తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వు!

తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై ఎలాగైనా అన‌ర్హ‌త వేటు వేసేలా స్పీక‌ర్‌పై న్యాయ‌స్థానం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ…

తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై ఎలాగైనా అన‌ర్హ‌త వేటు వేసేలా స్పీక‌ర్‌పై న్యాయ‌స్థానం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో వాళ్లంతా ఢిల్లీలో తిష్ట‌వేయ‌డం గ‌మ‌నార్హం.

బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ను విలీనం చేసేలా ఆ పార్టీ ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు లాక్కోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పావులు క‌దిపారు. ఈ క్ర‌మంలో కొంత వ‌ర‌కు ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. ఇంకొంత మందిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాల‌ని రేవంత్‌రెడ్డి ప్ర‌య‌త్నిస్తుంటే, మ‌రోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని బీఆర్ఎస్ త‌న ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేసింది.

ఎమ్మెల్యేల అన‌ర్హత‌కు సంబంధించి న్యాయ నిపుణుల‌తో బీఆర్ఎస్ నేత‌లు చ‌ర్చిస్తున్నారు. తామిచ్చిన ఫిర్యాదుపై అన‌ర్హ‌త వేటు వేసేందుకు స్పీక‌ర్ కాల‌యాప‌న చేస్తే, త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై ఎలా ముందుకెళ్లాల‌నే విష‌య‌మై కేటీఆర్‌, పార్టీ ఇత‌ర నేత‌లు ఢిల్లీలో న్యాయ‌కోవిదుల‌తో చ‌ర్చిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయ పోరాటం చేస్తామ‌న్నారు.

త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించ‌నున్న‌ట్టు కేటీఆర్ చెప్పారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో అన‌ర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని ఆయ‌న తేల్చి చెప్పడం గ‌మ‌నార్హం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని ఆయ‌న హెచ్చ‌రించారు.

12 Replies to “తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వు!”

    1. అవునవును… సుప్రీం కోర్టు చరిత్ర తవ్వి తీస్తే కతర గాడు శుద్ద మూసుకోవాల్సి వస్తుంది

    1. వాడేదో నోటికి వచ్చింది అహంకారంతో వాగడం నువ్వు కూడా నమ్మటం ఏంటి బ్రో

  1. 2014 నుండి 2023 వరకు ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు ఎంత మంది మీద అనర్హత వేటు పడింది..

    మేం చేస్తే సంసారం

    ఎదుటివారు చేస్తే వ్యభిచారం అంతే కదా కేటిఆర్ గారు

  2. సరే ఉప ఎన్నికల్లో మీకేమైనా వొరుగుతుందా?పార్లమెంట్లో మాదిరి ఉన్న పరువు కూడా పోతే?

Comments are closed.