ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ లేదు.. వెళ్లండి!

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ లేద‌ని, వెళ్లిపోవాల‌ని జ‌న‌సేన కార్యాల‌య ఉద్యోగులు తేల్చి చెప్పారు. దీంతో 24 గంట‌లుగా జ‌న‌సేన…

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ లేద‌ని, వెళ్లిపోవాల‌ని జ‌న‌సేన కార్యాల‌య ఉద్యోగులు తేల్చి చెప్పారు. దీంతో 24 గంట‌లుగా జ‌న‌సేన కార్యాల‌యం వ‌ద్దే ప‌డిగాపులు కాస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర మ‌న‌స్తాపం చెందారు.

ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తి హామీకి తాను క‌ట్టుబ‌డి వుంటాన‌ని, న‌మ్మాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నో మాట‌లు చెప్పారు. నాలుగు ద‌శాబ్దాలుగా చంద్ర‌బాబునాయుడిని చూస్తున్నామ‌ని, ఆయ‌న హామీల్ని న‌మ్మ‌లేమ‌ని వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారు. అయితే తానెంతో నిజాయితీ గ‌ల నాయ‌కుడిని అని, మాట చెబితే చేస్తాన‌ని, ఒకే ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూట‌మి త‌ర‌పున కోరారు.

ఇంత వ‌ర‌కూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికారంలో లేక‌పోవ‌డంతో, ఏమో ఆయ‌న ఏదైనా చేస్తార‌నే ఆశ వివిధ వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల్లో వుండింది. ప‌వ‌న్‌ను న‌మ్మిన వాళ్ల‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. కూట‌మి అధికారంలోకి రాగానే ప‌ర్మినెంట్ చేస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో అంద‌రూ క‌లిసి కూట‌మిని అధికారంలోకి తెచ్చుకున్నారు. హామీల అమ‌లు కోసం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కార్యాల‌యానికి సోమ‌వారం వెళ్లారు. ప‌వ‌న్‌ను క‌లిసి త‌మ గోడు వినిపించాల‌ని ఆశించారు. అయితే ఆయ‌న అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. ఉత్త‌రాంధ్రలో అధికారిక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. దీంతో వాళ్లంతా అక్క‌టే తిష్ట వేశారు. మంగ‌ళ‌వారం త‌మ‌కు అపాయింట్‌మెంట్ ఇస్తార‌ని, స‌మ‌స్య‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లొచ్చ‌ని ఆశించారు. వాళ్ల ఆశ‌ల‌న్నీ అడియాస‌ల‌య్యాయి.

అపాయింట్‌మెంట్ లేద‌ని, ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెళ్లిపోయార‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా జ‌న‌సేనాని కార్యాల‌య సిబ్బంది చెప్పారు. దీంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మండిప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా మ‌హిళా ఉద్యోగులు ఎన్నో స‌మ‌స్య‌ల‌తో కార్యాల‌యం వ‌ద్ద గ‌డ‌పాల్సి వ‌చ్చింద‌ని వాపోతున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన దానికి, ఆచ‌ర‌ణ‌కు చాలా తేడా వుంద‌ని ఆరోపిస్తున్నారు.

14 Replies to “ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ లేదు.. వెళ్లండి!”

  1. సిగ్గు లేని GA….pawan ప్రతి రోజూ కొన్ని వందల మందిని కలుస్తున్నాడు…ఎంతో మంది సమస్యలు తీరుస్తున్నాడు అని కడుపు మంటతో విషం కక్కడం తప్ప…..ఈ 5 yrs లో కనీసం ఒక్కరిని ఐనా కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారా…..

Comments are closed.