అన్నతో రాజీ: షర్మిల లీకులు ఇచ్చుకుంటున్నారా?

వైయస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలతో రాజీ పడినట్లుగా, ఆమెతో ఉన్న ప్రధాన వివాదాన్ని సెటిల్ చేసుకోదలుచుకున్నట్టుగా ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. చెల్లెలుకు ఆస్తుల్లో వాటాలు పంచి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని ఆ…

వైయస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలతో రాజీ పడినట్లుగా, ఆమెతో ఉన్న ప్రధాన వివాదాన్ని సెటిల్ చేసుకోదలుచుకున్నట్టుగా ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. చెల్లెలుకు ఆస్తుల్లో వాటాలు పంచి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని ఆ కథనం చెప్పే సారాంశం. అందుకు ప్రత్యుపకారంగా కాంగ్రెస్ జట్టులో జగన్మోహన్ రెడ్డి చేరడానికి షర్మిల లాబీయింగ్ చేయాలని, అడ్డు పడకుండా ఉండాలని కోరినట్టుగా ఆ కథనం సారాంశం!

అయితే ఈ కథనం పూర్తిగా అవాస్తవమని- ఇలాంటి చర్చలు రాజీలు అన్నీ అభూత కల్పనలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. షర్మిల మీడియాకు ఇలాంటి లీకులు ఇచ్చుకోవడం ద్వారా తాను వార్తల్లో వ్యక్తిగా నిలవడానికి వక్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అసలు అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించిన విభేదాలు లేవని అంటున్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో కుటుంబానికి ఏర్పడిన చాలావరకు ఆస్తులలో షర్మిలకు ఇప్పటికీ వాటాలు ఉన్నాయనే చెబుతున్నారు. ఒకటి రెండు సంస్థలు మాత్రం పూర్తిగా జగన్ కుటుంబం పేరు మీదనే ఉన్నాయి.

అయితే 2019 ఎన్నికల తర్వాత వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కూడా ఆస్తుల పంపకం ఎప్పుడో సెటిల్ అయింది. చాలా వరకు ఆస్తులు ఈడీ గుప్పెట్లో ఉన్నాయి. ఈడీ చేతుల నుంచి బయటకు వచ్చాక వాటాల ప్రకారం స్వాధీనం చేయడం జరుగుతుందని మాత్రమే అప్పట్లో ఒప్పందం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. కొత్తగా పంపకం గురించి మాట్లాడుకోవాల్సినదేమీ లేదని అంటున్నారు.

ఈ వార్తాకథనం అభూత కల్పనేనని చెప్పడానికి మరో కారణం ఏమిటంటే.. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ జట్టులో చేరదలుచుకుంటే గనుక షర్మిల ద్వారా అప్రోచ్ కావలసిన అవసరమే లేదు.. అనేది వినిపిస్తోంది. ఆ కథనంలో చెప్పినట్లుగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ జగన్ పట్ల సానుభూతితో ఉంటే కనుక ఆయన స్వయంగా అధిష్టానాన్ని ఒప్పించి జగన్ను జట్టులోకి తీసుకోగలరు. మధ్యలో షర్మిల ప్రమేయం అవసరం కూడా ఉండదు.

తాము చెప్పినట్టు వినాలని షర్మిలను ఆదేశించగల స్థితిలోనే కాంగ్రెస్ అధిష్టానం ఉంది. పైగా వారి ఇండియా కూటమిలోకి జగన్ వెళ్ళదలుచుకుంటే ఆయనను సమర్ధించి ఆ మేరకు కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చి ఒప్పించగల అనేక జాతీయ పార్టీలు ఉన్నాయి.

యూపీలోని సమాజ్ వాది పార్టీ కానీ, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ గాని, ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పార్టీలే. ఇండియా జట్టులో చేరదలుచుకుంటే వీరందరూ కలిసి కాంగ్రెసును ఒప్పించడం తథ్యం. అందుకోసం తనను నానా మాటలు దూషిస్తున్న చెల్లెలితో బేరానికి వెళ్లవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు అని కూడా చెబుతున్నారు.

తాను మీడియాలో మరుగున పడిపోతున్న తరుణంలో ఏదో ఒక హాట్ టాపిక్ ద్వారా వార్తల్లో వ్యక్తిగా నిలవాలి అనుకోవడం షర్మిలకు అలవాటు అని.. అందుకే ఆమె ఇలాంటి అభూత కల్పన లీకులు ఇచ్చి మీడియాలో కథనాలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిజానిజాలు కాలక్రమంలో తేలే అవకాశం ఉంది.

24 Replies to “అన్నతో రాజీ: షర్మిల లీకులు ఇచ్చుకుంటున్నారా?”

  1. నీ ఆస్థి కోసం రాధాకృష్ణని ఉపయోగించుకున్నావ్.. కానీ నీ A1దున్న ఆడి అధికారం కోసం నిన్ను వాడుకుని వదిలేసాడు..ఇంకోసారి గొర్రెలా నమ్మితే కసాయి లా బాత్రూం కి దె0కపోతాడు.. ఎవరు బెటర్ అక్కాయ్??

  2. ఒక్కటి మాత్రం ఈ ఆర్టికల్ లో క్లియర్ గా రాశారు ..

    సింగల్ సింహానికి .. మేటర్ వీక్ అయిపొయింది..

    కాంగ్రెస్ తో దోస్తీ చేసుకోవాలంటే.. శివ కుమార్ ఉన్నాడు.. మమతా బెనర్జీ ఉంది, అఖిలేష్ యాదవ్ ఉన్నాడు అని చెప్పుకొంటున్నారు గాని..

    కాంగ్రెస్ తనకు తానుగా వచ్చి.. మన సింగల్ సింహం పొత్తు అడుగుతుందని చెప్పుకోలేకపోతున్నారు..

    ఇదండీ.. మన సింగల్ సింహం దుస్థితి..

    సోషల్ మీడియా పులి.. గ్రౌండ్ లెవెల్ లో ఎలక.. జనాలకు మాత్రం సచ్చిన గజ్జి కుక్క..

    1. రజకీయాల్లో సింహాలు పులులు ఉండవ్. వీళ్ళే అనవసరంగా హెచ్చు లు పోయారు .ఒక్కో సారి కాలు పట్టుకోవాలి ఒక్కో సారి పిలక. అదే రాజకీయం .

  3. నీకు తోడుగా ఉన్న రాధాకృష్ణ దెబ్బకి A1ల0గా గాడు దిగొచ్చి ఈరోజు నీకు ఆస్థి ఇస్తున్నాడు… అదే బంధం కొనసాగిస్తే మీ అన్న జెగ్గుల్నుండి YC Party నే లాక్కొవచ్చు ఏమంటావ్ అక్కాయ్??

  4. టీడీపీ, జ్యోతి అండ్ఈనాడు సపోర్ట్ వల్ల షేర్మిళ కు వచ్చిన పవర్ కు భయ0తో ‘ఉచ్చ పోసుకున్న A1సింగిల సింహం.. ఈ భయం ఇలాగే కొనసాగించి అన్నీ విధాలా లాభ పడాలని ఆశిస్తూ నీ అభిమానులు

  5. Joke of the year… Sharmila lost deposits too and shamelessly started party in AP only after Telangana shop shutdown. Babu may tie up with congress by next election as soon as he senses BJP will not come for 4th Term..we have seen this overnight colour changes time and again

  6. బైబిల్ పట్టుకుని తిరిగే అమ్మని అమ్మనా బూతులు తిట్టిన నత్తి బొత్సా ని తండ్రి లాంటి వాడు అన్నవాడు జైలు కి భయపడి చెల్లితో రాయబారం చెయ్యడంటే పేమెంట్ తీసుకునే నీకు నమ్మటం కష్టమేమో కానీ..

  7. బైబిల్-పట్టుకుని-తిరిగే-అమ్మని అమ్మనా-బూతులు-తిట్టిన-నత్తి బొత్సా ని-తండ్రి-లాంటి-వాడు అన్నవాడు-జైలు-కి-భయపడి చెల్లితో-రాయబారం-చెయ్యడంటే పేమెంట్-తీసుకునే-నీకు-నమ్మటం-కష్టమేమో-కానీ..

  8. షర్మిల గురించి ఆంధ్రజ్యోతి లో వార్తలన్నీ నిజాలు అయ్యాయి..

  9. రాజీ అంటున్నావు..కదిరి కి మనిషిని పంపి గొడ్డలి ఏమన్నా తెప్పించనాడా ఏమి బుల్లిరెడ్డి..

  10. *అన్న చెల్లెళ్ళు ఎప్పటికైనా కలుస్తారు, అందులో విశేషం ఏముంది? లీకులు ఇస్తే మాత్రం తప్పేముంది?*

  11. అన్న చెల్లెలు షేర్ల కోసం కొట్టుకు చస్తున్నారు. రాజి అంటూ ఈ బా/ని/స /కు/// క్క కధలు రాస్తున్నాడు

  12. Brother and sister are fighting for shares. Jagga filed a case against his own mother and sister against allocation of Saraswathi shares in NCLT. Banisa kattapa is as usual blabbering about Raaji . Veedi bondha

  13. Brother and sister are fighting for shares. Jagan filed went against his own mother and sister against allocation of Saraswathi shares in NCLT. Banisa kattapa is as usual blabbering about Raaji . Veedi bondha

  14. పొత్తు కూడా కాదు, ఏకంగా విలీనమే అంటున్నారు

    కాంగ్రెస్ పార్టీ జెండాలు మోయడానికి సిద్ధంగా ఉండమని పార్టీ కార్యకర్తలకి ఆదేశాలు వెళ్తున్నాయంట తాడేపల్లి ప్యాలెస్ నుండి!

Comments are closed.