చంద్రబాబుకు కిరణ్ సలహా: ఆచరణ సాధ్యమేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడుకు- అదే ఉమ్మడి రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక సలహా ఇస్తున్నారు. Advertisement విభజిత…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడుకు- అదే ఉమ్మడి రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక సలహా ఇస్తున్నారు.

విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఇప్పుడున్న జిల్లాలను కలిపేసి, పూర్వపు పూర్వం ఉన్న ఉమ్మడి జిల్లాల స్వరూపంలోనే తయారు చేయాలని అంటున్నారు. సాధారణంగా అధికార వికేంద్రీకరణతో ప్రజలకు చేరువ కావడం గురించి ప్రభుత్వాలు ఎక్కడైనా కసరత్తు చేస్తుంటాయి గానీ.. ఆయన తిరోగమన అయిడియా ఇస్తుండడం విశేషం.

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలలో తప్పులు ఉంటే- వాటిని సరిదిద్దడం సమర్ధించదగినదే. ఇప్పటికే తాము తప్పులుగా గుర్తించిన అంశాలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే పని చేస్తోంది. కానీ తెలుగుదేశం వారికి, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు కూడా రాని ఆలోచన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చింది.

అధికార వికేంద్రీకరణ వలన ప్రజలకు ప్రభుత్వం మరింత అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో చిన్న జిల్లాలను జగన్మోహన్ రెడ్డి సర్కారు గతంలో ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాటిని తిరిగి కలిపేసి పెద్ద జిల్లాలుగా తయారు చేయాలని కిరణ్ సలహా ఇస్తున్నారు.

చిన్న జిల్లాలు చేయడం వలన ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది అవుతుందో, ఏ రకంగా ప్రజలు నష్టపోతారో ఆయన చెప్పడం లేదు తాను ముఖ్యమంత్రిగా ఉంటే జిల్లాలను మళ్లీ కలిపేసేవాడిని అని మాత్రం కిరణ్ సెలవిచ్చారు. తనను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను కూడా తిరిగి కలిపేస్తానని గతంలో ఆయన చెప్పారు. ఆయన మాటలను ప్రజలు నమ్మకపోవడం వల్లనే ఆయన స్థాపించిన పార్టీ మొదటి ఎన్నికల్లోనే కనుమరుగు అయిపోయింది.

నిజానికి చంద్రబాబు నాయుడుతో తరాలనాటి వైరం కలిగి ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- ఇప్పుడు ఇద్దరూ ఒకటే కూటమిలో ఉన్నారు గనుక ఆయనలోని కార్య సమర్ధతను మాత్రం గుర్తిస్తున్నట్లుగా ఉంది. అమరావతి రాజధాని, పోలవరం సమస్యలను ప్రాజెక్టులను కేంద్ర సాయంతో చంద్రబాబు పూర్తి చేయాలని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు పూనిక వహించినా సరే.. ఈ సూచనలు కార్యరూపంలోకి వస్తాయేమో గానీ.. చిన్న జిల్లాలను మళ్లీ పెద్దజిల్లాలు మార్చడం సాధ్యమయ్యేదేనా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

12 Replies to “చంద్రబాబుకు కిరణ్ సలహా: ఆచరణ సాధ్యమేనా?”

  1. ఎంకి, బొత్తిగా political science మీద అవగాహన లేకుండా రాసిన ఆర్టికల్ లాగా వుంది !! 7 / 8 వ తరగతి సోషల్ గైడ్ / text బుక్ లో centralization vs decentralization ప్రశ్న చదివి చావ్!!

  2. కెసిఆర్ చెప్పిన కారణం ఏమిటంటే కేంద్రం ఇచ్చే జిల్లాల వారీ నిధులు ఎక్కువ వస్తాయి అని కాని మైంటెనెన్సు ఖర్చులు పెరిగిపోతాయి కదా జిల్లాలు ఎక్కువ చేస్తే, సిబ్బంది, విద్యుత్ ఛార్జి లు, ఇంటర్నెట్ ఛార్జి లు లాంటివి. చిన్నవి చెయ్యక ముందు ఎవరూ అడగలేదు కదా, చిన్న జిల్లాలు కావాలి అని.

  3. కొత్త జిల్లాలు సైంటిఫిక్పి గా ఏర్పాటు చెయ్యాలి కానీ పి’చ్చి lanjia కొడుకు jeggulu గాడు Revenue division ని కొత్త జిల్లా చెయ్యకుండా మండలాన్ని Dist హెడ్ క్వార్టర్ చేశాడు..

  4. కొత్త జిల్లాలు సైంటిఫిక్పి గా ఏర్పాటు చెయ్యాలి కానీ పి’చ్చి lanjia కొ’డుకు jeggulu గాడు Revenue division ని కొత్త జిల్లా చెయ్యకుండా, మండలాన్ని Dist హెడ్ క్వార్టర్ చేశాడు.. Ex: Hindupur

  5. అన్న క్యాంటీన్ కి కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చిన భువనేశ్వరి గారు

    జనాల సొమ్ము తెం గి తినటమే కానీ.. నువ్వు నీ పె ళ్ళాం ఎవడికైనా అర్ధరూపాయి దానం చేసారా.. ఛీ నీ య మ్మ జ గన్

Comments are closed.