ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో వుంది. దాదాపు ఏడు ఉమ్మడి జిల్లాల్లో కోడ్ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ నెల 5న ఫీజు పోరు తలపెట్టడంపై పార్టీలో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే రెండుమూడు సార్లు వివిధ కారణాలతో ఫీజు పోరును వైసీపీ అధిష్టానం వాయిదా వేసింది. చివరికి ఈ నెల 5న నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే ఎన్నికల కోడ్ అమల్లో వుండగా, మొక్కుబడిగా చేయడం ఏంటనే చర్చ వైసీపీలో అంతర్గతంగా సాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో వుండగా ర్యాలీగా కలెక్టరేట్ల వరకూ వెళ్లడానికి అనుమతి లభించదు. వైసీపీ జెండాలు లేకుండా, ఉత్తిగా కార్యకర్తలు , నాయకులు వెళ్లడం వల్ల రాజకీయ ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే మరోసారి ఫీజు పోరు వాయిదా వేస్తే, ముఖ్యంగా విద్యార్థుల్లోకి నెగెటివ్ సంకేతాలు వెళ్తాయని వైసీపీ భయపడుతోంది. అందుకే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా, ఇక దీన్ని ఇంతటితో ముగించాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు కాకపోతే, ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మార్చిలో మాత్రమే నిర్వహించాలని, అంత వరకూ వేచి చూడలేమని వైసీపీ నాయకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నా, ఫీజు పోరు నిర్వహణకే పార్టీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దీంతో ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి, వైసీపీ నాయకులు ఫీజు పోరుకు సన్నద్ధం అవుతున్నారు.
“దీంతో ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి, వైసీపీ నాయకులు ఫీజు పోరుకు సన్నద్ధం అవుతున్నారు”..is this secret msg to Jagan?
its waste of time..
అన్నాయ్, కేవలం కళ్ళు గట్టిగా మూసుకుంటే వచ్చే అధికారానికి, గీ పోర్లు అవసరమా చెప్పు??
Konchem aa party peddalu evaro cheppandi pls