వైసీపీ నేత‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట‌

వైసీపీ నేత గౌత‌మ్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది.

వైసీపీ నేత గౌత‌మ్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చే వ‌ర‌కూ ఆయ‌న్ను అరెస్ట్ చేయొద్ద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం చంద్ర‌బాబు స‌ర్కార్‌ను ఆదేశించింది. విజ‌య‌వాడ‌లోని స‌త్య‌నారాయ‌ణ‌పురం శివాల‌యం వీధికి చెందిన గండూరి ఉమామ‌హేశ్వ‌ర‌శాస్త్రితో పైబ‌ర్‌నెట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్‌, వైసీపీ కార్మిక యూనియ‌న్ నేత గౌత‌మ్‌రెడ్డికి ఏడేళ్లుగా స్థ‌ల వివాదం న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది నవంబ‌ర్‌లో శాస్త్రి సోష‌ల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. తన‌ను చంపేందుకు గౌత‌మ్‌రెడ్డి సుపారీ ఇచ్చార‌ని, దుండ‌గులు త‌న‌పై దాడి చేసి, ఇంట్లో ఉన్న ఆస్తికి సంబంధించిన ప‌త్రాలు తీసుకెళ్లార‌ని ఉమామ‌హేశ్వ‌ర‌శాస్త్రి వాపోయారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు గౌత‌మ్‌రెడ్డితో పాటు మ‌రికొంద‌రిపై హ‌త్యాయ‌త్నం కేసును స‌త్య‌నారాయ‌ణ‌పురం ఠాణాలో న‌మోదు చేశారు.

తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు. ప‌లువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కిందిస్థాయిలో కోర్టులో గౌత‌మ్‌రెడ్డికి తాత్కాలికంగా ఉప‌శ‌మ‌నం ల‌భించింది. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆదేశిస్తూ, ముంద‌స్తు బెయిల్‌కు మాత్రం నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఒక‌ట్రెండు ద‌ఫాలు పోలీసుల విచార‌ణ‌కు గౌత‌మ్‌రెడ్డి హాజ‌ర‌య్యారు.

అయితే ముంద‌స్తు బెయిల్ ల‌భించ‌క‌పోవ‌డంతో గౌత‌మ్‌రెడ్డి ప‌రార‌య్యారు. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించింది. ప్ర‌భుత్వం కేవియ‌ట్ వేయ‌డంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం త‌ప్పు ప‌ట్టింది. వారంలోపు ప్ర‌భుత్వాన్ని అఫిడ‌విట్ వేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

5 Replies to “వైసీపీ నేత‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట‌”

  1. సింహం చుట్టూ ఇంత పిరికిపందల? కేసు పడగానే పరారీ…గౌతమ్, పేర్ని, చిన్న సజ్జల, RGV అబ్బో లిస్ట్ పెద్దదే

  2. ఒక ప్రైవేట్ వ్యక్తి కి సంబందించిన కేసు లో ప్రభుత్వం ఏకంగా కేవియట్ వేసేసి ఏకంగా కోట్లు ఖర్చు పెట్టి సిద్దార్థ్ లూథ్రా ని పెట్టి మరీ వాదిస్తే… సుప్రీమ్ కోర్ట్ చీవాట్లు వేసి, గౌతమ్ రెడ్డి కి బెయిల్ ఇచ్చింది…

    ఇప్పుడు లాయర్ లకి కోట్లు ఖర్చు పెట్టొచ్చు… అనవసరమైన కేసు ల్లో కూడా అడ్డంగా వాదించొచ్చు.. మన ఇష్టం కదా..

  3. భారత రామాయణ గ్రంధాలలో నేరస్తులను నేరస్తులకు అక్రమాలకు సహాయపడేవారి ని ఎలాగా శిక్షించాలో రాముడు కృష్ణుడు చెప్పేరు నేరస్తులను శిక్షించేటప్పుడు పూర్తిగా న్యాయ సూత్రాలు పాటిస్తే కొంతమందిని శిక్షించలేకపోవచ్చు దానికి ఉదాహరణ వాలి వధ రాజు గారిని కొట్టిన కేసులో విజయపాల్ నిజం చెపుతాడా చచ్చిన చెప్పడు అటువంటి కేసు ల్లో వాయింపు తప్ప వేరే మార్గం లేదు ఈ కేసు అలాంటిదే

Comments are closed.