కార్యకర్త మృతి పాపం లోకేష్ కు అంటదా?

చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక రూపంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించే కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించారు. వీకెండ్ రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పార్టీ మంగళగిరి కార్యాలయంలో మంత్రులు, ఇతర సీనియర్ నాయకులు…

చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక రూపంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించే కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించారు. వీకెండ్ రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పార్టీ మంగళగిరి కార్యాలయంలో మంత్రులు, ఇతర సీనియర్ నాయకులు అందుబాటులో ఉండి.. అక్కడకు వచ్చే ప్రజలనుంచి వినతులు స్వీకరిస్తారు. ఏయేరోజుల్లో ఏ మంత్రులు ఉంటారో ముందుగానే ప్రకటిస్తుంటారు. ఈ కార్యక్రమం స్వరూపం బాగానే ఉంది. కానీ ఆచరణలో ఇది ప్రయోజనం కలిగిస్తున్నదా? లేదా, ప్రాణాలు తీస్తున్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

తెలుగుదేశం కార్యకర్త ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారంటే దానికి ప్రధాన కారణం.. ప్రజావేదిక అనే ప్రహసనం నడిపిస్తున్న పార్టీ నాయకులు, తమ కార్యకర్త కష్టాన్ని చెవిన వేసుకోకపోవడం వల్లనే అనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కోట వెంకటేశ్వర రెడ్డి (బుజ్జిరెడ్డి) ఆత్మహత్య చేసుకోవడానికి నారాలోకేష్ నిర్లక్ష్యం కూడా ఒక కారణమని, ఆ పాపంలో అతనికీ భాగం ఉన్నదని ప్రజలు అంటున్నారు.

ఆ గ్రామంలో వినాయకచవితి వేడుకల సమయంలో చిన్న ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గ్రామంలో కిరాణా కొట్టు నిర్వహించే ఈ బుజ్జిరెడ్డికి, కుంచాల వెంకటేశ్వరరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి, మంచాల పండు అంకిరెడ్డి అనే వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ వ్యవహారంపై పోలీసు కేసు కూడా నమోదు అయింది. గ్రామంలో పోలీసు పికెట్ కూడా పెట్టారు. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి.. కేసు పెట్టినందుకు బుజ్జిరెడ్డిని గ్రామ బహిష్కరణ చేశారు. అతని కిరాణా కొట్టులో ఎవరూ సరుకులు కొనకూడదని ఆదేశించారు.

తన బాధ మొత్తం చెప్పుకోవడానికి బుజ్జిరెడ్డి అక్టోబరు 1వ తేదీన మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్లి మంత్రి నారా లోకేష్ కు చెప్పుకోవాలని ప్రయత్నించారు. అయితే మంత్రిని కలవడానికి కుదర్లేదు. పార్టీకోసం కష్టపడుతున్న తనకు పార్టీ నాయకుడిని కలిసే అవకాశం కూడా రాకపోవడం పట్ల మనస్తాపం చెందారు. అక్కడికక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికి ప్రాణాపాయం తప్పించి ఇంటికి తీసుకువచ్చారు గానీ.. అదే బాధలో ఉన్న బుజ్జిరెడ్డి శుక్రవారం రాత్రి ఇంటిముందున్న పందిరికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రజావేదిక అనే డ్రామా నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను స్వీకరిస్తున్నట్టుగా- పరిష్కరించేస్తున్నట్టుగా ప్రకటనలు విడుదల చేస్తున్న నాయకుల్లో ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టే తేలుతోంది. నారా లోకేష్ కనీసం బుజ్జిరెడ్డి గోడు వినిఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత.. గ్రామం నుంచి వెలివేసిన పెద్దలు వేసీపీ కార్యకర్తలు అంటూ.. పాపాన్ని వైసీపీ మీద నెట్టడానికి అసహ్యకరమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ చావుకు అసలు కారకుడు నారా లోకేషే అని పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు.

6 Replies to “కార్యకర్త మృతి పాపం లోకేష్ కు అంటదా?”

    1. ఆల్రెడీ ఉన్నోడు బొక్క లోకి పోయాడా ??? GA కి వాటా ఇవ్వలేదు అని తీసేసాడా ??!!!

  1. జనరల్ గ ఇలాంటి ఉరేగింపుల్లో జరిగే ఘర్షణలు టీ కప్పు లో తుఫాను లాంటివి ఒక పండగ కి ఇలాంటి గొడవలు పంచాయితీలు జరిగి ఇంకో పండగ కి తీసేస్తుంటారు …అందుకే పోలీసులు కానీ మండల స్థాయి నాయకులే ఏ పార్టీ కి చెందిన వారు ఐన ఇలాంటి వాటి లో జోక్యం చేసుకోరు….అలాంటిది లోకేష్ చంబా లు ఈ స్థాయి గొడవల్లో ఎందుకు తలా దూరుస్తారు….చాల గ్రామాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి….ఇలాంటివి

  2. RBK, సచివాలయం, విల్లగె క్లినిక్ పేరుతొ ఎంతో మంది కార్యకర్తలు ఉసురు పోసుకున్న జగన్ చేసిన పాపం గుర్తుకులేదా

Comments are closed.