మా అమ్మ తర్వాత ప్రభాస్ బెస్ట్..!

హీరోయిన్ మాళవిక మోహనన్ చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చింది. ప్రభాస్ ను ఆకాశానికెత్తేసింది. తన అమ్మ తర్వాత ప్రభాస్ మాత్రమే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. దీనికి కారణం ప్రభాస్ ఆతిథ్యం. Advertisement తను…

హీరోయిన్ మాళవిక మోహనన్ చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చింది. ప్రభాస్ ను ఆకాశానికెత్తేసింది. తన అమ్మ తర్వాత ప్రభాస్ మాత్రమే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. దీనికి కారణం ప్రభాస్ ఆతిథ్యం.

తను ఎవ్వరితో నటించినా, ఆ హీరోయిన్ కు మంచి ఆతిథ్యం ఇవ్వడం ప్రభాస్ కు అలవాటు. మంచి వంటకాల్ని తన హీరోయిన్లకు రుచిచూపిస్తుంటాడు ప్రభాస్. ఇప్పుడీ లిస్ట్ లోకి మాళవిక కూడా చేరిపోయింది.

రాజా సాబ్ సెట్స్ లో ప్రభాస్ తనకు చాలామంచి భోజనం పెట్టాడని అంటోంది మాళవిక మోహనన్. తన అభిరుచులు కనుక్కొని మరీ, ఆంధ్ర స్టయిల్ లో చాలా వెరైటీలను తన కోసం ఇంట్లో వండించి మరీ తీసుకొచ్చాడని చెప్పుకొచ్చింది. రుచిలో అమ్మ తర్వాత ప్రభాస్ పెట్టిన భోజనమే ది బెస్ట్ అంటోంది మాళివిక.

రాజాసాబ్ లో తనే మెయిన్ హీరోయిన్ అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది మాళవిక. ప్రభాస్ సరసన తను పోషిస్తున్న పాత్ర గురించి అప్పుడే తను బయటపెట్టలేనని, అయితే అలాంటి పాత్రను పోషించే అవకాశం మళ్లీ తనకు రాకపోవచ్చని కూడా చెప్పుకొచ్చింది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది రాజాసాబ్ సినిమా. సినిమాలో ప్రభాస్ సరసన మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ ఫస్ట్ లుక్ తో గ్లింప్స్ రిలీజ్ చేశారు. జనవరి నుంచి సాంగ్స్ ప్రమోషన్స్ మొదలుపెడతారు. సమ్మర్ లో సినిమాను విడుదల చేస్తారు.

4 Replies to “మా అమ్మ తర్వాత ప్రభాస్ బెస్ట్..!”

Comments are closed.