కాంగ్రెస్ సీఎంలందరూ అధిష్టానం చెప్పిందే వింటారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏ విధానం పాటిస్తుందో రాష్ట్రాల్లో దాన్నే పాటిస్తారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి పనిచేస్తోంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఈ కూటమి బీజేపీకి ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడైన పారిశ్రామికవేత్త అండ్ వ్యాపారవేత్త అయిన గౌతమ్ ఆదానీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదానిపై పార్లమెంటులోనూ బయటా విరుచుకుపడుతుంటారు. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలది కూడా ఇదే విధానం.
అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆదానీని వ్యతిరేకిస్తుండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆదానీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ మధ్య స్కిల్ యూనివర్సిటీకి అదానీ వంద కోట్ల విరాళం అందించగా విమర్శలు రావడంతో రేవంత్ ఆ డబ్బు వెనక్కి ఇచ్చేశాడు.
కానీ ఆదానీతో కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలను రేవంత్ ఇంకా రద్దు చేసుకోలేదట. సంకీర్ణ ధర్మాన్ని కట్టుబడి డీఎంకే ఆదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందాలు రద్దు చేసుకోకుండా ఆదానీతో అంటకాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలో విద్యుత్, సిమెంట్, డాటా సెంటర్లు ఇతర రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదానీతో ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యుత్ పంపీణీ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఆదానీకి అప్పగించిందన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాదులోని పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేసే పని ఆదానీకి అప్పగించింది ప్రభుత్వం.
అక్కడ కరెంటు మీటర్ల వివరాలు సేకరిస్తున్నారని, దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని తెలుస్తోంది. మొత్తమ్మీద కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆదానీని వ్యతిరేకిస్తుండగా రేవంత్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా తన దారిన తాను పోతున్నట్లు తెలుస్తోంది.
పాతబస్తీ లో విద్యుత్ బిల్లులు కట్టరు. అడిగితే గొడవలు చేస్తారు.
వాళ్ళ బిల్లులు మిగతా రాష్ట్రం కడుతోంది..
ప్రీపైడ్ మీటర్లు పెట్టి, రీచార్జ్ అయిపోగానే కరెంట్ కట్ చేసే బాధ్యత అదానికో ఇంకోడికో ఇవ్వక తప్పదు