జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదాపై త‌మ్మినేని సీరియ‌స్ కామెంట్స్‌

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌తిప‌క్ష హోదాపై మాజీ స్పీక‌ర్‌, ఆ పార్టీ సీనియ‌ర్ నేత త‌మ్మినేని సీతారాం సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ప్ర‌తిపక్ష స‌భ్యులు ఎంత మంది ఉన్నార‌నేది ముఖ్యం కాద‌ని ఆయ‌న…

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌తిప‌క్ష హోదాపై మాజీ స్పీక‌ర్‌, ఆ పార్టీ సీనియ‌ర్ నేత త‌మ్మినేని సీతారాం సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ప్ర‌తిపక్ష స‌భ్యులు ఎంత మంది ఉన్నార‌నేది ముఖ్యం కాద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌తిప‌క్షం వుందా? లేదా? అనేదే కీల‌క‌మ‌ని వైసీపీ హ‌యాంలో స్పీక‌ర్‌గా ప‌ని చేసిన త‌మ్మినేని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డానికి ప‌ది శాతం స‌భ్యులు ఉండాల‌ని ఏ చ‌ట్టంలో లేద‌ని జ‌గ‌న్ వాదిస్తున్న సంగ‌తి తెలిసిందే. 11 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉన్న వైసీపీ అధినేత త‌న‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడికి లేఖ రాసిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దీంతో ఆయ‌న న్యాయ‌పోరాటానికి దిగారు. ప్ర‌స్తుతం ఏపీ హైకోర్టులో జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదాపై విచార‌ణ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో త‌మ్మినేని సీతారాం మాట్లాడుతూ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు ప్ర‌తిప‌క్షాన్ని గుర్తించి, జ‌గ‌న్‌కు హోదా ఇవ్వ‌డంపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర‌డం విశేషం. త‌న‌కు న్యాయం జ‌ర‌గలేద‌నే కార‌ణంతోనే జ‌గ‌న్ కోర్టుకు వెళ్లార‌ని త‌మ్మినేని తెలిపారు.

ఏపీలో రెడ్‌బుక్ పాల‌న న‌డుస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. 55 రోజుల్లో రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేశార‌ని త‌మ్మినేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హ‌త్య‌లు, దాడులు, దౌర్జ‌న్యాలు పెరిగిపోయాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

21 Replies to “జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదాపై త‌మ్మినేని సీరియ‌స్ కామెంట్స్‌”

  1. //55 రొజుల్లొ రాస్ట్రం అతలాకుతం అయ్యిందా?//

    ప్రజలు మాత్రం రాస్ట్రం ఇప్పుడె దారిలొ పడుతుంది అనుకుంటున్నారు!

  2. ఎలాగూ అసెంబ్లీ కి వచ్చే రకం కాదు.. ఇక హోదా లెందుకు అనుకుని ఉండొచ్చు..

    తమరు బాధ్యతగా ఆ పదవి వెలగబెట్టి ఉంటె.. ఇప్పుడు ప్రశ్నించే అధికారం ఉండేది..

    నీదే ఒక సంకరజాతి.. నీవు మరొకరికి సలహాలు ఇవ్వడం.. కరెక్ట్ కాదేమో.. మాజీ స్పీకర్ గారు..

    ఎలాగూ ఏ పదవి లేదు.. పైనా కిందా మూసుకుని ఇంట్లో కూర్చోండి.. మీ జగన్ రెడ్డి లాగా..

    వాడికే దిక్కు లేదు.. బెంగుళూరు పారిపోయాడు.. శవాలు దొరికితే గాని.. రాష్ట్రం లోకి రాలేడు .. మీకెందుకు హోదాలో..?

      1. జగన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్నాడు.. ఏమైంది అని ఎప్పుడైనా అడిగావా..?

        జగన్ రెడ్డి సీపీఎస్ రద్దు అన్నాడు.. ఏమైంది అని ఎప్పుడైనా అడిగావా..?

        జగన్ రెడ్డి ప్రతి ఏటా జాబ్ క్యాలెండరు అన్నాడు.. ఏమైంది అని ఎప్పుడైనా అడిగావా..?

        మీ జగన్ రెడ్డి లాగా మాట ఇచ్చి మడతెట్టేసే ప్రభుత్వం కాదు ఇది.. మొన్ననే చెప్పారు.. ఖజానా అంతా బొక్కలే .. కాస్త డబ్బు సమకూర్చుకొన్నాక.. హామీలు మొదలుపెడతారు..

        మీ జగన్ రెడ్డి కూడా మే 2019 లో అధికారం లోకి రాగానే హామీలు నెరవేర్చేయలేదు ..

        అధికారంలోకి వచ్చింది 2019 జూన్; ఇచ్చినవి

        అమ్మఒడి – 2020 జనవరి

        రైతు భరోసా – 2019 అక్టోబర్

        వసతి దీవెన – 2020 ఫిబ్రవరి

        విద్యా దీవెన – 2020 ఏప్రిల్

        సున్నా వడ్డీ – 2020 ఏప్రిల్

        మత్స్యకార భరోసా – 2019 నవంబర్

        నేతన్న నేస్తం – 2019 డిసెంబర్

        ఈ ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లో 1000 పింఛను పెంచారు.. మీ జగన్ రెడ్డి కి ఐదేళ్లు పట్టింది..

        కాస్త ఆత్రం ఆపుకో.. అన్ని జరుగుతాయి..

      2. Volunteers ni ela padithe ala hire chesaru oka procedure lekunda. Chala varaku YCP batch ye( neeku ucha agakapothe cheppu na friends kuda volunteers lo unnaru matladista). Guidelines tayarayyaka.. vallaki unna skills ni batti ela use chesukovalo ala chesukuntaru 10k ichi.. ayina neeku state ki vachina nastam enti mastaru konchem late ithe CBN kani govt kani teestunnam ani cheppara? Vela acres land dobbesaru mundhu adhi telchi idhi chustaru le

  3. ఈన్ కో. నలుగురి ని లాగేస్తే ఆ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. అన్నారు అప్పుడు చిరునవ్వులు నవి ఇప్పుడు రాజ్యాంగం విలువలు వచిస్తున్నారు వింత గా ఉంది అయితే

  4. Dirty fellow thamineni-sitaram weak memory? 2019 very first session jagan told 10% seats are required that meand 18 seats .

    Shameless thamineni-sitaram should have sense before speaking

  5. జగన్ రాష్ట్రం లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ట్విట్టర్ లో స్టేట్మెంట్లు, ఢిల్లీ లొ ధర్నా లు చేసి సరిపెడతాడు. వాడికి మటుకు రక్షణ బోలెడన్ని కావాలని కోర్టు లో పెటిషన్ వేస్తాడు, ప్రజల భద్రత కు కాదు. వీడెక్కడి నాయకుడండి? మరల ప్రతిపక్ష హోదా ఒకటి, చాలా దురాశ కలిగినవాడు జగన్.

  6. ఆ హోదా ఏదో ఇచ్చి.. రోజూ అస్సేబ్లీ కి రప్పించి 164 మంది కలిసి చెడుగుడు ఆడండి. ఎందుకు ఇచ్చారు రా ఈ హోదా అని పరిగెత్తాలి.

Comments are closed.