మ‌ళ్లీ మ‌న‌దే అధికారం!

భ‌విష్య‌త్‌లో అధికారంపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి రెండు నెల‌ల‌వుతోంది. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని కాపాడుకునేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా న‌డుచుకుంటున్నారు. ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక సంస్థ‌ల…

భ‌విష్య‌త్‌లో అధికారంపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి రెండు నెల‌ల‌వుతోంది. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని కాపాడుకునేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా న‌డుచుకుంటున్నారు. ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక నేప‌థ్యంలో ప్ర‌తి రోజూ ఎంపీటీసీలు, జెడ్సీటీసీల‌తో జ‌గ‌న్ స‌మావేశ‌మై దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ మాడుగుల నియోజ‌క‌వ‌ర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ రానున్న రోజుల్లో వైసీపీదే అధికారం అని భ‌రోసా వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు చేస్తున్న మోసాలు జ‌నంలో ఆగ్ర‌హానికి దారి తీస్తాయ‌న్నారు. జ‌గ‌న్ ప‌లావు ఇచ్చాడ‌ని, బాగా చూసుకున్నాడ‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్న‌ట్టు మాజీ ముఖ్య‌మంత్రి తెలిపారు. అయితే చంద్ర‌బాబు బిర్యానీ ఇస్తాన‌ని మోస‌గిస్తున్నాడ‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.

ఇప్పుడు ప‌లావు లేదు, బిర్యానీ లేదు… ప్ర‌జ‌లు ప‌స్తులుండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాబు మోసాల్ని చూస్తున్న ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం మొద‌ల‌వుతోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఐదేళ్ల‌లో వేధింపుల‌కు గురి చేస్తార‌న్నారు. క‌ష్టాలు కూడా వుంటాయ‌న్నారు. ఇందుకు త‌న ప‌రిస్థితులే ఉదాహ‌ర‌ణ అని ఆయ‌న అన్నారు.

త‌న‌ను 16 నెల‌లు జైల్లో పెట్టార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. అయితే క‌ష్టాలు ఎల్ల‌కాలం వుండ‌వ‌న్నారు. చీక‌టి త‌ర్వాత వెలుగు వుంటుంద‌ని, ఇది సృష్టి స‌హ‌జ‌మ‌ని జ‌గ‌న్ అన్నారు.

42 Replies to “మ‌ళ్లీ మ‌న‌దే అధికారం!”

  1. అధికారం గురించి తర్వాత కానీ ముందు ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకుని చూపించు.. అప్పుడు నమ్ముతా0 నీ పలావు కథలు.

  2. “జ‌గ‌న్ ప‌లావు ఇచ్చాడ‌ని, but చంద్ర‌బాబు బిర్యానీ ఇస్తాన‌ని మోస‌గిస్తున్నాడ‌ని…”

    “త‌న‌ను 16 నెల‌లు జైల్లో పెట్టార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు”

    అక్కడికెందుకు వెళ్లినట్లో? పంచభక్షపరమాన్నాలకు ఆశపడి కాదా?

  3. “జ‌గ‌న్ ప‌లావు ఇచ్చాడ‌ని, but చంద్ర‌బాబు బిర్యానీ ఇస్తాన‌ని మోస‌గిస్తున్నాడ‌ని…”

    “త‌న‌ను 16 నెల‌లు జైxల్లో పెట్టార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు”

    అక్కడికెందుకు వెళ్లినట్లో? పంచభక్షపరమాన్నాలకు ఆశపడి కాదా?

  4. Are you alright Leven Mohana??

    E’VM లు అన్నావు

    మోసం అన్నావు

    హామీలు అన్నావు

    ఇప్పుడేమో నేను పలావు , చంద్రబాబు బీర్యాని అంటూ కొత్త కథలు మొదలెట్టవు

    గల్లీ లీడర్ కూడా Failure ని accept చేసి నీకంటే డీసెంట్ గా practical కారణాలు ఏంటి అని analyze చేస్తున్నాడు.

  5. ఓ ఏడాది అన్న ఆగు, ఇలా అతి చేసే దొబెట్టుకున్నావు!! మళ్ళా గెలిచి ఏపీకుతావు జనం ఛీకొట్టిన ఇంకా ఆంధ్రలో ఎందుకు మీరు. మళ్ళీ పైచాశిక పాలనా తెస్తావా?

  6. అదీ జరగని పని ..ఉన్నా అన్నీ అవకాశాలని తుంగలో తొక్కాం 60% ప్రజల నమ్మకాన్ని కోల్పోయాం
    ఇంకా ఏపీలో వస్తే టీడీపీ లేకుంటే సంకీర్ణ ప్రభుత్వాలే
  7. ప్రజలు డబ్బుతో జల్సాలు చెయ్యడం నొక్కేయడం లో no 1 ఆయనకు వచ్చిన ఓట్లు టీడీపీ బీజేపీ కి వ్యతిరేకమైన ఓట్లు ఆ ఓటర్లు టీడీపీ బీజేపీ కి ఏ పార్టీ వ్యతిరేకం గ ఉంటే ఆ పార్టీ కె వేస్తారు అంతే తప్ప జగన్ గారిని చూసి మాత్రం కాదు వచ్చే ఎలేచ్షన్స్ లో జనసేన లేదా టీడీపీ లలో ఎదో పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొంటే మొత్తం వైసీపీ తుడిచి పెట్టుకొని పోతుంది పులివెందులతో సహా ఖాళీ రోడ్స్ లేకుండా పోలవరాన్ని నాశనం చేసి పరిశ్రమలను వాటాలకోసం తరిమేసిన విధానాన్ని చూసి ఎవరు ఓటు వెయ్యరు నాయకులు పోకుండా కాసి చివరకు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడానికి ఈ కబుర్లు

  8. నీతి, నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థత, నిరాడంబరతతో కూడిన వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ప్రజావ్యక్తిగా శక్తిగా ఎదిగిపోతున్నారు…

    జగన్ గారికి ప్రజలు 151 ఎమ్మెల్యేల బలంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు.. కానీ జగన్ గారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.. అహంకారం మరియు సొంత అభిమాన భావంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారు…

    నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం జగన్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే….

  9. పార్టీ అధ్యక్షుడిని నేనే చిప్ప కూడు తిన్నాను, మీకు పెడితే తినండి అని మోటివేట్ చేస్తున్నాడు..షౌమ్యుడు..డబ్బులు అంతంత మాత్రమే

  10. చెక్కర తింటే షుగర్ వస్తాది మబ్బు పట్టిన తరవాత వర్షము వస్తాది చెప్పారా ఇంకా చెప్పు నువు నీ చిల్లరా మాటలు పోరా

  11. పార్టీ అధ్యక్షుడిని నేనే చి ప్ప కూడు తిన్నాను, మీకు పెడితే తినండి అని మోటివేట్ చేస్తున్నాడు..షౌమ్యుడు..డబ్బులు అంతంత మాత్రమే

Comments are closed.