జ‌గ‌న్ నుంచి ఏం కోరుకుంటున్నారు?

గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో నిమ‌గ్న‌మై, కార్య‌క‌ర్త‌ల్ని ప‌ట్టించుకోలేద‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అంగీక‌రించారు.

గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో నిమ‌గ్న‌మై, కార్య‌క‌ర్త‌ల్ని ప‌ట్టించుకోలేద‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అంగీక‌రించారు. ఈ ద‌ఫా అలా కాద‌ని, కార్య‌క‌ర్త‌లే త‌న‌కు బ‌ల‌మ‌ని, వాళ్ల‌కు బాగా చేస్తాన‌నే భ‌రోసా మాట‌లు చెప్పారు. వైసీపీ కోణంలో ఇది మంచి ప‌రిణామం. మొద‌ట త‌ప్పు తెలుసుకుంటే, ఆ త‌ర్వాత స‌రిచేసుకోవ‌చ్చు. ఇంత‌కాలం జ‌గ‌న్ ఎప్పుడూ కార్య‌క‌ర్త‌ల మాటే ప్ర‌స్తావించ‌లేదు.

పైన దేవుడున్నాడు, కింద ప్ర‌జ‌లున్నార‌ని ప‌దేప‌దే జ‌గ‌న్ అనేవారు. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు అనేక మార్పులు తీసుకొస్తుంటాయి. ఎవ‌రైనా వాటికి అనుగుణంగా మారితేనే, భ‌విష్య‌త్ వుంటుంది. లేదంటే కాల‌గ‌ర్భంలో క‌లిసి పోవాల్సిందే. అయితే జ‌గ‌న్ నుంచి వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఏం కోరుకుంటున్నార‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

కేవ‌లం జ‌గ‌న్ నుంచి ఆత్మీయ ప‌ల‌క‌రింపు, ఆయ‌న జ్ఞాప‌కంగా పెట్టుకునేందుకు క‌లిసి ఒక ఫొటో తీసుకోవ‌డం. మెజార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కోరుకున్న‌ది, ఆశించేది ఇదే. కానీ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో ఏనాడూ తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యం దాటి రాలేదు. ఒక‌వేళ వ‌చ్చినా, వేదిక‌ల‌పై ఉప‌న్యాసాల‌కు ప‌రిమితం అయ్యేవారు. దీంతో జ‌గ‌న్‌ను తామేం కోరుకున్నామ‌ని, కనీసం ప‌ల‌క‌రింపున‌కు కూడా నోచుకోలేక‌పోతున్నామ‌నే ఆవేద‌న‌, ఆగ్ర‌హం క్ర‌మంగా పెరుగుగూ వ‌చ్చాయి.

ప్ర‌ధానంగా వైసీపీ ఘోర పరాజయానికి కార్య‌క‌ర్త‌లు జెండా ప‌క్క‌న ప‌డేసి, అంతా వాలంటీర్లే చూసుకుంటార్లే అనే నిర‌స‌న ప్ర‌క‌టించ‌డ‌మే. వైసీపీ అధికారంలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కోరుకున్న‌ది చేయ‌డానికి జ‌గ‌న్ ఖ‌ర్చు చేయాల్సింది కూడా ఏమీ లేదు. కాసింత త‌న స‌మ‌యాన్ని ఖ‌ర్చు చేయ‌డం త‌ప్ప‌, డ‌బ్బు కాద‌ని జ‌గ‌న్ గ్ర‌హించ‌లేక‌పోయారు. అధికారం అనేది జ‌గ‌న్‌ను భ్ర‌మ‌లో ఉంచేసింది. ఎంత‌సేపూ బ‌ట‌న్ నొక్కుతున్నా క‌దా, మ్యానిఫెస్టోను అమ‌లు చేస్తున్నా క‌దా అనే ఆలోచ‌న‌లోనే జ‌గ‌న్ ఉన్నారు.

కానీ ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో త‌న‌కు మాన‌సిక బంధం వుంద‌నే సంగ‌తిని విస్మ‌రించారు. అధికారం అనేది ఆ బంధాన్ని తెంచుతున్న వాస్త‌వాన్ని గుర్తించ‌లేక‌పోయారు. ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత, క‌నీసం ఇప్ప‌టికైనా కార్య‌క‌ర్త‌లకు ఆ మాత్రం భ‌రోసా ఇవ్వ‌డం గుడ్డిలో మెల్ల అనే సామెత‌ను వైసీపీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు.

15 Replies to “జ‌గ‌న్ నుంచి ఏం కోరుకుంటున్నారు?”

  1. బాబాయ్ ని ఎవరు, ఎందుకు చంపేశారో .. అతి నిజాయితీ.. అతి మంచితనం తో చెప్పమని కోరుకొంటున్నారు..

  2. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

  3. అంటే… పుష్ప 2 మాదిరి అన్నట్టు….ఒక్క ఫోటో ఇవ్వనందుకే… పుష్ప గాడూ ముఖ్య మంత్రి నే దించేయలా…అలాగే ఇక్కడా మనోళ్లు కూడా,, ఫోటో కిసిక్కు అనిపించ లేదనీ,,, ముఖ్య మంత్రి నే మార్చేసారబ్బ

  4. ఎదొ తెలిసిందంటు ఈ మీడియా స్వత్కోర్షా… అది రామలింగడు మేక తోక పధ్యం లా ఉంది..

  5. Photo and palakarimpu kosam odinchesara?. Janalaki dabbulu panchesaru, volunteers and mlas tinnaru. madhyalo memu tinaleka poyam Ani valla badha. Otamiki karanam prajallo kopam. Adi realize kakapote 4 years tarvata kuda otami chudalsinde.

  6. అసెంబ్లీకి రానంటాడు,

    జనాల్లోకి వెళ్ళనంటాడు,

    ఆంధ్రాలో ఉండనంటాడు,

    బెంగళూరే బెటర్ అంటాడు!

    దసరా అంటాడు,

    సంక్రాంతి అంటాడు,

    ఉగాదికి వస్తానంటాడు!

    మొత్తం దసర బుల్లోడు కబుర్లు..

Comments are closed.