తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఎట్టకేలకు టీడీపీ ముకుతాడు వేయడానికి రంగం సిద్ధం చేసింది. కొలికపూడిపై సొంత పార్టీలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కొలికపూడిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించాల్సిందే అని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో కొలికపూడి వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
ఈ క్రమంలో కొలికపూడి తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది. తిరువూరులో కొలికపూడిని కట్టడి చేసేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రకటించారు. ఇకపై కొలికపూడి సొంతంగా ఏ నిర్ణయం తీసుకోడానికి వీల్లేదని పార్టీ తేల్చి చెప్పింది. ఎలాంటి నిర్ణయమైనా సమన్వయ కమిటీ చూసుకుంటుందని స్పష్టం చేయడంతో కొలికపూడి పవర్స్‌కు కత్తెర పెట్టినట్టైంది.
దీంతో కొలికపూడి వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొలికపూడి వ్యవహార శైలిపై మొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ తరపున నిలిచారనే ఉద్దేశంతో గెలిపిస్తే, చివరికి తమకే ఎసరు పెట్టారని ప్రధానంగా బాబు సామాజిక వర్గీయుల ఆరోపణ. నోటికొచ్చినట్టు కొలికపూడి తిడుతున్నారని, మహిళలకు అభ్యంతరకర మెసేజ్‌లో పెడుతున్నారనే ఫిర్యాదులు వెళ్లాయి.
దీంతో కొలికపూడిని మొదట్లోనే కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తనదైన స్టైల్లో సమన్వయ కమిటీతో కొలికపూడిని కట్టడి చేయడానికి ప్రణాళిక రచించారు. అన్నీ అనుకున్నట్టుగానే జరగడానికి మరెంతో కాలం లేదు అని వర్ల రామయ్య చెప్పడం విశేషం.
అదేందిది….నిన్నగాక మొన్ననేగదా కొలికపూడి ని అదుపు చేయలేకపోతోంది అన్నావ్…ఇప్పుడు మూకుతాడా?
Call boy works 9989793850
vc estanu 9380537747