విశాఖపట్నానికి రాజధాని హోదా ఉందా లేదా అన్నది ఎపుడూ ఒక చర్చ. అది ఈనాటిది కాదు మద్రాస్ స్టేట్ నుంచి ఏపీ విడిపోయిన నాటి నుంచి చర్చగానే ఉంది. విశాఖను రాజధానిగా చేయాలని నాడే డిమాండ్ ఉంది.
విశేషంగా చెప్పుకోవాల్సి వస్తే ఆనాటికీ ఈనాటికీ కూడా ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖ మాత్రమే ఉంది. కానీ ఆనాడు కర్నూల్ రాజధానిగా ఒక వర్గం, విజయవాడ రాజధాని చేయాలని మరో వర్గం ఇలా అధికార పార్టీలలోనూ పంతాలు పట్టింపులు ఏర్పడ్డాయి. మొత్తానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కర్నూల్ నే రాజధానిగా పెద్దలు చేసుకున్నారు.
అయితే నాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం ఎన్నుకున్నది ఉత్తరాంధ్రలోని ఎస్ కోట నుంచే అన్నది ఎవరూ మరవరాదు. ఆ తరువాత ఉత్తరాంధ్రకే చెందిన నాటి స్పీకర్ విశాఖను రాజధానిగా చేయాలని తీర్మానం పెట్టారు. విశాఖలోనే ఒక నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. విశాలాంధ్ర కనుక లేకుంటే 1956లోనే విశాఖ రాజధాని అయ్యేదని చెబుతారు.
ఉమ్మడి ఏపీ రెండుగా చీలిన తరువాత చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం తొలి మంత్రి వర్గం సమావేశం విశాఖలోనే జరిగింది. ఆ తరువాత విశాఖలోనే వైసీపీ ప్రభుత్వంలోనూ కీలకమైన జాతీయ అంతర్జాతీయ సదస్సులు ఎన్నో జరిగాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని వైసీపీ ప్రతిపాదించింది. కానీ దాని అమలు లో వైసీపీ చొరవ చురుకుదనం చూపించలేకపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధాని అని అంటోంది.
అయితే విశాఖను కూడా రాజధానిగా చూస్తామని చెబుతోంది. ఆ రాజధానికి ఒక పేరు పెట్టింది. అది ఆర్ధిక రాజధాని. దీనికి నిర్వచనం ఏమిటో ఎవరూ చెప్పలేరు. అదొక బ్రహ్మపదార్థం లాంటి మాట. అయినా విశాఖ వాసులు సంతోషించేలా రాజధాని ట్యాగ్ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం న్యాయం చేసినట్లే.
ఈ మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు ఏమిటి అంటే విశాఖకు హైకోర్టు బెంచ్ అయినా ఇవ్వడం లేదు. కర్నూల్ కి హైకోర్టు బెంచ్ ని ప్రతిపాదిస్తున్నారు కానీ విశాఖ నుంచి న్యాయవాదులు దశాబ్దాలుగా కోరుతున్నా ఇవ్వడం లేదు. కర్నూలులో హై కోర్టు పెట్టమంటే బెంచ్ తో సరిపెడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.
ఆర్థిక రాజధాని అంటే ఏంటో గ్రేట్ ఆంధ్ర జర్నలిస్టులవారికి తెలీదంటా.. అదో బహ్మ పదార్థం అనుకొంటున్నారు.. సారూ..
అమెరికా కి న్యూయార్క్ ఎలాగో..
ఇండియా కి ముంబయి ఎలాగో..
ఆస్ట్రేలియా కి మెల్బోర్న్ ఎలాగో..
చైనా కి హొంగ్ కాంగ్ ఎలాగో..
అలాగన్నమాట..
అభివృద్ధి అంతా ఒక్క చోటే పెడితే.. ఏడుస్తారు..
అభివృద్ధి వికేంద్రీకరిస్తే.. రెట్టింపు ఏడుస్తారు..
అందుకే.. ఏడ్చేవాళ్లకి 11 ఇచ్చి పక్కన పెట్టారు.. మాకు 164 ఇచ్చి మమ్మల్ని పని చేసుకోమన్నారు..
ఐస్ ఇట్ క్లియర్.. సారూ..?
మీరొక క్లారిటీ మిస్ అవుతున్నారు నిద్ర పొతే లేపొచ్చు నటిస్తే ????!!
నటిస్తుంటే.. ఎడమ కాలితో తన్ని లేపాలి..
ఫేక్ ప్రచారం అని తెలియక ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపిస్తే తనకు ఇష్టం వచ్చినట్లు పాలిస్తే ప్రజలు ప్రతిసారీ మోసపోరు కదా ఈసారి ప్రతి పక్షానికి కూడా పనికి రావు అని మూలన కూర్చోబెట్టారు..
మరో ఛాన్స్ కోసం పాట్లు తప్పవు..
ఈసారి అయినా కాస్త మారి ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజల మనసు గెలిస్తే గాని సింహాసనం దక్కదు..
విశాఖవాసులు సౌమ్యులు, శాంతికాముకులు. అలాంటిది రాజధాని పేరు చెప్పి ఐదేళ్ళు వాళ్ళని బెంబేలెత్తించారు. చివరకు ఒక సిట్టింగ్ ఎంపి భార్యని, కొడుకుని కిడ్నాప్ చేసి తమ సొంత ఇంట్లోనే ఉంచి హింసించినా దిక్కులేని పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములు, దేవస్థానం భూములు అడ్డగోలుగా కబ్జా చేయడానికి ప్రయత్నించారు. చివరికి దరిద్రం వదిలిపోయినందుకు అందరికంటే ఎక్కువగా ఆనందించింది విశాఖ వాసులే!
Call boy jobs available 9989793850
నిన్ను తిట్టాలి అన్న అసహ్యం వేస్తుంది ….న్యాయ రాజధాని అని కర్నూల్ తో ఆడుకున్న వెదవ ఎవ్వడు కనీసం అక్కడ ఐన పెట్టడా ???కనీసం పెట్టడానికి చిత్త శుద్ధి తో ఏమైనా చేశాడా ?????నీ లాంటోడి రాతలు చూసే నిన్న ఒకడు frustrate అయ్యాడు మన అన్న కి వచ్చే సరి 11 ఐన వస్తాయా అని
బెంచ్ పెట్టడం కూడా అంత సులభం కాదు. సుప్రీంకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ రావాలి. తమిళనాడులో మదురై బెంచ్ రావడానికి పదేళ్లు పట్టిందట. హైకోర్టు మార్చాలన్నా సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయాలి
పాపం…మైండ్ బ్లాక్ అయితే అన్ని బ్రహ్మ పదార్ధాలూలానే ఉంటాయి
పాపం…మైండ్ బ్లాక్ అయితే అన్ని బ్రహ్మ పదార్ధాలూలానే ఉంటాయి
ఇండియాకు ముంబై, కేరళకు కొచ్చి లాగా ఆంధ్రప్రదేశ్ కు విజయవాడ అని చాలామంది చెప్తారు
Vizag ni minchina rajadoledhu ippudu vunna government kulam votes kosam kamaravathi vachindhi tdp party vote bank