అప్పుడు ప‌బ్బం గ‌డుపుకోడానికి మాట్లాడారా?

రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తే, దిగిపోవాల్సి వ‌స్తోంద‌నే భ‌యం చంద్ర‌బాబు మాట‌ల్లో క‌నిపిస్తోంద‌ని వారు వెట‌క‌రిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మాట‌ల‌కు అర్థాలే వేరు. తాను ఏమైనా, ఎవ‌రినైనా మాట్లాడొచ్చ‌నే అభిప్రాయాన్ని త‌ర‌చూ క‌లిగించేలా బాబు అభిప్రాయాలుంటాయి. తాజాగా జ‌మిలి ఎన్నిక‌ల‌పై మీడియాతో నిర్వ‌హించిన చిట్‌చాట్‌లో కీల‌క కామెంట్స్ చేశారు. జ‌మిలి ఎన్నిక‌ల‌కు తాము మ‌ద్ద‌తు తెలిపామ‌ని గుర్తు చేశారు. అయితే జ‌మిలి ఎన్నిక‌లు 2029లోనే జ‌రుగుతాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

కానీ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోడానికి వైసీపీ ముందుగానే జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ప్ర‌చారం చేస్తోంద‌ని విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. జ‌మిలి ఎన్నిక‌ల‌పై వైసీపీకి అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వైసీపీ నేత‌ల మాట‌ల‌పై ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త లేద‌న్నారు. వాళ్ల మాట‌లు వింటూ జ‌నం న‌వ్వుకుంటున్నార‌ని చంద్ర‌బాబు వ్యంగ్యంగా అన్నారు.

ఇదే చంద్ర‌బాబునాయుడు వైసీపీ అధికారంలో ఉన్న‌న్నాళ్లు, ఇవిగో, అవిగో జ‌మిలి ఎన్నిక‌లంటూ ప‌దేప‌దే చెప్ప‌డాన్ని వైసీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు పార్ల‌మెంట్‌లో రెండు రోజుల్లో ప్ర‌వేశ పెడుతున్నార‌ని, అందుకే ముందుగానే ఎన్నిక‌లు రావ‌చ్చ‌ని తాము అనుకుంటున్నామ‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. ఆరేడు నెల‌ల పాల‌న‌కే ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ పోగొట్టుకున్న‌ది చంద్ర‌బాబునాయుడి ప్ర‌భుత్వ‌మే అని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

నిజంగా త‌న పాల‌న ప్ర‌జ‌ల మెప్పు పొందేలా వుంటే, ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా సిద్ధ‌మ‌ని చంద్ర‌బాబు ఎందుకు ధైర్యంగా చెప్ప‌లేక‌పోతున్నార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తే, దిగిపోవాల్సి వ‌స్తోంద‌నే భ‌యం చంద్ర‌బాబు మాట‌ల్లో క‌నిపిస్తోంద‌ని వారు వెట‌క‌రిస్తున్నారు.

14 Replies to “అప్పుడు ప‌బ్బం గ‌డుపుకోడానికి మాట్లాడారా?”

Comments are closed.