టీటీడీలో సోష‌ల్ మీడియా సెల్‌

టీటీడీలో సోష‌ల్ మీడియా సెల్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ టెండ‌ర్లు ఆహ్వానించింది. టీటీడీలో సోష‌ల్ మీడియా ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న గ‌త పాల‌క మండ‌లికి కూడా వుండింది. కాలానుగుణంగా వ‌స్తున్న మార్పుల‌కు త‌గ్గ‌ట్టు…

టీటీడీలో సోష‌ల్ మీడియా సెల్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ టెండ‌ర్లు ఆహ్వానించింది. టీటీడీలో సోష‌ల్ మీడియా ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న గ‌త పాల‌క మండ‌లికి కూడా వుండింది. కాలానుగుణంగా వ‌స్తున్న మార్పుల‌కు త‌గ్గ‌ట్టు సోష‌ల్ మీడియా సెల్‌ను ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌కు నాటి ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డి అడ్డుక‌ట్ట వేశారు.

త‌న‌కు ఎస్వీబీసీ ఛానెల్ ప్ర‌తినిధులు ఉన్నార‌ని, ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియా వ్య‌వ‌స్థ అవ‌స‌రం లేద‌ని ధ‌ర్మారెడ్డి నాడు కొట్టి పారేశారు. దీంతో సోష‌ల్ మీడియా ద్వారా 40 నుంచి 50 మంది సిబ్బందికి ఉపాధి ద‌క్క‌లేదు. టీటీడీలో సోష‌ల్ మీడియా సెల్ ఏర్పాటు చేసి వుంటే, తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను కాపాడ్డానికి చురుగ్గా ప‌ని చేసే అవ‌కాశం ల‌భించేది.

ఇత‌ర‌త్రా మాధ్య‌మాల్లో టీటీడీపై వ‌చ్చే వ్య‌తిరేక క‌థ‌నాల‌ను తిప్పి కొట్టే వ్య‌వస్థ లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వానికి చాలా న‌ష్టం వ‌చ్చింది. సోష‌ల్ మీడియా సెల్ ఏర్పాటు చేయాల‌నే గ‌త పాల‌క మండ‌లి ఆలోచ‌న‌ని కూట‌మి స‌ర్కార్ అమ‌లు చేయ‌డానికి శ్రీ‌కారం చుట్టింది. దీంతో కొంత మంది టీడీపీ యాక్టివిస్టుల‌కు ఐదేళ్ల పాటు ఉపాధి క‌ల్పించేందుకు కూట‌మి స‌ర్కార్ మంచిగా ఆలోచించింది.

త‌న వాళ్ల‌ను కాపాడుకోడానికి కూట‌మి స‌ర్కార్ ఎంత వేగంగా ప‌ని చేస్తున్న‌దో టీటీడీలో సోష‌ల్ మీడియా సెట్ ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌నే నిద‌ర్శ‌నం. ఇలా ఎప్పుడూ వైసీపీ స‌ర్కార్ ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆ పార్టీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యానికి దారి తీసింది.

9 Replies to “టీటీడీలో సోష‌ల్ మీడియా సెల్‌”

  1. Good decision, some of the TDP activists can get jobs..in these days this is acceptable bribe and quid pro quo..which jagan failed to do such reasonable favoritism to its social warriors

  2. ఇజ్రాయిల్ లో jagan ఆస్తుల పంచాయతీ ఖర్చు కూడా, రాష్ట్ర ప్రజల మీదే వేసాడు ఈ సై కో జగన్.. తన వ్యక్తిగత ఇజ్రాయిల్ పర్యటన కోసం, రూ.22.50 లక్షలు ఖర్చు పెట్టాడు. ప్రజల సొమ్ము ఇంకా ఎంత తిన్నాడో

  3. గమనించారా..? ఏపీ రాజకీయాలు వారానికి ఒక టెండింగ్ టాపిక్ చుట్టూ తిరుగుతున్నాయి.. ఈ మధ్య బయటకు వస్తున్న చాలా టాపిక్స్ వైసీపీకి బాగా ఇబ్బందికరంగా మారాయి! * కాదంబరి జెత్వానీ కేసు * తిరుమల లడ్డూ వ్యవహారం * ఇప్పుడు వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారం..! ఈ మూడింటిలో కూడా వైసీపీ ఆత్మరక్షణలో పడింది.. అయితే ఇవే కాదు ఇంకా మున్ముందు చాలా ఉన్నాయి! బహుశా అతి త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకి రావచ్చు.. గత ప్రభుత్వ హయాంలో జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ.. ఆ తర్వాత ఒక పెద్ద కుంభకోణం ఆధారాలతో సహా బయటకి రావచ్చు! ఇలా వరుసగా జాబితా..

Comments are closed.