సాయి పల్లవి అంటే డ్యాన్స్ లు, సాయి పల్లవి అంటే సహజ నటన. అమె సినిమా వస్తోంది అంటే పాటలు, డ్యాన్స్ ల కోసం చూస్తారు. చైతన్య కాంబినేషన్ లో తండేల్ సినిమా వస్తోంది. మంచి భావోద్వేగ ఎమోషనల్ జర్నీ ఈ సినిమా అంటున్నారు దర్శకుడు చందు మొండేటి. మరి ఇలాంటి సినిమాలో పాటలు, ముఖ్యంగా డ్యాన్స్ లు వుంటాయా? అదీ సందేహం. ఈ సందేహానికి సమాధానం ఇచ్చారు సాయి పల్లవి.
సినిమాలో ఓ పాటలో మంచి డ్యాన్స్ చేసానని చెప్పారు సాయిపల్లవి ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఇచ్చిన ఇంటర్వూలో. ప్రేక్షకులు నచ్చేలా సినిమా వుంటుందన్నారు. లేటెస్ట్ గా వస్తున్న అమరన్ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు కాస్త ముందు వెనుక ఆలోచించానని, తనకు తగిన పాత్ర వుంటుందా అని అనుకున్నానని, కానీ దివంగత ముకుందన్ భార్యతో మాట్లాడిన తరువాత, ఆమె ధైర్యం చూసాక, చేయాలని డిసైడ్ అయ్యా అన్నారు.
అర్మీ జవాన్ల కుటుంబాలను తలుచుకుంటే గర్వంగా వుంటుందని, ఎక్కడికి వెళ్లినా తిరిగి వస్తామనే ధైర్యం వుంటుందని, కానీ యుద్దభూమికి వెళ్తే అలాంటి భరోసా వుండదని, అది తెలిసి కూడా ధైర్యంగా పంపే కుటుంబ సభ్యులు చాలా గొప్పవారని సాయిపల్లవి అన్నారు. అమరన్ సినిమా కోసం ఆర్మీ వారిని కలిసినపుడు, జవాన్ల కుటుంబ సభ్యులను కలిసినపుడు ఎన్నో కొత్త విషయాలు తెలిసాయన్నారు. తమ సినిమా ఆర్మీ వారికి చూపించినపుడు, తమ కథనే చూస్తున్నామని అనిపించిది అని ప్రశంసించారన్నారు.
ఈ మధ్య తాను ఏం మాట్లాడినా కాంట్రావర్సీ అవుతోందని, టోటల్ కంటెస్ట్ చూడకుండా చిన్న ముక్క చూసి తనను ద్వేషిస్తున్నారని అన్నారు. సీత పాత్ర రావడం తన అదృష్టమని సాయిపల్లవి అన్నారు. మనకు ఏం వచ్చినా, ఏ పాత్ర వచ్చినా అది డెస్టినీ అనే అనుకుంటా అన్నారు.
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
ఈ మధ్య చిరంజీవికి గిన్నిస్ రికార్డు వచినప్పట్నుండి ఏ cinemax లో ఎన్ని dance లు, స్టెప్పులు అని అడిగి మొత్తం గణాంకాలు కుదిరాక రిక్షా మీద London పోయి టాలీవుడ్ తరపున గిన్నిస్ లోకి ఎక్కుదామనేమో?
asalu adi gueinnis recordena
Eme kante …Kirthi Suresh better. Comedy timing kuda baguntadi. Good artist also.
Ee sai pallavi kuda Tamila bhajana party.
Anavasaram ga netthina pettu kuntynnaru
సైకో డాన్స్ ఉందా లేదా ? అంటే లుంగీ డాన్స్ లాగ
సై కో డాన్స్ ఉందా లేదా ? అంటే లుంగీ డాన్స్ లాగ