స‌జ్జ‌ల అంతు తేల్చ‌డానికి క‌డ‌ప‌కు వెళ్తావా ప‌వ‌న్‌?

వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానురీతిలో భూదోపిడీకి పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో స‌జ్జ‌ల అంశం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆ మ‌ధ్య స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ ప్రాజెక్ట్ కొంత అట‌వీ భూమిలో ఉంద‌ని తెలిసి, నేరుగా స్పాట్‌కు వెళ్లారు. దీనికి కార‌ణం ఆయ‌న అట‌వీశాఖ మంత్రి కావ‌డ‌మే. అయితే రెవెన్యూ విచార‌ణ‌లో అంత లేద‌ని తేలిపోయింది. దాన్ని ప‌క్క‌న పెడితే, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు చేతినిండా మ‌రో ప‌ని దొరికింది. అదేంటంటే… క‌డ‌ప న‌గ‌ర శివార్ల‌లో వైసీపీ ప్ర‌భుత్వంలో నంబ‌ర్ 2గా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అధికార అండ‌తో ఆయ‌న సోద‌రులు ఏకంగా 42 ఎక‌రాల ఆక్ర‌మించార‌ని టీడీపీ అనుకూల మీడియాలో క‌థ‌నం వ‌చ్చింది.

ఆ అట‌వీ భూమిలో మామిడి, నేరేడు, టేకు త‌దిత‌ర పంట‌ల్ని సాగు కూడా చేశార‌నేది ఆ క‌థ‌నం సారాంశం. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కాస్త సానుకూల అభిప్రాయం ఉన్న‌ట్టు , గ‌తంలో డిప్యూటీ సీఎం మాట‌ల్ని బ‌ట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

ఏకంగా 42 ఎక‌రాల్ని స‌జ్జ‌ల సోద‌రులు ఆక్ర‌మించార‌ని స‌ర్వే నంబ‌ర్ల‌తో స‌హా వివ‌రాలు ఇచ్చారు. ఇదే నిజ‌మైతే ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా స్పందించాల్సి వుంటుంది. అట‌వీశాఖ మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు త‌నే నేరుగా సంఘ‌ట‌నా స్థ‌లాల‌కు వెళుతున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఇప్పుడు క‌డ‌ప శివారులోని చింత‌కొమ్మ‌దిన్నె మండ‌లంలోని రెవెన్యూ ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌కు గురైన‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అట‌వీ భూమిని ప‌వ‌న్ ప‌రిశీలిస్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానురీతిలో భూదోపిడీకి పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో స‌జ్జ‌ల అంశం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీన్ని రాజ‌కీయంగా వాడుకునేందుకైనా ప‌వ‌న్‌క‌ల్యాణ్ నేరుగా వెళ్లి, వివాదం చేస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌లే ఆయ‌న క‌డ‌ప‌కు వెళ్లి, వైసీపీ నేత‌ల చేత‌ల్లో దాడికి గురైన గాలివీడు ఎంపీడీవోను ప‌రామ‌ర్శించి , తీవ్ర హెచ్చ‌రిక‌లు చేసి వ‌చ్చారు.

20 Replies to “స‌జ్జ‌ల అంతు తేల్చ‌డానికి క‌డ‌ప‌కు వెళ్తావా ప‌వ‌న్‌?”

  1. ప్రభుత్వ సలహాదారుడు అదీ మా “లెవెన్ గాడి మ0చం మేట్ ఐన సజ్జల” జస్ట్ ఓ 42 ఎకరాలు, అదీ “ప్రభుత్వ భూమి”ని కూడా కొట్టేసే అధికారం లేదా అధ్యక్షా??

    ఆఫ్టరాల్ దీనికే ఇంత ఊగిపోతున్నాడు, మరి అసలైన మిగతావి తెలిస్తే ఏమైతడో ఏంటో??

  2. గత కొన్ని సంవత్సరాలుగా మీ వెబ్సైట్ లో న్యూస్ చదువుతున్నప్పటి నుండి, నేను మిమ్మల్ని మహాభారతం లో శకునిగా ఊహించుకుంటూ ఉండేవాడిని.. రోజు రోజుకి ఆ ఊహ కరెక్టే అనిపిస్తుంది.. అక్కడ కౌరవులకి శకుని..ఇక్కడ వైసిపి కి గ్రేట్ ఆంధ్ర… ఇది పక్కా

      1. pk gaadu emi chesadu..

        naa m chesadu raa picha nayala..

        ippatiki 7 months ayindi..vaadi baada aa burra takkuva n@@gu babu gaadini cabinet lo ki tiskuvodame objective..

        praja samkshemu , bolli cbn gaadu chesina donga vagdanaalu gurunchi emaina matladaada??

        muyi raa kuyya chaalu gaani

  3. అమ్మ సజ్జల అన్ని ఎకరాలు కొట్టేసావా? విడుదల రజని వాటా ఎంత? బారతి రెడ్డి వాట ఎంత?

Comments are closed.