స‌జ్జ‌ల‌ను ప‌క్క‌న పెట్టవా… జ‌గ‌న్‌కు నిల‌దీత‌!

వైసీపీ ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కారకుల్లో స‌జ్జ‌ల కూడా ఒక‌ర‌ని, ఇంకా ఆ విష‌యాన్ని తెలుసుకోక‌పోతే ఎట్లన్నా?

పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాద‌ర్భార్‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక మాట‌లో చెప్పాలంటే జ‌గ‌న్ ఖంగుతినేలా వైసీపీ శ్రేణుల నుంచి నిల‌దీత ఎదురైంది. జ‌గ‌న్‌తో నిర్మొహ‌మాటంగా మాట్లాడ్డం పులివెందుల జ‌నానికి అలవాటు. కొట్లాడిన‌ట్టు జ‌గ‌న్‌తో వాదిస్తుంటారు. జ‌గ‌న్‌తో పులివెందుల ప్ర‌జ‌ల‌కు అంత సాన్నిహిత్యం మ‌రి!

ఈ నేప‌థ్యంలో వైసీపీ బాగు కోసం ప్ర‌జాద‌ర్భార్‌లో జ‌గన్‌ను నిల‌దీసినంత ప‌ని చేసిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన స‌ల‌హాదారు, ప్ర‌స్తుత వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని ఇక‌నైనా ప‌క్క‌న పెట్ట‌వా? అని జ‌గ‌న్‌ను పులివెందుల కార్య‌క‌ర్త‌లు నిల‌దీసిన‌ట్టు తెలిసింది.

వైసీపీ ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కారకుల్లో స‌జ్జ‌ల కూడా ఒక‌ర‌ని, ఇంకా ఆ విష‌యాన్ని తెలుసుకోక‌పోతే ఎట్లన్నా? అని జ‌గ‌న్‌పై అభిమానంతో పాటు చిరు కోపంతో నిల‌దీసిన‌ట్టు వైసీపీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. నిల‌దీత‌కు జ‌గ‌న్ షాక్‌కు గురైన‌ట్టు తెలిసింది.

ఔనా, అట్ల‌నా? అని ఆశ్చ‌ర్యంతో జ‌గ‌న్ ప్ర‌శ్నించార‌ని స‌మాచారం. ఊరికే త‌లూప‌డం కాద‌న్నా, ఖ‌చ్చితంగా స‌జ్జ‌ల‌ను ప‌క్క‌న పెట్టాల్సిందే అని జ‌గ‌న్‌కు పులివెందుల వైసీపీ శ్రేణులు తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. వైసీపీ శ్రేణుల నుంచి స‌జ్జ‌ల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌డంతో.. స‌రే, స‌రే అని వారికి స‌ర్ది చెప్పార‌ని స‌మాచారం.

30 Replies to “స‌జ్జ‌ల‌ను ప‌క్క‌న పెట్టవా… జ‌గ‌న్‌కు నిల‌దీత‌!”

    1. రాజకీయం లో నెగ్గడానికి చిలక జోస్యాలు, బల్లి శకునాలు, కాకి అరుపులు ఉంటె సరిపోవు..

      నిలిచి గెలవగలిగే నాయకత్వం ఉండాలి.. జగన్ రెడ్డి మేటర్ 2019 తోనే ముగిసిపోయింది.. 2024 కి పతనమైపోయింది ..

      పులివెందుల లో జగన్ రెడ్డి కోసం జనాలు వచ్చారని జబ్బలు చరుచుకొనే .. గొర్రెల మందికి.. పులివెందుల గెలిస్తే చాలు అనే స్థితికి దిగజార్చేసింది కూడా ఈ చంద్రబాబే..

      ఆంధ్ర రాష్ట్రం లో గెలవాలంటే.. 90 సంఖ్య ఉండాలి.. 11 నుండి 90 చాలా దూరం..

      175 నియోజకవర్గాల్లో సుమారు 100 నియోజకవర్గాల్లో వైసీపీ కి నాయకులు లేరు.. ముందు ఆ పని చూసుకోండి..

      హస్తసాముద్రికం తర్వాత చూపించుకోవచ్చు..

      1. జగన్మోహన్ రెడ్డికి 2024 ఎలక్షన్ లో 40% ఓట్లు వచ్చాయి… సీట్లు రాకపోవచ్ఛు…కానీ 100 మందికి 40 మంది జగన్ కు ఓట్లు వేశారు..కూటమి గా వచారు కాబట్టి …అయింది. లేకపోతే మళ్లీ జగన్ గెలిచేవాడు

        1. 2019 లో చంద్రబాబు కూడా సింగల్ గా పోటీ చేసినప్పుడు కూడా 40% ఓట్లు వచ్చాయి.. మరి 23 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకున్నారు..

          కూటమిగా వస్తే ఒక రకం.. విడిగా పోటీ చేస్తే ఇంకో రకం అనేవి ప్రజాస్వామ్యం లో లెక్కలోకి రావు..

          మీరు గెలవడం కోసం రాజ్యాంగం లో కొత్త చట్టాలు చేయరు..

          40% ఓట్లు రావడం అనేది మీకు వింతగా ఉండొచ్చు.. అది మీకు, మీ నాయకుడికి గొప్పగా ఉండొచ్చు..

          కానీ.. టీడీపీ కి మాకు సర్వసాధారణం..

          ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్ని సీట్లు కావాలనేదే లెక్క.. ఆ లెక్కలు తప్పారు కాబట్టే.. బొక్క బోర్లా పడ్డారు..

        2. 2019లో టిడిపి కి కూడా 40% ఓట్లు తో 23 సీట్లు గెలుచుకుంది.. ఒంటరిగా పోటీ చేసి..

          ఇంత వ్యతిరేకత వచ్చినందుకు టిడిపి ఒంటరి గా పోటి చేసిన 90 సీట్ల తో అధికారం లో కి వచ్చేది

  1. “150+ గొఱ్ఱలని గెలిపించిన వాణ్ణి , ఈ మాత్రం తెలియక కాదు కానీ, వదిలించుకోలేను ఎందుకంటే ఆడు నా మంచం ‘మేట్” అని కూడా నిర్మొహమాటంగా తన లేకిజనంతో ప్రేమ గా చెప్పినాడని విశ్వసనీయ సమాచారం

  2. తల్లా.. పెళ్ళామా.. అని అడిగితే.. తల్లిని తన్ని తరిమేశాడు..

    నమ్ముకున్న జనాలు కావాలా.. సజ్జల రెడ్డి తో దోస్తానా కావాలా .. అని అడిగితే.. నమ్ముకున్న జనాలను నట్టేట ముంచేసే రకం.. మా జగన్ రెడ్డి..

    ..

    వైసీపీ శ్రేణులకు సర్ది చెప్పాడా… అంటే ఏంటి..?

    సజ్జల ను తప్పించడం కుదరదు.. మూసుకుని మీ పని మీరు చేసుకోండి అని చెప్పినట్టేగా..

    ..

    జగన్ రెడ్డి ఓటమికి ఒక కారణం సజ్జల రెడ్డే అని రాష్ట్రం మొత్తానికి తెలుసు..

    పులివెందుల జనాలు నిలదీసేసరికి జగన్ రెడ్డి షాక్ అయ్యాడంట .. అంటే.. ఈ దరిద్రుడికి ఓడిపోవడానికి కారణం ఏంటో ఇంకా అవగాహన చేసుకోలేదు..

    ఈవీఎం లే కారణం అనుకుని ఇంకా ఇంకా పతనమైపోతున్నాడు ..

    వీడు మళ్ళీ గెలుస్తాడు / గెలవాలి అని అనుకొనేవాళ్లను కొట్టాలి.. మెట్టు తో..

  3. జ గ న్ స జ్జ ల ను ప క్క న పె ట్ట డు v e e d i పె@ళ్ళాం అ @వి@నా@ష్@ బా@ @వ ను @ప@క్క@న పె@ట్టdu

  4. జగనన్న నీవు మంచి వాడివే కానీ నువ్వు ఎంచుకున్న టీం మంచిది కాదు నిన్ను ముంచినది ఎమ్మెల్యేలు మంత్రులు ఉదాహరణకి పల్నాడు జిల్లాల ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలా అక్కడ ఒకసారి గెలిచినందుకే జనాలు మాకు వద్దురా బాబు ఇల్లు అంటున్నా కూడా మళ్ళీ వాళ్లకే ఇచ్చావు సీట్లు నీ మీద వ్యతిరేకత కాదు

    1. పర్యటన కి వస్తే అడా కూతుళ్ళని ఎండ లో రోడ్డు కి రెండు వైపులా నిలపెట్టడం, చుట్టూ పరదాల్లో తిరగడం, జనవరి లో బటన్ నొక్కితే ఏప్రిల్ కి కానీ జమ చెయ్యకపోవడం ….సభలకి వచ్చిన ఆడకూతుళ్ల వంటి మీద చున్నీ లు లాగించడం…కాన్వాయ్ లో కార్ లు లేకపోతె జనల కార్లు దొబ్బేయడం…చెల్లి ఆస్తి పంచకుండా తరిమేయడం ….చిన్న పిల్లలు ఉన్న సభల్లో అసందర్భ వ్యాఖ్యలు చేయడం….రోడ్ ల మీద చెట్లు నరికించడం….బాబోయ్ ఎన్ని మంచి వ్యక్తో….

  5. మావోడు ప్యాలెస్ లో దాక్కుని పగలు PUBG ఆడుకుని, రాత్రి ఆత్మలతో మాట్లాడుతూ కుట్రలు చేస్తూఉంటే, గజ్జలే కదా పార్టీ కార్యక్రమాలని, పదవుల పంపకాలనీ, ప్రభుత్వాన్ని సింగల్ హ్యాండ్ తో నడిపి 175/175 గెలవడానికి సిద్ధం చేసింది..

  6. ప్రభుత్వాధినేత గా మీడియాని ఎదుర్కునే ‘దమ్ము.. సత్తా ‘లేక మావోడు ప్యాలెస్ లో దాక్కుంటే, అప్పుడు నేనున్నాను అంటూ వచ్చాడు గజ్జల.. ప్రభుత్వ & పార్టీ పాలసీస్ గురించి మీడియా ని ఎదుర్కుని నిలబెట్టాడు..ఆడు మొగోడ్రా బుజ్జా.. కానీ మనోడే —-

  7. సజ్జల ప్లెస్ నీ గ్రేట్ ఆంద్ర వెంకట్ రెడ్డి గారి కబ్జా చేద్దామని చూస్తున్నారు అని అందరికీ తెలుసు.

    జగన్ చెప్పిన పనే సజ్జలు చేశాడు.

    మీడియా ముందు మాట్లాడే దమ్ము లేని జగన్ నీ కాపాడుతూ వచ్చాడు.

  8. Caste paruvu ..Anni paruvulu poyai neeku telivi ledu anna kanisam telivina vallani pakkana pettukoni salahalu tisukoni povali .ias and ips salahalu tisukovali alagae ground level karyakrtalo tho monthly once meet ayyai feedback tisukovali em cheyyali ani ..first surround manchi young and dynamic talented ias and ips vallani pettukoni follow avvali Inka nuvvu Edo king ani room lo PUBG adukunte this is not 1990 ..it’s 2040 time …u should run with trending topics

  9. సజ్జ*లు జగ*న్ ఇంట్లో ఒక కట్టు బా*నిస.

    సొంతంగా ఏ పని చేయలేదు.

    కేవలం జ*గన్ చెప్పిన పని తుచ తప్పకుండా చేశాడు.

    జగ*న్ కి మీడి*యా నీ చూస్తే చి*చ్చు. ఫాంట్ లో ఒం టేలు పోసుకునే రకం.

    అ*తన్ని కాపా*డాడు ఇన్నాళ్లు.

    స*జ్జలు చేసిన ప్ర*తి పనీ అన్ని కూడా జగనే చెప్పి చెపించినవే.

    ద*మ్ము వింటే జగన్ నీ కా*లర్ పట్టుకుని అడగండి, ఆ పను*లు గురించి.

Comments are closed.