నామినేటెడ్ ప‌ద‌వుల కోసం లోకేశ్ భ‌జ‌న‌!

మంత్రి నారా లోకేశ్ సిఫార్సు మేర‌కే ప‌ద‌వుల భ‌ర్తీ జ‌రుగుతోంద‌ని తెలుసుకున్న టీడీపీ నాయ‌కులు ఆయ‌న గుడ్‌లుక్స్‌లో ప‌డేందుకు శ్ర‌మిస్తున్నారు.

కూట‌మి స‌ర్కార్ ఇప్ప‌టికే రెండు ద‌ఫాల్లో నామినేటెడ్ ప‌ద‌వుల్ని భ‌ర్తీ చేసింది. మిగిలిన ప‌ద‌వుల్ని నెలాఖ‌రులోపు భ‌ర్తీ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇందుకోసం సీఎం సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలిసింది. అయితే మంత్రి నారా లోకేశ్ సిఫార్సు మేర‌కే ప‌ద‌వుల భ‌ర్తీ జ‌రుగుతోంద‌ని తెలుసుకున్న టీడీపీ నాయ‌కులు ఆయ‌న గుడ్‌లుక్స్‌లో ప‌డేందుకు శ్ర‌మిస్తున్నారు.

ఈ క్ర‌మంలో లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల‌నే నినాదం బ‌లంగా తెర‌పైకి వ‌చ్చింది. పొగ‌డ్త‌ల‌కు ప‌డిపోని రాజ‌కీయ నాయ‌కులు ఉండ‌రు. అలాగే త‌మ‌పై నోరెత్త‌ని సొంత నాయ‌కుల్ని కూడా గ‌మ‌నిస్తూ వుంటారు. రాజ‌కీయ నాయ‌కుల‌కు భ‌జ‌న‌ప‌రులంటే ఎంతో ఇష్టం. నిజాలు చెప్పేవాళ్ల‌ను దూరంగా పెట్ట‌డం రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణం.

లోకేశ్‌పై పొగ‌డ్త‌ల‌తో పాటు ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర‌స్థాయిలో దూష‌ణ‌ల‌కు దిగ‌డం వెనుక వ్యూహం వుంటుంది. మీడియాలో పోక‌స్ కాగానే, నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో త‌మ పేరు ప‌రిశీలించాల‌ని కోరుతూ లోకేశ్‌కు బ‌యోడేటాలు ఇస్తున్నార‌ని తెలిసింది. లోకేశ్ కూడా త‌న వెంట న‌డుస్తార‌నే న‌మ్మ‌కం క‌లిగితే, త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌డానికి వెనుకాడ‌డం లేద‌ని స‌మాచారం.

కోటి విద్య‌లు కూట‌మి కోస‌మే అనే చందంగా, పొగ‌డ్త‌ల‌న్నీ ప‌ద‌వుల కోస‌మే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కుల కంటే, లాబీయింగ్ చేసేవాళ్ల‌నే ప‌ద‌వులు వ‌రించ‌డం కొన్నేళ్లుగా రాజ‌కీయాల్లో కొత్త సంస్కృతి వ‌చ్చింది. అందుకే నాయ‌కుల చుట్టూ తిర‌గ‌డం ఎక్కువైంది. ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వాళ్ల‌వి. అంతిమంగా కోరుకున్న ప‌ద‌వి ద‌క్కాలి.

12 Replies to “నామినేటెడ్ ప‌ద‌వుల కోసం లోకేశ్ భ‌జ‌న‌!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. హబ్బో.. మన జగన్ రెడ్డన్న హయాం లో చంద్రబాబు ని, చంద్రబాబు ఇంట్లో ఆడోళ్లను తిడితే మంత్రి పదవులిచ్చిన సంగతి పరిచిపోయినట్టున్నావు..

    టీడీపీ ఆఫీస్ పైకి దండెత్తి వెళితే.. పిలిచి పదవులిచ్చిన సంగతి మరచిపోయినట్టున్నావు..

    అయినా.. అప్పట్లో తమరి భజన రాతలు ఒక రేంజ్ లో ఉండేవిలే ..

      1. తెలుసుకుని ఏమి చేస్తారు.. మీరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొంటారా..?

        రికమెండ్ చేయాలా..?

  3. జగన్ హయాములొ Ex ఎమ్మెల్యేలు అస్సెంబ్లీ లొనె భజన్ చెస్తె మురిసిపొయావు కాని భజన అని రాసవా గురువిందా? ఈ భజన గుర్తులెదా?

    .

    నువ్వు అనుకుంటే అవుద్ది స్వామీ.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం.. నీ మాట శాసనం…

    బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అధ్యక్షా.. ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది….

    బైపాస్ సుర్జరీ చెసిన గుండె లబ్ దబ్ అని కాదు జగన్ జగన్ అని కొట్టు కుంటుంది.

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.