ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నుంచి రాజకీయ లక్షణాల్ని ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ బాగా అలవరుచుకున్నారనే అభిప్రాయం వుంది. ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి? అవి ముగిసిన తర్వాత ఎలా వ్యవహరించాలో లోకేశ్ మంచిగా శిక్షణ పొందినట్టున్నారని నిరుద్యోగులు అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా డీఎస్సీ ప్రకటనపై విద్యాశాఖ మంత్రి అయిన లోకేశ్ స్పందనే అంటున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక, అలాగే రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఓటర్లంతా విద్యావంతులే. ఈ ఎన్నికల్లో వామపక్ష సంఘాలు బలంగా ఢీకొననున్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం. ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా, నైతికంగా కూటమి పతనం ప్రారంభం అవుతుంది. ఇది రాజకీయంగా తీవ్ర దెబ్బతీస్తుంది. ఈ భయం కూటమిని వెంటాడుతోంది. అయితే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు వైసీపీ ఎంతో ముందుగానే ప్రకటించింది. దీంతో వామపక్షాల అభ్యర్థులకు అనివార్యంగా వైసీపీ అనధికారికంగా మద్దతు ఇచ్చినట్టే అని అర్థం చేసుకోవాలి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత సంతకం చేసిన తొలి ఫైల్ డీఎస్సీ నియామకాలకు సంబంధించి. 16 వేలకు పైబడి ఉపాధ్యాయ నియామకాల ఫైల్‌పై సంతకం చేసి ఏడు నెలలవుతోంది. ఆ తర్వాత అతీగతీ లేదు. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల అవనిగడ్డలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీలో జాప్యాన్ని నిరసిస్తూ నిరుద్యోగ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో ప్రభుత్వ నిబద్ధతతపై అనుమానం వుంది.
ఇంత కాలం ఏ,బీ, సీ, డీ వర్గీకరణ కారణంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి అని నారా లోకేశ్ అంటున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేశ్ అంటున్నారు. మార్చిలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభించి, జూన్‌లో పూర్తి చేస్తామని లోకేశ్ ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటన కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే అని నిరుద్యోగ ఉపాధ్యాయులు అంటున్నారు.
నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే, ఎన్నికల కోడ్ రాక ముందే ఎందుకు డీఎస్సీ ప్రక్రియ చేపట్టలేదనే ప్రశ్న వాళ్ల నుంచి ఎదురవుతోంది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. డీఎస్సీ ప్రకటనతో నెలల తరబడి కోచింగ్ తీసుకుంటూ, ఖర్చులు తడిసి భారం అవుతున్నాయని వాళ్లు లబోదిబోమంటున్నారు. అసలే నిరుద్యోగంతో అల్లాడుతున్నయువతతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదు.
ఉన్న ఉద్యోగస్తులకే జీతాలు కోసం అప్పులు చేస్తుంటే కొత్త ఉద్యోగాలు అంటూ హామీలా?
ప్రజలను ఎన్నిసార్లు వెర్రిపూలను చేస్తారు లోకేశం?
Ennisarlaina verripoosalautaru. Atyasa kada? 600 haameeluichi egagottina, runa mafee egagottina, temporary buildings antundi money waste chesina, AIMS ninrayalaseema nunchi Mangalagiri kinshift chesina, Rayalaseema culture ningoondalu , rowady lunantune votlu adukknna, 164 seats icharuga
ప్రజలు వెర్రిపూల్ అయినప్పుడు ఎన్నిసార్లు అయినా చెయ్యగలరు, చేస్తారు, చేస్తూనే ఉంటారు
ఎస్, ఎలక్షన్ result కి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సంబంధం లేదు.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే, లక్ష యాభై వేల ఉగ్యోగాలు ఇచ్చాడు.. ఎం లాభం.. ఎం లేదు… జనాల్ని ఇలా ఇస్తాం ఇస్తాం అని భ్రమలోనే ఉంచాలి… అప్పుడే వోట్ వేస్తారు…
ఎస్, ఎలక్షన్ రేసుల్ట్ కి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సంబంధం లేదు.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే, వేల ఉగ్యోగాలు ఇచ్చాడు.. ఎం లాభం.. ఎం లేదు… జనాల్ని ఇలా ఇస్తాం ఇస్తాం అని భ్రమలోనే ఉంచాలి… అప్పుడే వోట్ వేస్తారు…