జ‌గ‌న్‌కు ఏమీ కాదు.. క‌ష్టాలు మాకే!

కూట‌మి ప్ర‌భుత్వం కూడా ఇంత త్వ‌ర‌గా త‌మ‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షం రోడ్డెక్కుతుంద‌ని ఊహించి వుండ‌దు.

రైతు పోరు పేరుతో వైసీపీ నిర్వ‌హించిన ఆందోళ‌న స‌క్సెస్ అయ్యింది. కూట‌మి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆరేడు నెల‌ల కాల వ్య‌వ‌ధిలోనే ఆందోళ‌న‌ల‌కు దిగాల్సి వ‌స్తుంద‌ని బ‌హుశా వైసీపీ ఊహించి వుండ‌దు. ఇదే సంద‌ర్భంలో కూట‌మి ప్ర‌భుత్వం కూడా ఇంత త్వ‌ర‌గా త‌మ‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షం రోడ్డెక్కుతుంద‌ని ఊహించి వుండ‌దు. రాజ‌కీయాల్లో ఊహించ‌న‌వి జ‌రుగుతూ వుంటాయి.

రైతు పోరు విజ‌య‌వంతం కావ‌డంతో వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఖుషీగా ఉన్నారు. దీంతో మ‌రో రెండు ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌పై జ‌గ‌న్ స్వ‌యంగా స‌మ‌న్వ‌యం చేస్తున్నార‌ని స‌మాచారం.

క‌రెంట్ చార్జీలు త‌గ్గించాల‌ని ఈ నెల 27న, అలాగే ఫీజురీయింబ‌ర్స్ బకాయిల్ని విడుద‌ల చేయాల‌ని కోరుతూ జ‌న‌వ‌రి 3న రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే వ‌రుస ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌పై వైసీపీలో భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి.

కూట‌మి స‌ర్కార్ కొలువు త‌క్కువ స‌మ‌యం కావ‌డంతో పాటు ప్ర‌భుత్వానికి టార్గెట్ కాకుండా వుండాలంటే కాస్త స‌మ‌యం ఇవ్వాల‌నే భావ‌న వైసీపీ శ్రేణుల్లో వుంది. రైతుపోరు వ‌ర‌కూ ఓకే అని, మిగిలిన ఆందోళ‌న‌ల‌కు కొంత స‌మ‌యం ఇచ్చి వుంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. క‌నీసం రెండుమూడు నెల‌ల‌కు ఒక ఆందోళ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తే, శ్రేణుల్లో కూడా ఉత్సాహం వుంటుంద‌ని నాయ‌కులు చెబుతున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వానికి కార్య‌క‌ర్త‌లు, చిన్న నాయ‌కులే సులువుగా టార్గెట్ అవుతున్నార‌ని, పెద్ద‌నాయ‌కుల‌కు ఏమీ కాద‌ని వారి అభిప్రాయం. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌రుస ఆందోళ‌న‌ల‌కు దిగితే, క్షేత్ర‌స్థాయిలో త‌లెత్తే ఇబ్బందుల్ని వైఎస్ జ‌గ‌న్ అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం వుంద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ మాత్రం ఆందోళ‌న‌ల్లో పాల్గొన‌కుండా, కేవ‌లం పిలుపున‌కే ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని అంటున్నారు. కార్య‌క‌ర్త‌ల క‌ష్టాల్ని అర్థం చేసుకుని, ఆందోళ‌న‌ల‌కు పిలుపు ఇస్తే బాగుంటుంద‌ని వారు హిత‌వు చెబుతున్నారు.

8 Replies to “జ‌గ‌న్‌కు ఏమీ కాదు.. క‌ష్టాలు మాకే!”

  1. కరెంటు charges తగ్గిస్తాను అని చెప్పి ఇప్పుడేమో పెంచినందుకు ప్రజలు రగిలిపోతున్నారు. నమ్మక ద్రోహం .ఇప్పటికే సిపిఎం వాళ్ళు ఆందోళన చేసారు so doing with a gap of 10 days is good and if at all cases they are bailable and alternately house arrest.

  2. జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఎత్తులు త్వరత్వరగా అడుగులు పడేందుకు కారణం దగ్గరలోనే జిమిలి ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పాలక పక్షానికి ఊపిరి ఆడకుండా చేస్తూ ఉండేందుకు ఇదే సరైన సమయమని భావించాలి. ఇంత త్వరగా కూటమి ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు.ప్రజాక్షేత్రంలో నాడి ఎలా ఉంటుందో బాగా తెలుసిన నేత జగన్మోహన్ రెడ్డి.

Comments are closed.