పోయారు.. మోస‌పోయారు!

ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూట‌మి నేత‌ల అలివికాని హామీల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జలు మోస‌పోయార‌నే చ‌ర్చ‌.. సీఎం చంద్ర‌బాబు తాజా మాట‌ల‌తో స్ప‌ష్ట‌మైంది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూట‌మి నేత‌ల అలివికాని హామీల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జలు మోస‌పోయార‌నే చ‌ర్చ‌.. సీఎం చంద్ర‌బాబు తాజా మాట‌ల‌తో స్ప‌ష్ట‌మైంది. న‌మ్మితేనే మోస‌పోతార‌ని పెద్ద‌లు అంటుంటారు. ఇప్పుడు మ‌న పాల‌కుల విష‌యంలో ప్ర‌జ‌లు కూడా అలాంటి అభిప్రాయానికే వ‌చ్చే ప‌రిస్థితి. నాలుగు ద‌శాబ్దాల పైబ‌డి రాజ‌కీయ అనుభ‌వ‌శాలి అయిన చంద్ర‌బాబు గురించి ఏవేవో ఊహించుకుంటే, చివ‌రికి మోస‌పోయామ‌నే ఆవేద‌న క‌లిగే దుస్థితి.

మీడియా ప్ర‌తినిధుల‌తో సీఎం చంద్ర‌బాబు నిర్వ‌హించిన చిట్‌చాట్‌లో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించారు. వాటి గురించి తెలుసుకుందాం.

“మోయ‌లేని పాపాలు జ‌గ‌న్ చేశారు. జ‌గ‌న్ చేసిన పాపాల‌న్నీ మ‌మ్మ‌ల్నే మోసి మునిగిపొమ్మంటే సాధ్యం కాదు. రాత్రికే రాత్రే స‌రిదిద్ద‌డానికి మా ద‌గ్గ‌ర మంత్ర దండం లేదు. దిద్దుబాటుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది”

“ఇంకా ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, త‌ల్లికి వంద‌నం, అన్న‌దాత సుఖీభ‌వ వంటివి ఇవ్వాలి. ఒక‌దాని వెంట ఒకటి ఇస్తాం. మేం సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాలు ప్ర‌క‌టించేట‌ప్పుడు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై మాకున్న అంచ‌నా వేరు. కానీ అధికారంలోకి వ‌చ్చాక లోతుగా చూస్తే ఎంత ఘోరంగా వుందో తెలిసింది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు ఇంత లోతుగా తెలియ‌దు”

మూడు ద‌ఫాలు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబుకు సూప‌ర్‌సిక్స్ హామీలిచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి గురించి తెలియ‌ద‌ని చెప్ప‌డం దేనికి సంకేతం? ఎన్నిక‌ల ప్ర‌చారంలో అలివికాని హామీలిస్తుంటే, వీటిని అమ‌లు చేయ‌డానికి రాష్ట్ర బ‌డ్జెట్ స‌రిపోదు క‌దా అని ప్ర‌శ్నిస్తే, సంప‌ద సృష్టించి, అమ‌లు చేస్తాన‌ని చెప్పడాన్ని జ‌నం మ‌రిచిపోతారని అనుకుంటున్నారా? ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని తెలియ‌ద‌ని చెప్ప‌డం అంటే… హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికే అనే అనుమానం బ‌ల‌ప‌డుతోంది.

జ‌గ‌న్ పాపాల‌న్నీ ఎవ‌రిని మోయాల‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు? మోయ‌డానికి ఎవ‌రున్నారు? ఇప్ప‌టికే జ‌నంపై మోయ‌లేని విద్యుత్ చార్జీల‌ను వేశారు క‌దా? ఇంకా ఏం మోపాల‌ని చంద్ర‌బాబు మ‌న‌సులో అనుకుంటున్నారో జ‌నానికి తెలియాల్సిన అవ‌స‌రం వుంది.

సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల్ని ఒక‌దాని వెంట అమ‌లు చేస్తామంటే… ఎన్నిక‌ల ఏడాదిలో అన్న‌దాత సుఖీభ‌వ‌, త‌ల్లికి వంద‌నం అందిస్తార‌ని అనుకోవాలా? సీఎం మాట‌లు వింటుంటే, ఇదే అభిప్రాయం జ‌నంలో క‌లుగుతోంది. కొత్త ఏడాదిలో అడుగు పెట్టిన శుభ‌సంద‌ర్భంలో జ‌నానికి చంద్ర‌బాబు షాక్ ఇచ్చార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇప్ప‌ట్లో సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల‌పై ఆశ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు.

26 Replies to “పోయారు.. మోస‌పోయారు!”

  1. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం , మోసం చెయ్యడం , వెన్నుపోటు పొడవటం చంద్రబాబు కి బ్లడ్ లోనే లేదు . 2014 – 19 పరిపాలన అద్భుతం.

  2. గార్నిష్ చేయడానికి కొత్తిమీర పట్టుకుని కొత్తిమీర గాళ్లు రెడీ! వాచ్ ఇట్

  3. పే.. tm కు..క్కలు ప్రచారం మాత్రమే. ఈ పధకాలు గురించి ఎవడూ ఎదురు చూడటం లేదు. జరిగిన నా..శనం చాలు…సాగునీటి ప్రాజెక్టు లు,మౌళిక వసతులు, ఉపాధి కల్పన..అబివృద్ది ..ఇవి మాత్రమే జనాలు కోరుకుంటుంది.

  4. దేనికి సంకేతం అంటే రహస్యGOల ద్వారా మన అన్న ఎంత బొక్కడో తెలియని సందిగ్తత సంకేతం

  5. అవును.. లక్షల కోట్లు సంక్షేమం పేరుతో డబ్బు పంచేసి..ఓట్లు కొనేద్దామనుకుని.. జగన్ రెడ్డి పోయాడు.. మోసపోయాడు..

    సంక్షేమం మాత్రమే ఓట్లు కురిపిస్తే.. జగన్ రెడ్డి 11 కి ఎలా పడిపోయాడో .. మీ “కొత్తిమీర” బుర్రలకు అర్థం కాదు..

    ..

    పథకాలు చంద్రబాబు ఇవ్వలేదు అని ప్రశ్నించేముందు.. 99.99% ఇచ్చి మీరు ఏమి సాధించారో చెప్పుకుని ఏడవండి..

    ..

    ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది .. ఉద్యోగాలు.. ఉపాధి.. అభివృద్ధి.. అమరావతి.. పోలవరం..

    ఇవి ఓట్లు కురిపించకపోయినా పర్లేదు.. మా భవిష్యత్తు తరాలు బాగుపడతాయి.. ఇంకో వందేళ్లయినా చంద్రబాబు పేరు గుర్తుంటుంది..

    1. 150+ నుండి 11 కు పడేసింది మందుబాబుల ఓట్లు… అతిగా ఊహించుకుంటే 160+ కూడా 16 అవ్వొచ్చు… బాబుగారేమీ ఓటమెరుగని ధీరుడేమీ కాదుగా! Let’s hope he will do something good 😊

      1. మద్యపాన నిషేధం చేస్తాము అన్నప్పుడు కూడా ఈ మందుబాబుల ఓట్లతోనే 151 తెచ్చుకొన్నాడు..

        మద్యపాన నిషేధం చేసేస్తామని హామీ ఇచ్చినప్పుడు మందు బాబులు ఓట్లు వేయకూడదు కదా.. మరి జగన్ రెడ్డి కి 151 సీట్లు ఎలా వచ్చాయో కాస్త చెపుతారా..?

        జగన్ రెడ్డి పతనానికి ఎవ్వరూ కారణం కాదు.. అతనే కారణం..

        ..

        ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు.. ఆ ఒక్క ఛాన్స్ అతను ప్రజల్ని నిలువునా ముంచేశాడు.. ఏ ఒక్క వర్గము సంతోషం గా లేరు.. అది నీకు అర్థం కాదు.. మీ నాయకుడికి అర్థం కాదు.. అందుకే మీ నాయకుడు రాజకీయాలకు పనికి రాడు ..

          1. మద్యపాన నిషేధం చేస్తాము అన్నప్పుడు కూడా ఈ మందుబాబుల ఓట్లతోనే 151 తెచ్చుకొన్నాడు..

            మద్యపాన నిషేధం చేసేస్తామని హామీ ఇచ్చినప్పుడు మందు బాబులు ఓట్లు వేయకూడదు కదా.. మరి జగన్ రెడ్డి కి 151 సీట్లు ఎలా వచ్చాయో కాస్త చెపుతారా..?

            జగన్ రెడ్డి పతనానికి ఎవ్వరూ కారణం కాదు.. అతనే కారణం..

            ..

            ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు.. ఆ ఒక్క ఛాన్స్ అతను ప్రజల్ని నిలువునా ముంచేశాడు.. ఏ ఒక్క వర్గము సంతోషం గా లేరు.. అది నీకు అర్థం కాదు.. మీ నాయకుడికి అర్థం కాదు.. అందుకే మీ నాయకుడు రాజకీయాలకు పనికి రాడు ..

  6. 40 years industry, longest serving CM, PM candidate, no clarity on state financial position….🤣🤣🤣 it’s amazing of wealth creating CM…

  7. I don’t think CBN will cheat people with his promises this time. CBN knows it’s his last term and will retire by next term/election.

    Any damages in current rule makes unrecoverable loss to Lokesh’s political future. Lokesh is not capable to grow himself.

  8. ఇప్పటికె జగన్ ఇస్తున్న ఉచ్చితాలు అన్ని ఇస్తున్నారు! పెన్షన్ పెంచారు, అన్న కాంటీలు మొదలు పెట్టారు! ఇక చాలు!!

    నిజానికి ఈ ఉచ్చితాల నుంది అబిరుద్ది వైపు తీసుకెల్లి ఈ స్తారన్ని రస్తిస్తుంది చంద్రబాబె!

    1. ఈ jagan మొసాలు గురించి రాసావా గురివిందా?

      సంపూర్ణ మద్య నిషెదం

      ప్రత్యెక హొదా (సంజీవిని)

      CPS రద్దు

      మెగా DSC, కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ

      ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్

      వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.

      దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్

      రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం.

      ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు

      రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు

      45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్ వర్తింపు.

      పెదలకి 25 లక్షల పక్కా ఇళ్ళ నిర్మానం

      వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు

      పొలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి.

      ప్రతి పిల్లవాడికి అమ్మ వడి,

      రాజదాని నిర్మానం

      నిత్యవసర దరల తగ్గింపు,

  9. ఏపీ ప్రజలను మోసం చేసినది ఎవరు? అలవికాని హామీలు ఇచ్చినది ఎవరు ? ఉచిత పథకాల పేరుకు డబ్బులు లేక చివరకు చెత్త మీద పన్ను వేసి చత్ర ముఖ్యమంత్రి అయింది ఎవరు ? అన్ని ధరలు తగ్గిస్తానని ప్రమాణస్వీకారం రోజు చెప్పిన మాటకు కట్టుబడ్డాడా ? ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచేసి ప్రజలను నడ్డి విరిచింది ఎవరు? తన సోకుల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టింది ఎవరు ? మీ అన్న కన్నా మోసం చేసిన మోసగాడు ఈ భూ ప్రపంచంలో భూతద్దం ఏసి వెతికిన దొరకడు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పడానికి సిగ్గుండాలి

    ఆ సిగ్గు శరము మానము అభిమానము అన్ని జగన్కు అమ్ముకున్నావు. ఇంక నీ దగ్గర మిగిలినది ఏమిటి వంకాయ తప్ప.

  10. ఈ ఉచ్చితాల పిచ్చి నుండి… అబిరుద్ది వైపు మళ్ళించి… నా రాష్ట్రాని రక్షించు స్వామి!

  11. ఉచితాలు అనుచితంగా,అవసరమైనవే కాకుండా, అనవసరమైన పథకాలతో,ఇష్టమొచ్చినట్టు పంచడంవల్ల

    విద్యావంతులు,మేధావులు, ఆర్ధిక నిపుణులు, ఆఖరికి పార్టీ శ్రేణులు కూడా భయపడ్డారు.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలిచ్చిన అన్ని పథకాలకూ సున్నం రాశారు.. అప్పులు కుప్పలు పెరిగిపోతున్నాయ్, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోతున్నాయ్, మధ్యతరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి.ఏంటో పాలకుల తీరు అర్ధంకావట్లేదు.

Comments are closed.