కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 27న, వచ్చే నెల 3న ఆందోళనలు నిర్వహించాల్సి వుంది. ఇప్పటికే రైతాంగ సమస్యలపై ఒక నిరసన కార్యక్రమం ముగిసింది. ముఖ్యంగా వచ్చే నెల 3న విద్యార్థుల సమస్యలపై జగన్ ఇప్పుడే నిరసనకు పిలుపు ఇవ్వకుండా వుండాల్సిందన్న అభిప్రాయం వైసీపీలో మెజార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
సమస్య మరింత జఠిలమై, విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించలేక, ఆ బాధను అనుభవించిన తర్వాతే ఆందోళన చేపట్టి వుంటే బాగుండేదన్న అభిప్రాయం నాయకుల్లో వుంది. అయితే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రల్లో ఇంకా అంత బాధ లేదని చెబుతున్నారు. ఈ లోపే జగన్ తొందరపడి పిలుపు ఇవ్వడంపై వైసీపీ నాయకులు నొచ్చుకుంటున్నారు.
కార్యక్రమం నిర్వహించాలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారమని, ఈ కోణంలో కూడా జగన్ ఆలోచించాల్సిన అవసరం వుందని నాయకుల అభిప్రాయం. జగన్ దగ్గర డబ్బు వుంటే సరిపోదని, నాయకులు కూడా చూసుకోవాలి కదా అని వాళ్లు అంటున్నారు. అయినప్పటికీ ఎవరైతే లబ్ధిదారులున్నారో, ముందుగా వాళ్లు తమ గళాన్ని వినిపించిన తర్వాతే, అండగా నిలబడితే రాజకీయంగా ప్రయోజనం వుంటుందని వైసీపీ నాయకులు అంటున్నారు.
జగన్‌కు ఎవరైనా సలహాలిస్తున్నారా? లేక తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు వాపోతున్నారు. తాడేపల్లిలో కూచుని ప్రభుత్వంపై ఆ పోరాటం, ఈ పోరాటం చేయండని పిలుపు ఇవ్వడం సులువని, కనీసం కూటమి సర్కార్ పాలన ఆరు నెలలు కూడా పూర్తి కాకుండానే ప్రతిపక్షం రోడ్డు మీదకి రావడం ఎందుకనే ఆలోచన వైసీపీ నేతల్లో వుంది. ముందుగా వైసీపీ కేడర్‌లో ధైర్యం నింపే జగన్ చేస్తే బాగుంటుందని, రెండుమూడు నెలలకు ఒకసారి ఏవైనా నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వచ్చే నెల మూడో తేదీ కళాశాల విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వుండదని, ఎందుకంటే విద్యా సంస్థల యజమానులు ప్రభుత్వానికి భయపడతారని అంటున్నారు. కావున అందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకని జగన్ ఆందోళనలకు పిలుపునిస్తే బాగుంటుంది. ఓడిపోయిన తర్వాత కూడా ఒంటెత్తు పోకడలకు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోందని వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అన్న బర్త్ డే వస్తే విషెస్ చెప్పి యాడ్స్ ఇవ్వడానికి అభిమానులు కార్యకర్తలే కావాలి…అన్న ఆందోళన చెయ్యమంటే పార్టీ క్యాడర్ సొంత ఖర్చు పెట్టుకోవాలి …అందులో పొరపాటున బుక్ ఐతే న్యాయ సహాయం కూడా వాళ్లే చూసుకోవాలి…ఇన్ని చేసి అధికారం లోకి వచ్చాక అనుభవించేది మాత్రం…అన్న ఇఇంకా అన్న చుట్టూ ఉన్న కోటరీ
సూపర్ 👍
నిజంగా నిజం చెప్పారు
విశ్లేషణ ఎవరో కానీ భాగా చెప్పారు, 2011నుంచి పార్టి జెండాలు మోసిన క్యాడర్ ఆర్ధిక పరిస్థితి ఏంటో ఆలోచించకుండా, అధికారంలో ఉన్నపుడు చేసిన పనులకు బిల్లు లేక ఒక గ్రామ స్థాయి నాయకుడు ఈ రోజు తమ పిల్లల చదువులు కూడా ఫీజులు కూడా కట్టే పరిస్థితి లేదు, ఈ రోజు నిజంగా పార్టి కోసం పని చేసిన వారి స్థితి, కమ్యూనిస్టు లు ఏ విధముగా ఆర్థికంగా ఉన్నారో వాళ్ళ కంటే దారుణంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి ఉంటే వాళ్ళ గురించి తెలుసుకొని పార్టి నీ సంస్థాగతంగా బలోపేతం చేయాలి గానీ, అధిష్టానం పక్కన జగనన్న దగ్గర ఈ విషయాలు చెప్పే వాళ్ళు లేరు
ప్రపంచంలో రక్తం ఎర్రగా ఉంటుందన్నది ఎంతటి నిజమో అంతటి నిజం చెప్పారు హ్యాట్సాఫ్ టు యు
Quite natural ga GA..maaavayya gurinchi thelisinde ga
Hello
Jagan gaadhu and sarmila YSR ki cheda buttaru.
YSR like God kanna ekkuva
I want world yo laugh at Indian media.
baada padaaka aandolana chesthe reach anta.. thupuk.. GA, I doubt your mom now
అధికారం లోకి వచ్చాక కార్యకర్తలు అభిమానులే కాదు ఎమ్మెల్యేలకే దిక్కు లేకుండాపోతోంది పేరుకి మాత్రమే మంత్రి పదవులు ఉంటాయి..
వైసీపీ చదువుకొన్నవాళ్లకు పిలుపు ఇస్తే వాళ్ళు వస్తారా చంద్రబాబు రోడ్స్ పోలవరం ఇతర అభివృద్ధి పనులు ఉపాధి పెంచే విధానం చూసి బుద్ది వున్న వాడెవడైన వైసీపీ పిలుపులకు స్పందిస్తారా మనం పిలుపు ఇవ్వాల్సింది మన గంజాయి బ్యాచ్ కి మన ఓటర్ లకు మాత్రమే
బిల్లు లేక ఒక గ్రామ స్థాయి నాయకుడు ఈ రోజు తమ పిల్లల చదువులు కూడా ఫీజులు కూడా కట్టే పరిస్థితి లేదు, ఈ రోజు నిజంగా పార్టి కోసం పని చేసిన వారి స్థితి, కమ్యూనిస్టు లు ఏ విధముగా ఆర్థికంగా ఉన్నారో వాళ్ళ కంటే దారుణంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి ఉంటే వాళ్ళ గురించి తెలుసుకొని పార్టి నీ సంస్థాగతంగా బలోపేతం చేయాలి గానీ, అధిష్టానం పక్కన జగనన్న దగ్గర ఈ విషయాలు చెప్పే వాళ్ళు లేరు
మీరు చెప్పినది అక్షరాలా నిజం