వైసీపీ శ్రేణుల భ‌యమంతా.. జ‌గ‌న్‌, కోట‌రీతోనే!

వైసీపీ కేడ‌ర్ ఇప్పుడు కూట‌మి నేత‌ల‌కు భ‌య‌ప‌డ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. జ‌గ‌న్ సీఎం అయితే మ‌ళ్లీ గ‌త ఐదేళ్ల‌లో ప‌డిన ఇబ్బందులే త‌ప్ప‌వా?

కూట‌మి స‌ర్కార్ కొలువుదీర‌క‌నే వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని విప‌రీతంగా భ‌య‌పెట్టింది. వైసీపీ కేడ‌ర్‌పై భౌతిక‌దాడులు, ఆస్తుల విధ్వంసాల‌కు టీడీపీ శ్రేణులు య‌థేచ్ఛ‌గా పాల్ప‌డ్డాయ‌ని గ‌గ్గోలు పెట్ట‌డం చూశాం. ప్ర‌తిరోజూ అవే వార్త‌లు. ఎక్కువ భ‌య‌పెట్ట‌డంతో వైసీపీ కేడ‌ర్‌లో కూట‌మి స‌ర్కార్ అంటే నెమ్మ‌దిగా భ‌యం పోతూ వ‌చ్చింది. పోలీసు కేసుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అన్నీ చూసిన వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు… ఇంత‌కంటే ఏం చేస్తార్లే అని త‌మ‌కు తాము ధైర్యం చెప్పుకున్నారు.

దీంతో స‌ర్కార్‌కు భ‌య‌ప‌డే రోజులు పోయాయ‌నే కామెంట్స్ వైసీపీ నుంచి క్ర‌మంగా పెరుగుతున్నాయి. అయితే వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల భ‌యం… జ‌గ‌న్‌, ఆయ‌న చుట్టూ ఉన్న వాళ్ల‌తోనే. కూట‌మి స‌ర్కార్ దాష్టీకాల‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌క త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని, అయితే మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత త‌మ ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతుంది. వైసీపీని అధికారంలోకి తెచ్చుకున్న త‌ర్వాత త‌మ త‌ల‌రాత‌లు జ‌గ‌న్‌, ఆయ‌న కోట‌రీ ఏ విధంగా రాస్తారో అనే భ‌యం వాళ్ల‌ను వెంటాడుతోంది.

వైసీపీ కేడ‌ర్ ఇప్పుడు కూట‌మి నేత‌ల‌కు భ‌య‌ప‌డ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. జ‌గ‌న్ సీఎం అయితే మ‌ళ్లీ గ‌త ఐదేళ్ల‌లో ప‌డిన ఇబ్బందులే త‌ప్ప‌వా? అనే సంశ‌యం వాళ్ల‌లో వుంది. త‌మ క‌ష్టానికి ఫ‌లితం వుంటుందో, వుండ‌దో అనే అనుమానం, భ‌యం వాళ్ల‌ను వెంటాడుతోంది. అందుకే వైసీపీ కేడ‌ర్ ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే ఆలోచ‌న‌తో ఎటూ అడుగులు వేయ‌లేక‌పోతోంది.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ ఏ స‌జ్జ‌ల‌కో, వైవీకో, విజ‌య‌సాయికో త‌మ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే, అప్పుడు ప‌రిస్థితి ఏంట‌ని వారు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. అప్పుడు మ‌ళ్లీ త‌మ బతుకులు మొద‌టికొస్తాయ‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ముందుగా జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని ఏంటంటే, భ‌విష్య‌త్‌లో తన‌తో పాటు త‌న చుట్టూ ఉన్న కోట‌రీతో ఎలాంటి న‌ష్టం క‌ల‌గ‌ద‌నే ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడు వైసీపీ శ్రేణులు యాక్టీవ్‌గా ప‌ని చేసే అవ‌కాశం వుంది.

9 Replies to “వైసీపీ శ్రేణుల భ‌యమంతా.. జ‌గ‌న్‌, కోట‌రీతోనే!”

  1. Indirect గా జగన్ తొ భయం లెదు. మా వాడి తాప్పెం లెదు, జగన్ సంప్రదాయిని, సుద్దపూసిని అనె చెప్పె ప్రయత్నమె ఇది!

    1. గ్రేటాంధ్ర కూడా పచ్చ పత్రికలని చూసి నేర్చుకుంటున్నాడు, తాతగారు శ్రమజీవి 24 గంటలు ప్రజలకోసం కష్టపడుతున్నాడు, నిద్రకూడా పోవడం లేదు, మనవడిని చూసి మూడు నెలలు అయింది. మనవడు కూడా తాతగారిని గుర్తుపట్టడం లేదు. మంత్రులు నిద్రపోతున్నారు, అవినీతి అంతా మంత్రులు, MLA లే చేస్తున్నారు తాతగారు సుద్ధపూస అని డంకా భజాయిస్తారు

    2. గ్రేటాంధ్ర కూడా పచ్చ పత్రికలని చూసి నేర్చుకుంటున్నాడు, తాతగారు శ్రమజీవి 24 గంటలు ప్రజలకోసం కష్టపడుతున్నాడు, నిద్రకూడా పోవడం లేదు, మనవడిని చూసి మూడు నెలలు అయింది. మనవడు కూడా తాతగారిని గుర్తుపట్టడం లేదు, మంత్రులు నిద్రపోతున్నారు, అవినీతి అంతా మంత్రులు, M L A లే చేస్తున్నారు తాతగారు సుద్ధపూస అని డంకా భజాయిస్తారు

    3. G A పచ్చ పత్రికలని చూసి నేర్చుకుంటున్నాడు, తాతగారు శ్రమజీవి 24 గంటలు ప్రజలకోసం కష్టపడుతున్నాడు, నిద్రకూడా పోవడం లేదు, మనవడిని చూసి మూడు నెలలు అయింది. మనవడు కూడా గుర్తుపట్టడం లేదు. మంత్రులు నిద్రపోతున్నారు, అవినీతి అంతా మంత్రులు, MLA లే చేస్తున్నారు తాతగారు సుద్ధపూస అని డంకా భజాయిస్తారు

Comments are closed.