రాజకీయ నాయకులు త్యాగాలు చేస్తుంటారు. త్యాగాల్లో రెండు మూడు రకాలు ఉంటాయి. పదవీ త్యాగం, ఆస్తుల త్యాగం, ప్రాణ త్యాగం. రాజకీయ పార్టీల్లో, ఆ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కొందరికి పదవులు రావు. అందరికీ ఇవ్వలేరు కదా. ఇందుకు అనేక సమీకరణాలు, లెక్కలు ఉంటాయి. కానీ కొందరు నాయకులు పదవి ఇవ్వలేదని అనరు. పదవీ త్యాగం చేశానని చెబుతారు.
ఎవరూ కూడా ఆస్తులను త్యాగం చేయరు. అందుకు భిన్నంగా ఇంకా పెంచుకుంటారు. ఇక ఉద్యమాల్లో (తెలంగాణ ఉద్యమంలాంటివి)పోరాటాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా, కొందరు పోలీసు కాల్పుల్లోనో, మరో విధంగానే మరణిస్తారు. వీరందరినీ ప్రాణ త్యాగం చేసినవారిగా పరిగణిస్తారు. సైనికులు దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు.
ఖలిస్థాన్ మద్దతుదారుల (ఆమె అంగ రక్షకులు) చేతిలో ప్రాణాలు కోల్పోయారు. స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని పంపినందుకు వారు ప్రతీకారం తీర్చుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉంటుంది. అయితే పొలిటికల్ త్యాగధనుల్లో తెలంగాణ కాంగ్రెస్ కురు వృద్ధుడు వి. హనుమంత రావు అలియాస్ వీహెచ్ కూడా ఉన్నాడు.
తానేం త్యాగం చేశాడో ఆయనే చెప్పాడు. కానీ ఎప్పుడూ ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని అడుగుతుంటాడు. తనకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినా నో చెప్పాడట. ఆ అవకాశం వస్తే గిస్తే ఉమ్మడి ఏపీలో అయి ఉంటుంది. అసలు ఏ రాజకీయ నాయకుడైనా సీఎం అవకాశం వస్తే వదులుకుంటాడా? చోటా నాయకుడికి కూడా సీఎం అయిపోవాలనే కోరిక ఉంటుంది కదా.
కానీ హనుమన్నకు అవకాశం వచ్చింది ఒకసారి కాదు… రెండుసార్లట ! అంతే …ఆ మాట చెప్పి ఊరుకున్నాడు. కానీ ఎందుకు వద్దన్నాడో తెలియదు. మరి అంత పెద్ద సీఎం పదవినే వద్దన్నవాడు, మరి ఇప్పుడెందుకు పదవులు అడుగుతున్నాడు? తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు తాను ఖమ్మం నుంచి పోటీ చేస్తానని తనకు టిక్కెట్ ఇవ్వాలని అడిగాడు. కానీ పని కాలేదు. ఇప్పుడేమో పార్టీలో తనకు ఓబీసీ కన్వీనర్ పోస్టు ఇవ్వాలని అడుగుతున్నాడు.
తనకు ఆ పదవి ఇస్తే దేశమంతా తిరిగి ఓబీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేస్తానన్నాడు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన ఏకైక లక్ష్యమని చెబుతున్నాడు. ఇంత చెప్పి తనకు ఎలాంటి పదవుల మీద ఆశ లేదంటాడు. ఏమిటో …హనుమంతన్న ఓ పట్టాన అర్థం కాడు ఆయన ప్రసంగం మాదిరిగానే.
సీనియర్ బొత్స
Call boy jobs available 8341510897
అరేయ్ ముసలి జంబూకం నీ ఓబీసీ గాళ్ల నందరిని తీసికొని ఒక దేశం తీసుకో. దరిద్రం పోతుంది.
Vc estanu 9380537747