పితూరీలు మాత్రమేనా? ప్రయోజనాలు రాబట్టరా?

వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఏం జరిగిందనే దానిపై బురద చల్లడం ద్వారా మాత్రమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఐదేళ్లు నెట్టేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఇద్దరు కీలక…

వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఏం జరిగిందనే దానిపై బురద చల్లడం ద్వారా మాత్రమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఐదేళ్లు నెట్టేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఇద్దరు కీలక మంత్రులు జగన్ మీద బురద చల్లే పనిలోనే ఉన్నారు. అంతేతప్ప రాష్ట్రం కోసం ఏం సాధిస్తున్నారో అర్థం కావడం లేదు.

ఒకవైపు మంత్రి నారా లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి పాత ప్రభుత్వ వైఫల్యాలను నివేదించి తమ ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వాలని అడిగి వచ్చారు. ఒకరోజు వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక మంత్రి సత్యకుమార్ కూడా అమిత్ షా తో భేటీ అయ్యారు. అదే జగన్మోహన్ రెడ్డి మీద పితూరీలను వినిపించారు. తమ మనుగడ కోసం జగన్ మీద నిందలు వేయడం వారికి అవసరమే. కానీ ఈ పితూరీలతో మాత్రమే సరి పెడతారా? రాష్ట్రానికి ఏదైనా ఫలితం రాబడతారా అనేది ప్రజలకు అర్థం కావడం లేదు!

రాష్ట్ర మంత్రి ఒకరు కేంద్రంలో అత్యంత కీలకంగా చక్రం తిప్పే హోం మంత్రి అమిత్ షాను కలిశారంటే వారి భేటీ నుంచి ప్రజలు ఎన్నెన్నో ఆశిస్తారు. వారి భేటీ వలన రాష్ట్రానికి అనేక కొత్త ప్రయోజనాలు ఒనగూరుతాయని ఎదురుచూచ్తారు. పైగా వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు కనీసం తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చుకుని సత్య కుమార్ రాష్ట్రానికి అదనపు మేలు చేయగలరని ప్రజలు ఆశించడం తప్పు కాదు. కానీ జరుగుతున్నది ఏమిటి?

సత్యకుమార్- అమిత్ షా తో భేటీలో రాష్ట్రాన్ని ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచి పోయారని ఆరోపించారు. ఫలితంగా ప్రస్తుత ప్రభుత్వం వాటిపై వడ్డీల రూపంలోనే ఏడాదికి 75 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నదని నివేదించారు. ఈ లెక్కలలో వాస్తవాలు ఎంతో అనుమానమే. ఎందుకంటే జగన్ ప్రభుత్వం మొత్తం కలిపి రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పారు.

ఇప్పుడు సత్యకుమార్ ఢిల్లీకి వెళ్లి 11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినట్లుగా చెబుతున్నారు. ఈ మీమాంసను పక్కన పెడితే జగన్ చేసిన అప్పుల గోడును కేంద్ర హోంమంత్రికి నివేదించడం వలన సత్యకుమార్ ఏం సాధించదలచుకున్నారు? ఈ అప్పులు మొత్తం తీర్చేయడానికి కేంద్రాన్ని పూనిక తీసుకోమని, సాయం చేయమని అడుగుతున్నారా? పోనీ అలాంటి భరోసా ఏమైనా కేంద్ర హోం మంత్రి ద్వారా సాధించారా? అలాంటివేమీ కనిపించడం లేదు. కేవలం జగన్ మీద బురద చల్లడం నిందలు వేయడం మాత్రమే తమ పనిగా వారు భావిస్తున్నారేమో అనిపిస్తుంది.

కేంద్ర పెద్దలను కలిసినప్పుడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కొత్తగా నిధులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరగాలి. కానీ సత్య కుమార్ హోం మంత్రి కేంద్ర హోం మంత్రి భేటీలో ఆయన అలాంటివి ఏమీ ప్రస్తావించినట్లుగా లేదు. కేంద్ర పథకాలకు సంబంధించి ఈసీలు కూడా ఇవ్వకుండా జగన్ తప్పు చేశారని, ఇప్పుడు తాము పద్ధతిగా అవన్నీ కేంద్రానికి నివేధిస్తున్నామని ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వడం తప్ప సత్యకుమార్ మరో పని చేయలేదు.

తన నుంచి ప్రజలు ఆశిస్తున్నది ఇది కాదు. కేంద్రంలోని బిజెపికి చెందిన వారే కనుక తాను రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు రాబట్టగలరని ప్రజలు కోరుకుంటున్నారు అని మంత్రిగారు తెలుసుకుంటే బాగుంటుంది.

6 Replies to “పితూరీలు మాత్రమేనా? ప్రయోజనాలు రాబట్టరా?”

  1. “జగన్ చేసిన అప్పుల గోడును కేంద్ర హోంమంత్రికి నివేదించడం వలన సత్యకుమార్ ఏం సాధించదలచుకున్నారు?”

    కొత్త అప్పులు

  2. if Kutami govt. poll promises are implemented in true spirit then the sky is the limit of debt … it costs 3 times than earlier ..on the other hand revenues are decreasing in Sand so-called free

Comments are closed.