వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ పైచేయి సాధించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వి.మల్లికార్జునను సాగనంపాల్పిందే అని ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పట్టు పట్టిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌ను అడుగు పెట్టనివ్వనని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అయితే సమర్థుడైన అధికారిగా పేరు పొందిన కమిషనర్ మల్లికార్జున వల్ల ధర్మవరం అభివృద్ధి చెందుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చే ప్రసక్తే లేదంటూ మంత్రి స్పష్టం చేశారు. సత్యకుమార్ కేవలం మంత్రే కాదు, ధర్మవరం నుంచి కూటమి తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ నాయకుడు కూడా. మంత్రి కావడంతో తాను ధర్మవరంలో ఉండలేనని, తన ప్రతినిధిగా మల్లికార్జున ఉంటూ అభివృద్ధి చేస్తారని ఆయన చెప్పారు.
కానీ పరిటాల వర్గీయులు మాత్రం మల్లికార్జునను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. మంత్రిని ఘోరావ్ కూడా చేసిన సంగతి తెలిసింది. చివరికి పరిటాల శ్రీరామ్ పంతమే నెగ్గింది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌ను ప్రొద్దుటూరు మున్సిపాల్టీకి బదిలీ చేశారు. జమ్మలమడుగు కమిషనర్ ప్రమోద్‌కుమార్‌ను ధర్మవరానికి బదిలీ చేశారు.
పరిటాల శ్రీరామ్ మాట నెగ్గడంపై సత్యకుమార్, ఆయన అనుచరులు అవమానంగా భావిస్తున్నారనే చర్చకు తెరలేచింది.
నీచుడు జగన్ రెడ్డి కూడా మట్టికరిచాడు కదా అది చెప్పు ముందు
Call boy jobs available 9989793850
vc available 9380537747