వైసీపీ పోరుపై టీడీపీ ఘాటైన కౌంట‌ర్‌!

సొంత బాబాయ్‌పై గొడ్డ‌లి వేటు వేసి, నివాళుల‌ర్పించిన‌ట్టే, తానే విద్యుత్ చార్జీలు పెంచి, తానే ధ‌ర్నా చేయ‌డం జ‌గ‌న్‌కే చెల్లింది

కూట‌మి స‌ర్కార్ ప్ర‌భుత్వం కొలువుదీరి ఆరు నెల‌లు దాటింది. ఇప్పుడిప్పుడే పాల‌న గాడిలో ప‌డుతోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెబుతున్నారు. అయితే అమ్మాయిల‌పై అఘాయిత్యాలు, రాష్ట్రంలో కొర‌వ‌డిన శాంతిభ‌ద్ర‌త‌ల‌పై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం కూట‌మి స‌ర్కార్‌పై వ్య‌తిరేక అభిప్రాయాన్ని పెంచింది. ఇదిగో మీ డిప్యూటీ సీఎం ప‌వ‌నే ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ప్ర‌భుత్వంలో భాగ‌స్వామే అంటున్నారు క‌దా అని వైసీపీకి ఆయుధం చిక్కిన‌ట్టైంది.

త‌క్కువ ప‌రిపాల‌న కాలాన్ని వైసీపీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా పోరుబాట ప‌ట్ట‌డం కూట‌మి నేత‌ల‌కు జీర్ణం కావ‌డం లేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స‌ర్దుబాటు చార్జీల పెంపున‌కు వ్య‌తిరేకంగా వైసీపీ ఆందోళ‌న చేప‌ట్టింది. ఇందుకు టీడీపీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటైన కౌంట‌ర్ ఇచ్చింది.

“సొంత బాబాయ్‌పై గొడ్డ‌లి వేటు వేసి, నివాళుల‌ర్పించిన‌ట్టే, తానే విద్యుత్ చార్జీలు పెంచి, తానే ధ‌ర్నా చేయ‌డం జ‌గ‌న్‌కే చెల్లింది”

“ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో విద్యుత్ రంగాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన జ‌గ‌న్‌… ఆరు నెల‌ల్లోనే విద్యుత్ రంగం కోసం ధ‌ర్నాకి పిలుపు ఇవ్వ‌డంపై జ‌నం న‌వ్వుకుంటున్నారు”

ఈ కామెంట్స్‌కు అద‌నంగా ఏ ర‌కంగా విద్యుత్ చార్జీలు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెంచిందో వివ‌రాల‌తో డిజైన్ చేసిన ఫొటోల్ని జ‌త చేశారు. అలాగే వివేకా విగ్ర‌హానికి పూల‌దండం వేస్తున్న జ‌గ‌న్ ఫొటోను కూడా జ‌త చేశారు.

అయితే ఏ ప్ర‌తిప‌క్ష పార్టీ ఆందోళ‌న‌లు చేసినా, మీడియా దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ప్ర‌భుత్వం ఎన్ని చెప్పినా జ‌నం పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఎందుకంటే గ‌తంలో చంద్ర‌బాబు విద్యుత్‌పై ఏ ర‌కంగా మాట్లాడారో సోష‌ల్ మీడియాలో వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అందుకే వైసీపీకి టీడీపీ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చినా, పేల‌లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

5 Replies to “వైసీపీ పోరుపై టీడీపీ ఘాటైన కౌంట‌ర్‌!”

  1. Mama nu vennupotu podichi party ne mingadu oka sannasi…..jagan babai ni champado ledo yevadu choisadu ra fools…ekkada mama nu podichi party mingindi prapancham choosindi

    .

  2. కౌంటర్ గట్టిగ పేలింది కాబట్టే మీరుకూడా చెపితే వినడు ఏడుస్తాడు అని ఎదో ఆర్టికల్ రాసారు ….

  3. లోకనాథరావు మాయమవడం: గ్రేట్ ఆంధ్రలో కులం, కలకలం, రఙ్గనాథ్ కల్చరల్ టచ్!”

    లోకనాథరావు గారిని వెతుకుతూ గ్రేట్ ఆంధ్ర ఫ్యాన్స్ ఇప్పుడు ‘మిస్సింగ్ పర్సన్’ పోస్టర్లు వేసే స్థితికి చేరుకున్నారు. పూజారి కుటుంబం నుంచి వచ్చిన గౌరవనీయుడు, కానీ వెబ్‌సైట్‌లో మాత్రం కుల చర్చలకు కింగ్. “కాపు vs కమ్మ” అంటూ కొత్త లీగ్ ప్రారంభించిన వ్యక్తి, ఈసారి తన అభిమానులను షాక్ ఇచ్చాడు – కనిపించడమే లేదు!

    ఇక కథలోకి మరో పాత్ర చేరింది – రఙ్గనాథ్. ఆయన, లోకనాథరావు గారి సమాన మిత్రుడు, తరచుగా ఆయనకే మద్దతు ఇచ్చేవారు. రఙ్గనాథ్ గారికి కూడా కమ్మ మరియు కాపు కులాలపై అణచివేతపూరిత అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, రఙ్గనాథ్ గారి స్టైల్ మాత్రం కొంచెం డిఫరెంట్. లోకనాథరావు గారి తీరుకు విరుద్ధంగా, రఙ్గనాథ్ గారు చాలా సందర్భాల్లో కాస్త డీసెంట్‌గా మాట్లాడతారు. కానీ అది కేవలం డీసెంట్ హావభావాల పూత మాత్రమే! అప్పుడప్పుడూ ఆయన కూడా ఓకే చెప్పుకోలేని స్థాయిలో సున్నితమైన ఘాటైన పదజాలాన్ని ఉపయోగిస్తారు.

    ఇప్పుడంతా రఙ్గనాథ్ గారే అసలు “లోకనాథరావు ఎక్కడ?” అనే మిస్టరీ సులభంగా ఛేదించగలరనే నమ్మకం ఉంది. వారు ఇద్దరూ ఒకే వేదికపై పంచ్ డైలాగులు పేల్చిన సమయంలో, వాళ్ల ఆన్‌లైన్ చర్చల హడావుడి అర్ధరాత్రి 12 గంటల వరకు వినిపించేది!

    కానీ, వారి చర్చలు ఎంత ఆసక్తికరమైనవైనా, అసలు పాయింట్ ఏమిటంటే, కుల విద్వేషం ఎప్పుడూ దారి తప్పే వస్తువే. మరి లోకనాథరావు గారు మళ్లీ కనిపించగానే, రఙ్గనాథ్ గారితో కలిసి “విజయానికి కొత్త వేదిక” అని చెప్పుకునే పద్ధతిలో ముందుకెళ్తారా? లేక ఒకరికొకరు “సున్నితంగా” సలహాలు ఇచ్చుకుంటారా? ఎంతైనా, రఙ్గనాథ్ గారికి మాత్రం ఈ సీన్ బాగా పరిచయమైనట్టుంది.

Comments are closed.