ప్రక్రియ కోసం ఆల్రెడీ తలలో యూ.ఎస్.బి పోర్ట్ ఉన్న శంకర్ ఒక్కడే సరిపోతాడని కూడా చెబుతాడు. దాంతో అతనిని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. అక్కడ బిగ్ బుల్ ని చూసిన శంకర్ కి తన గతం గుర్తుకొస్తుంది. దాంతో బిగ్ బుల్ ని చంపాలనుకుంటాడు. ఇంతకీ ఆ గతం ఏమిటి? మెమరీ ట్రాన్స్ఫర్ ని ఎలా ఎదురుకుంటాడు? చివరికి ఏమౌతుంది అనేది కథాంశం.
స్టోరీ లైన్ వింటే ఏదో హాలీవుడ్ ప్లాట్ లా అనిపిస్తుంది. కానీ చాలా రొటీన్ కథనంతో ఎక్కడా కొత్తదనం లేకుండా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు. కథనంలో గూజ్బంప్ మొమెంట్స్ కానీ, పీక్స్ కానీ లేవు. సింపుల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ పరంగా బాగుండి కథనం పరంగా యావరేజ్ గా నిలిచిన చిత్రమిది.
హీరో రామ్ కి నిజంగా ఒక అపురూపమైన అవకాశం వచ్చింది.బ్రెయిన్ లో చిప్ వల్ల స్ప్లిట్ పర్సనాలిటీలా బిహేవ్ చేసే అవకాశం!! సంజయ్ దత్ క్యారక్టర్ ని లైట్ గా ఇమిటేట్ చేసాడు తప్ప అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మెథడ్ యాక్టింగ్ చేయలేదు. అలా చేసుండుంటే నటుడిగా రామ్ మరొక మెట్టు పైకి ఎక్కేవాడు. డ్యాన్సుల్లో ఎనెర్జీ, యాక్టింగ్ లో స్పీడ్ మాత్రం ఎప్పటిలాగానే చూపించాడు.
హీరోయిన్ కావ్య థాపర్ అన్నివిధాలుగా ఆకట్టుకుంది. డ్యాన్సుల్లో కూడా మరొక ఐటం డ్యాన్సర్ అవసరం లేని విధంగా ఆల్ ఇన్ వన్ గా ఉపయోగపడింది. సగటు పూరీ సినిమాల్లో హీరోయిన్లు ఎలా ఉంటారో అలాగే ఉంది.
సంజయ్ దత్ కి ఇది మొదటి డైరెక్ట్ తెలుగు చిత్రం. తన స్టైల్లో చాలా ఈజ్ తో నటించాడు. మకరంద్ దేశ్ పాండే, సాయాజీ షిండే వారి వారి పాత్రల్లో ఓకే.
ఇక ఎటొచ్చీ మొదటి నుంచీ ఎక్కువగా ప్రొజక్ట్ చేసిన పాత్ర ఆలీది. అమేజాన్ అడవుల నుంచి వచ్చిన ట్రైబల్ పాత్రలో కనిపించాడు. ఈ పాత్ర ఇంట్రడక్షన్ బాగుంది గానీ క్రమంగా బోర్ కొట్టింది. దానికి తోడు అసభ్యకరమైన సైగలతో కూడిన విపరీతమైన వల్గారిటీ. అసలీ క్యారక్టర్ కి, కథకి సంబంధమే లేదు. ఎందుకు పెట్టినట్టో, పెట్టి సరిగ్గా ఎందుకు నడపనట్టో అర్ధం కాదు. ఆలీ ఫిల్మోగ్రఫీలోని కామెడీ ట్రాకుల్లో ఇది చాలా బ్యాడ్ అని చెప్పొచ్చు. కానీ గెటప్ పరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగా ఆలీ కష్టం కనపడింది.
పూరీ సినిమాల్లో విలన్ పక్కన ఫైటింగులు చేసే మగరాయుడిలాంటి ఒక లేడీ కనిపించడం మామూలే. ఆ ప్లేసులో బని జే అనే నటి కనపడింది. ఆ తరహా పాత్రలు నచ్చే ప్రేక్షకులకి నచ్చుతుంది.
ఝాన్సీ ఫ్లాష్ బ్యాక్ లో సెంటిమెంటుకి పనికొస్తే, ప్రగతి క్యారక్టర్ దానికి కంటిన్యుటీ. అయితే ప్రగతి పాత్ర వల్ల ఒనగూరిన ప్రయోజనమేమీ లేదు.
గెటప్ శీను సైడ్ కిక్ గా జస్ట్ ఒకే. అతని చేత ఎటువంటి కామెడీ వర్కౌట్ చేయలేదు.
పూరీ సంభాషణల్లో అశ్లీలం పాళ్లు ఎక్కువయ్యాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించడం అభ్యంతరకరంగా ఉంటుంది కనుక ప్రస్తావించట్లేదు. ఎంత సెన్సార్ వాళ్లు వాళ్ల పని వాళ్లు చేసినా బూతు వాసన మాత్రం అలాగే ఉంది మాటల్లో. మాస్ ని రంజింపజేయడానికి బూతే శరణ్యం అని మైండులో మ్యాటర్ ఉందనుకునే పూరీ జగన్నాథ్ కూడా నమ్మడం బాధాకరం.
ప్లస్ పాయింట్ చెప్పుకోవాలంటే మణిశర్మ మ్యూజిక్. పాటలు, నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయి. ఇస్మార్ట్ శంకర్ కి తాను అందించిన ఫ్లావర్ కి ఏమాత్రం తగ్గకుండా మళ్లీ తన సత్తా చూపించాడు.
ఇక్కడ చెప్పుకోవాల్సినిది ఏంటంటే “లైగర్” తో పూరీ అభిమానులు వడదెబ్బ తిన్నాక ఈ “డబుల్ ఇస్మార్ట్” గోళీ సోడాలా అనిపిస్తుంది. అయితే కూలింగ్ తక్కువ. ఆలీ ట్రాక్ అర్ధవంతంగా, వినోదంగా మలిచి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేది.
శ్యాం కే నాయుడు, గియాని గియనెల్లిల కెమెరా పనితనం ఓకే. పెద్దగా బోర్ కొట్టదు, అలాగని పూర్తిస్థాయి వినోదభరితంగానూ లేదు. “ఇస్మార్ట్ శంకర్” చూసినవాళ్లకి ఆ వాతరావరణం పరిచయమే కాబట్టి కొనసాగింపు ఎపిసోడ్ గా చూడాలి.
పూరీ జగన్నాథ్ చిత్రాలంటే కథలో డెప్త్, కథనంలో గ్రిప్, మాటల్లో లాజిక్, పాటల్లో మ్యాజిక్, క్లైమాక్స్ టెరిఫిక్ అనేట్టుగా ఉండేవి. కానీ ఈ చిత్రంలో ఒక్క పాటలు తప్ప మిగతావన్నీ తేలిపోయాయి. ఒక సాదా సీదా రివెంజ్ డ్రామాని శంకర్ పాత్రకి తగిలించి ఈ “డబుల్ ఇస్మార్ట్” ని లాగించేయడం జరిగింది. “లైగర్” కంటే నయమే అయినా, పూరీ నుంచి ప్రేక్షకులు ఆశించేది ఇది మాత్రం కాదు. దీనికంటే ఎన్నో రెట్లు బెటర్ సినిమా ఎక్స్పీరియన్స్ ని కోరుకుంటున్నారు. ఫోనులో చిప్ ఉంటే సరిపోదు, సిగ్నల్ అందితేనే కాల్ కనెక్ట్ అవుతుంది. అలాగే కథ బాగుందనుకుంటే సరిపోదు, కనెక్ట్ చేసే బలమైన కథనం ఉండాలి. ఇక్కడ అది వీక్. అందుకే కనెక్ట్ అవుతూ, మధ్యలో కట్ అవుతూ ఉంది.
బాటం లైన్: సిగ్నల్ వీక్
తలకాయ లో usb పోర్ట్ ఏందిరా ఎర్రి నా .. ప్రతోడి కి ఉంటది usb పోర్టు యనకాల.. దూరిస్తే మెమరీ change అయిపోద్ది.
తలకాయ లో usb పోర్ట్ ఏందిరా ఎర్రి నా .. ప్రతోడి కి ఉంటది usb పోర్టు యనకాల.. దూ రిస్తే మెమరీ change అయిపోద్ది.
హ హ హ…
అయితే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు
Janalu pattinchukoru 😂
poori outdated ra naayana …inka enduku saavadobbutaaru janaalani
This is expected from you GA, 2.25 to a good movie and 2.5 to worst one, wah.. super
Vc available 9380537747
sanjay dutt acted in chadralekha (1999). This is 2nd telugu movie for him
జన్మభూమి కమిటీలకు మరో రూపమే అన్న క్యాంటీన్. జన్మభూమి కమిటీలు ఎంత అవినీతి జరిగిందో మనకు తెలుసు .
ఇప్పుడు కొత్తగా అన్నా క్యాంటీస్ అంటున్నాడు అన్న కాంటీన్ లో కూడా కాంట్రాక్ట్స్ ఎవరు ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలే ఉంటారు. తెలుగుదేశం కార్యకర్తలంటే ఎవరూ k-బ్యాచ్. చంద్రబాబు ఏమి చేసినా కే బ్యాచ్ కి లాభం ఉండాలి లేకపోతే లేదు.
ఇది ఎప్పుడు ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారు ఎప్పుడు ఆంధ్ర బాగుపడుతుందో తెలియదు.
మనము ఎప్పుడు అయితే కాంటీన్స్ మూసేసి .. పేదవాడికి భోజనం పెట్టకుండా .. 500 కోట్ల తో వరల్డ్ క్లాస్ భవనం కట్టుకున్నామో .. అప్పుడే ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు అన్న ..
Jagan gave freebies and got zero results in the elections. TDP did Anna canteens in 2018 and results were abysmal. In AP there is no poor fellow. Leave this talk about free food, canteens and what not and just focus on development. People voted for Kootami because they care about development. No one cares about free food or 5 rupees food. let us not turn people into beggars. India should move beyond beggarism
Chakka gaa chepparu
ippudippude andhra baagupaduthondhi…poina dikkumalina vedavani malli gelipinche paristitullo leru andhra prajalu…
No it’s wrong jagan has craze
గ్రేట్ ఆంధ్ర ఉద్యోగి మరియు వైసిపి కార్యకర్త లాగా వున్నావు కదా.రా..
Call boy jobs available 8341510897
D grade movie boarded assam train. Trailer was horrible.
Maamulu rod kaadu idi. Pedda gadda paara.
మళ్ళీ విజయంద్ర సార్ కాల్ చేస్తారేమో