మేం త‌ప్పు చేస్తే మ‌ళ్లీ అధికారంలోకి రాలేం.. అసెంబ్లీకి రాలేం!

మేం త‌ప్పు చేస్తే మ‌ళ్లీ అధికారంలోకి రాలేం, అసెంబ్లీకి కూడా రాలేమ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అన్నారు. ఏపీ స‌చివాల‌యం వేదిక‌గా జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో చంద్ర‌బాబు కీల‌క కామెంట్స్ చేశారు. గ‌త ఐదేళ్ల‌లో వ్య‌వ‌స్థ‌ల్ని…

మేం త‌ప్పు చేస్తే మ‌ళ్లీ అధికారంలోకి రాలేం, అసెంబ్లీకి కూడా రాలేమ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అన్నారు. ఏపీ స‌చివాల‌యం వేదిక‌గా జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో చంద్ర‌బాబు కీల‌క కామెంట్స్ చేశారు. గ‌త ఐదేళ్ల‌లో వ్య‌వ‌స్థ‌ల్ని విధ్వంసం చేశార‌ని, ఏపీని పున‌ర్నిర్మాణం చేసే బాధ్య‌త క‌లెక్ట‌ర్లదే అని ఆయ‌న అన్నారు. ప‌ని చేసే బాధ్య‌త అధికారుల‌ద‌ని, చేయించే బాధ్య‌త త‌మ‌ద‌ని ఆయ‌న అన్నారు.

దీన్ని అధికారులంతా గుర్తించుకుని ప‌ని చేయాల‌ని ఆయ‌న సూచించారు. ప‌ని చేసే అధికారుల‌ను క‌లెక్ట‌ర్లుగా నియ‌మించిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. చేయ‌ని వారిని మాత్ర‌మే ప‌క్క‌న పెట్టామ‌న్నారు. నియంత‌లు మ‌ళ్లీ అధికారంలోకి రాలేద‌ని ఆయ‌న అన్నారు. పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్ వుంటుంద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం నిమిత్తం వ‌చ్చే ఎమ్మెల్యేల‌కు క‌లెక్ట‌ర్లు గౌర‌వం ఇవ్వాల్సిందే అని ఆయ‌న తేల్చి చెప్పారు.

తాము త‌ప్పు చేసినా మ‌ళ్లీ అధికారంలోకి రాలేమ‌ని ఆయ‌న అన్నారు. గ‌త ప్ర‌భుత్వంలో చాలా మంది మంత్రులు తిరిగి గెల‌వ‌లేద‌ని ఆయ‌న అన్నారు. కేవ‌లం ఒక‌రు మాత్ర‌మే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. సాధార‌ణ ప‌రిపాల‌న వుండాల‌న్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళుతుంటే కూడా హ‌డావుడి చేస్తున్నార‌ని స‌ర‌దా కామెంట్ చేశారు. అలా వుండ‌కూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

ముఖ్య‌మంత్రి, మంత్రులు వ‌స్తున్నారంటే చెట్లు కొట్ట‌డం, రోడ్లు బ్లాక్ చేయ‌డం, ప‌ర‌దాలు క‌ట్ట‌డం లాంటివి చేయొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చామ‌న్నారు. ఇక‌పై ఆక‌స్మిత త‌నిఖీల కోసం వ‌స్తాన‌ని, క‌లెక్ట‌ర్లు సిద్ధంగా వుండాల‌ని ఆయ‌న చెప్పారు.

8 Replies to “మేం త‌ప్పు చేస్తే మ‌ళ్లీ అధికారంలోకి రాలేం.. అసెంబ్లీకి రాలేం!”

  1. మన నీలి మీడియా, నీలి సోషల్ మీడియా కక్కుర్తి ఎలా ఉందంటే..

    చంద్రబాబు స్టేట్మెంట్ నుండి.. “తప్పు చేస్తే” అనే పదం ఎడిట్ చేసేసి.. మేము మళ్ళీ అధికారం లోకి రాలేము.. అసెంబ్లీ కి రాలేము.. అని తిప్పుతూ.. శునకానందం పొందుతున్నారు..

    ఇలానే 11 కి పడిపోయారు.. అది కళ్లెదురుగా కనపడుతోంది.. అయినా బుద్ది రాదు.. తెచ్చుకోలేరు..

    2019 లో ఇదే అబద్ధాలతో గెలిచారు.. కాబట్టి.. మళ్ళీ అదే అబద్ధాలతో గెలుద్దాం అని ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు..

    1. మిస్టర్ EVM పార్టీ ప్రతినిధి మరియు CM. రాజకీయ నేతలకు కఠిన పాఠాలు నేర్చుకోవడం అలవాటు. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు గుర్తించరు. పార్టీ నేతలకు, కింది స్థాయి పార్టీ కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు దూరంగా ఉంటూ జగన్ తప్పులు చేశారు. కేవలం బటన్ నొక్కడం ఓటు బ్యాంకును ఏకీకృతం చేస్తుందని అతను తప్పుగా నమ్మాడు. కానీ, టీడీపీ కానీ, కూట‌మీ కానీ ఊహించ‌లేని ప‌నులు ఆయ‌న చేశార‌ని మీరు ఒప్పుకోవాలి. ఓడరేవులు, వైద్య కళాశాలలు, కంపెనీలు తదితర అభివృద్ధి పనులు చేసి రోడ్ల భాగాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గొప్ప దార్శనికుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు. అతను బీహార్, యుపి వంటి రాష్ట్రాన్ని సృష్టించాడు మరియు అతి త్వరలో మనం సోమాలియా లేదా ఆఫ్ఘనిస్థాన్ అని పిలుస్తాము. నెదర్లాండ్స్ వంటి దేశాలు కూడా ఏపీకి వెళ్లకుండా తమ పౌరులకు నోటీసులు జారీ చేశాయి. ప్రతిసారీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా టీడీపీ/బీజేపీ గెలవడానికి ఒక ఫార్ములా కనుక్కున్నాయని నేను అనుకుంటున్నాను, అందుకే వారు అనాగరికులలాగా రాష్ట్రాన్ని పాలించడానికి, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని నేను భావిస్తున్నాను. నేడు వృద్ధులు పింఛన్ల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పింఛన్‌లను పంపిణీ చేయడంలో కేడర్‌, నాయకులు ఎక్కువ ప్రదర్శన చేస్తున్నారు. మీరు డర్టీ మరియు అనైతిక మీడియా హౌస్‌లను ఉపయోగించి ఎక్కువగా ప్రదర్శిస్తారు. కుల దురభిమానులు, రాజకీయ పోకిరీల వల్ల ఏపీ కుక్కల పాలవుతుందని చాలా బాధగా ఉంది.

    2. మిస్టర్ EVM పార్టీ ప్రతినిధి మరియు CM. రాజకీయ నేతలకు కఠిన పాఠాలు నేర్చుకోవడం అలవాటు. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు గుర్తించరు. పార్టీ నేతలకు, కింది స్థాయి పార్టీ కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు దూరంగా ఉంటూ జగన్ తప్పులు చేశారు. కేవలం బటన్ నొక్కడం ఓటు బ్యాంకును ఏకీకృతం చేస్తుందని అతను తప్పుగా నమ్మాడు. కానీ, టీడీపీ కానీ, కూట‌మీ కానీ ఊహించ‌లేని ప‌నులు ఆయ‌న చేశార‌ని మీరు ఒప్పుకోవాలి. ఓడరేవులు, వైద్య కళాశాలలు, కంపెనీలు తదితర అభివృద్ధి పనులు చేసి రోడ్ల భాగాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గొప్ప దార్శనికుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు. అతను బీహార్, యుపి వంటి రాష్ట్రాన్ని సృష్టించాడు మరియు అతి త్వరలో మనం సోమాలియా లేదా ఆఫ్ఘనిస్థాన్ అని పిలుస్తాము

    3. Mr Representative of EVM party and CM. The political leaders are habituated to learning hard lessons. They do not realise the mistakes when they are in power. Jagan made mistakes by keeping himself aloof from party leaders, ground level party workers and the general public. He wrongly believed mere press of button will consolidate vote bank. But, you should agree that he has done so many things which TDP or kootami can’t even imagine of doing. He did development works like ports, medical colleges, companies etc and the roads part was grave mistake from him. What is the great visionary is doing now. He made state like Bihar , UP and very soon we can call Somalia or Afghanisthan. Even countries like Netherlands has issued notices to their citizens to avoid travel to AP. I think TDP / BJP have found a formula to win each time by tampering the EVMs, I think that is the reason why they are damn arrogant and ruling state like barbarians. Today, the old are forced to hit roads for pensions, there is more show off by cadre and leaders in distributing the pensions rather than keeping it a very low key affair. You over exhibit using dirty and unethical media houses. I am very sad that AP would go to dogs due to caste fanatics, political hooligans.

  2. విద్యకు ఫీజు రేయింబర్సుమెంట్ ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ వృద్దులకు పెన్షన్ ఇవి కరెక్ట్ గ ఇచ్చి రాష్ట్రాభివృద్ధి చేస్తే గెలుపు గారంటీ ఈ 5 సంవత్సరాలలో కనీసం mro ఆఫీస్ లను కరప్షన్ ఫ్రీ గ చేస్తే ఈ మెజారిటీని కూటమి నిలబెట్టుకొంటుంది

Comments are closed.