వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం వీఐపీ ప్రారంభ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన తర్వాత మొదటి సారి ఆయనకు తిరుమలకు వెళ్లారు. తిరుమలలో టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలకడం విశేషం. అంతేకాదు దర్శనానంతరం విజయసాయిరెడ్డికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అధికారంలో లేని వాళ్లకు తిరుమలలో స్వామివారి దర్శనం కూడా బహు కష్టం. ఒకవేళ ప్రతిపక్ష నాయకులకు వీఐపీ దర్శనం కల్పించాలంటే, ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఉంటేనే అధికారులు వారి సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటారు. లేదంటే స్వామివారి దర్శన భాగ్యం గగనమే.
అలాంటిది తిరుమలలో విజయసాయిరెడ్డికి ఏ అధికార హోదా లేకుండానే దర్శన భాగ్యం కల్పించడం విశేషం. ఇటీవల ఆయన వైఎస్ జగన్ కోటరీపై ఘాటు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే లిక్కర్ కేసులో దొరకని దొంగల్ని పట్టిస్తానని కూడా ఆయన హెచ్చరించారు. అయితే ఇదే కేసులో ఆయన్ను కూడా నిందితునిగా చేర్చారు.
కానీ ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్లిన దాఖలాలు లేవు. మిగిలిన వాళ్లంతా న్యాయ స్థానాల్లో బెయిల్ కోసం పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి తనను అరెస్ట్ చేయరనే ఏ ధైర్యంతో విజయసాయిరెడ్డి ఉన్నారో ఆయనకే తెలియాలి. ప్రస్తుతం ఆయన్ను టీటీడీ అధికారులు ప్రత్యేకంగా చూడడం గమ్మత్తైన సంగతే.
సాయీ .. శాంతి ఎక్కడ??
Psr ఆంజనేయులు బెయిల్ కి అప్లై చెయ్యకపోతే వీరుడు శూరుడు అన్నావ్…విజయ్ సాయి పై అనుమానం ఎందుకు? ఆయన కూడా వీరుడు సూరుడే
బూతుల రాణి, వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు రాయలేదేం ఇలాంటి ఆర్టికల్, ఓహ్ ఇంకా ycp లో నే ఉంది కాబట్టా?, ycp మునిగి పోతున్న పడవ బెటర్ నువ్వు కూడా జంప్ చేసేయి సాయి లాగా
లుకౌట్ నోటీసులు ఉన్నవాడు చక్కగా దర్జాగా తిరుగుతున్నాడు. This is India.
మొన్ననే కదా బూమ్ కరుణామయుడు రెడ్డి నాకా టీటీడీ లో 2000 వేలు మంది తెలుసు అన్నాడు. ఎవడో ఒకడితో రికమండేషన్ మీద వచ్చి ఉంటాడు.
ఏదైనా మీ వారు చేసే సంసారం అంటావు అదే ఇతరులు చేస్తే వ్యభిచారం అంటావు ఇదేం లెక్కరా గ్యాస్ ఆంధ్ర . మొత్తానికి నీ కుక్క బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు