ఈ పూజ అఫీషియల్ పూజ?

ఇప్పుడు అంటే పూజను అఫీషియల్‌గా చేస్తున్నారు. కానీ, ఈ సినిమా తెర వెనుక పనులు దాదాపు అర్నెల్ల నుంచి ఏడాది కిందటే ప్రారంభమయ్యాయి.

ఏ పనికైనా, ఏ ప్రారంభానికైనా పూజ చేయడం హిందూ సంప్రదాయం. సెంటిమెంట్లను బలంగా నమ్మే సినిమా వాళ్లు పూజ కార్యక్రమాలను కచ్చితంగా చేస్తుంటారు. చాలా మంది సింపుల్‌గా తమ ఆఫీస్‌లో సైలెంట్‌గా పూజ చేసి పనులు ప్రారంభించేస్తారు. ఇష్టం ఉంటే ఓ ఫోటో వదులుతారు మీడియాకు, లేదంటే అదీ ఉండదు. ఆ తర్వాత ఎప్పుడో ఫస్ట్ లుక్ ఇస్తారు. కొందరు అందరినీ పిలిచి, ఏ స్టూడియోలోనో భారీగా పూజ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మోస్ట్ అవైటింగ్ మూవీ రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ సినిమా ప్రారంభ పూజ గురువారం నాడు జరుగుతుందనే వార్తలు బయటకు వచ్చాయి. రాజమౌళి అండ్ టీమ్ మొత్తం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీని తమ స్థావరంగా చేసుకుని ఉంది. అక్కడే దాదాపు అన్ని పనులు పూర్తవుతున్నాయి. అక్కడే ఈ పూజ నిర్వహిస్తారు.

అయితే, ఇక్కడ పాయింట్ ఇది కాదు. పుష్యమాసం ప్రారంభం అయ్యాక సంక్రాంతి వరకు శూన్యమాసం అంటారు. ఆ సమయంలో ఏ కొత్త పనులు చేపట్టరు. ముహూర్తాలు ఉండవు. ఇలాంటి టైమ్‌లో సినిమా పూజ ఎందుకు? అన్నది హిందూ ముహూర్తాల గురించి తెలిసిన వారికి వచ్చే అనుమానం. పైగా, రాజమౌళి కుటుంబంలో కూడా కీరవాణి లాంటి ఇలాంటివి తెలిసిన వ్యక్తులు ఉన్నారు.

దీనికి సమాధానం కూడా ఉంది. ఇప్పుడు అంటే పూజను అఫీషియల్‌గా చేస్తున్నారు. కానీ, ఈ సినిమా తెర వెనుక పనులు దాదాపు అర్నెల్ల నుంచి ఏడాది కిందటే ప్రారంభమయ్యాయి. అంటే స్క్రిప్ట్ డిస్కషన్లు, స్టోరీ బోర్డులు, లోకేషన్ రెక్కీలు, కాస్టింగ్ డిస్కషన్లు అన్నీ. అంటే అప్పట్లో ఒక మంచి ముహుర్తం చూసి రాజమౌళి అండ్ టీమ్ ఒక పూజ ను నిరాడంబరంగా చేసేసి వుంటారు. కానీ సినిమాను స్టార్ట్ చేస్తున్నట్లు అఫీషియల్ గా చెప్పాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనుకోవాలి.

ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే ప్రారంభం కాదు. ఏప్రిల్, మే కాలం నుంచి ప్రారంభమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్, ఓ విదేశీ హీరోయిన్ కూడా సినిమాలో ఉంటారని సమాచారం.

10 Replies to “ఈ పూజ అఫీషియల్ పూజ?”

  1. మగధీర,యమదొంగ లాంటి ప్లాప్ లు ఇచ్చిన డైరెక్టర్ కి ఇది ఒక గుడ్ మూవీ అవొచ్చు

  2. ఏప్రిల్ మే నెలలో నా మా మహేష్ బాబు వల్ల అసలు కాదు శీతాకాలం పెట్టుకోండి

Comments are closed.