భ‌క్తి ఎక్కువైనా ప్ర‌మాద‌మే.. ఏ దేవుడు చెప్పాలి!

ఎంత పురోగ‌తి సాధించినా మూఢ‌న‌మ్మ‌కాలు మాత్రం మ‌నిషిని వ‌ద‌లడం లేదు. ముందుగా చెప్పిన‌ట్టుగా దీనికి ఏ మ‌తం మిన‌హాయింపు కాదు.

మాన‌వాళిని ఎంతో కొంత క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెడుతున్న‌ది భ‌క్తి కూడా అని చాలా మంది అంటారు. వేల సంవ‌త్స‌రాల మాన‌వ‌మ‌నుగ‌ను గ‌మ‌నించినా.. నాస్తిక‌త్వం క‌న్నా ఆస్తిక‌త్వ‌మే ఎప్పుడూ పై చేయి సాధిస్తూ ఉంది. ఏ మ‌తం ఆధిప‌త్యంలో ఉన్నా, ఏ ప్రాంతం అయినా.. భ‌క్తే మనిషిని నిర్దేశించింది శ‌తాబ్దాల పాటు. ప్ర‌తి మ‌తం కూడా భ‌యంభ‌క్తుల‌తో మ‌న‌గ‌డ సాగించ‌మ‌ని ఆదేశాలు ఇస్తుంది. భ‌క్తి గురించి ప్ర‌వ‌చ‌న‌క‌ర్త‌లు, భ‌క్తి ఉద్య‌మ‌కారులు, ప‌విత్ర‌గ్రంధాల ర‌చ‌యిత‌లు.. మార్గ‌నిర్దేశ‌కత్వం చేశారు, చేస్తూ ఉంటారు! అయితే భ‌క్తి మూఢ‌త్వం మార‌డం కూడా కొత్త ఏమీ కాదు. శ‌తాబ్దాల నుంచి మూఢ‌న‌మ్మ‌కాలు అనేవి అన్ని మ‌తాల్లో ఉన్న‌వే! భ‌క్తికి ప్రాంతం, మ‌తం ఎలా మినహాయింపు కాదో, మూఢ న‌మ్మ‌కాల‌కు కూడా ఏ మ‌త‌మూ మిన‌హాయింపు కాదు. ఈ మూఢ‌న‌మ్మ‌కాల‌నూ భ‌క్తి ముసుగులోనే గ‌ట్టిగా ప్ర‌చారంలో పెట్టారు.

భ‌క్తి, మ‌తం సంగ‌త‌లా ఉంచి.. బ‌య‌ట‌కు వ‌స్తే మ‌నిషి ఎంతో పురోగ‌తిని సాధించాడు. అది రాత్రికి రాత్రి సాధించింది ఏమీ కాదు. భ‌క్తి, మ‌తంలో అన్నీ రాత్రికి రాత్రి జ‌రుగుతాయి. అయితే మ‌నిషి పురోగ‌తి మాత్రం వేల సంవ‌త్స‌రాల పాటు ప‌డుతూ ఉన్నది. మ‌నిషి పురోగ‌తిలోనూ, ఆవిష్క‌ర‌ణ‌ల్లోనూ ఒక్కో అడుగే ప‌డింది త‌ప్ప‌.. రాత్రికి రాత్రి జ‌రిగిన అద్భుతాలు ఉండ‌వు. అలా జ‌రిగితే అది కూడా భ‌క్తి వ‌ల్ల‌నే, దేవుడి వ‌ల్ల‌నే వాద‌న‌కు మ‌రింత‌గా అవ‌కాశం ఉండేదేమో. అయితే అనేక ప్ర‌య‌త్నాలు, వైప‌ల్యాల అనంత‌ర‌మే పురోగ‌తికి బాట‌లు ప‌డ్డాయి. కంప్యూట‌ర్ యుగం వ‌ర‌కూ వ‌చ్చాడు మ‌నిషి.

అయితే.. ఎంత పురోగ‌తి సాధించినా మూఢ‌న‌మ్మ‌కాలు మాత్రం మ‌నిషిని వ‌ద‌లడం లేదు. ముందుగా చెప్పిన‌ట్టుగా దీనికి ఏ మ‌తం మిన‌హాయింపు కాదు. ఎక్క‌డైతే మ‌తంపై అతి న‌మ్మ‌కం, మ‌త విశ్వాసాలను పాటించ‌డంపై విప‌రీత‌మైన ప్ర‌చారం, ఒత్తిళ్లు ఉంటాయో.. అక్క‌డ మూఢ‌న‌మ్మ‌కాల ప్ర‌భావం కూడా ఎక్కువ‌వుతుంది. మ‌రి ఈ మూఢ‌న‌మ్మ‌కాలను పాటించ‌డం కోసం మ‌నుషులు త‌మ‌ను తాము ఎంత క‌ష్ట‌పెట్టుకోవ‌డానికి కూడా వెనుకాడ‌రు. మ‌తం, విశ్వాసం వారిని ఆ స్థాయికి తీసుకెళ్తుంది.

కోట్ల మంది ప‌విత్ర స్నానాలు చేసే మ‌హాకుంభ మేళా అయినా ఎలాంటి దుర్ఘ‌ట‌న లేకుండా సాగుతుందనే ఆస్కారం లేకుండా అక్క‌డా తొక్కిస‌లాట త‌ప్ప‌లేదు. ఇటీవ‌లే వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టికెట్ల కోసం తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే ఇది మ‌రోటి. కుంభేమేళాలో గ‌తంలో కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన చ‌రిత్ర ఉంది కానీ, తిరుప‌తి ఘట‌న మాత్రం టీటీడీ చ‌రిత్ర‌లో మొద‌టిది. ఆ ఘ‌ట‌నలో ఎవ‌రిపై చ‌ర్య‌లు తీసుకోబ‌డ్డాయో కానీ.. పొలిటిక‌ల్ డ్రామాల‌తో అది తెర‌మ‌రుగు అయ్యింది. కుంభమేళా సంఘ‌ట‌న తిరుపతి ఘ‌ట‌న‌ను కూడా చ‌ర్చ‌లోకి తీసుకొచ్చింది. అంత‌కు ముందు గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా కూడా ఏపీలో తీవ్ర‌మైన తొక్కిసలాట జ‌రిగింది. నాటి ఘ‌ట‌న‌లో దాదాపు 26 మంది మ‌ర‌ణించారు. కుంభ‌మేళా ఘ‌ట‌న కూడా అదే త‌ర‌హాలో జ‌రిగిన‌ట్టుగా ఉంది.

లక్ష‌ల మంది భక్తుల‌ను ఒకేసారి వ‌ద‌ల‌డం వ‌ల్ల‌నే తొక్కిస‌లాట అనే మాట వినిపిస్తూ ఉంది. ఏ మ‌త విశ్వాసాల‌నూ ఎవ్వ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌ని లేదు. అయితే అంధ విశ్వాసాల‌తోనే మొత్తం చేటంతా. ఒకే ముహూర్తం, ఒకేసారి.. అనే మాట‌లే భ‌యాన్ని క‌లిగిస్తూ ఉన్నాయి మ‌తం విష‌యంలో. వీటిని ఎవ‌రు ప్ర‌చారంలో పెడ‌తారు అంటే.. దానికి కార‌ణం నిస్సందేహంగా మ‌ళ్లీ భ‌క్తి ప్ర‌చార‌కర్త‌లే!

కంప్యూట‌ర్ యుగంలో కూడా ముహూర్తాల‌ను, వాటి బ‌లాల‌ను, అప్పుడు చేస్తేనే పుణ్యం అనే వాద‌న‌ల‌ను వీరు ప్ర‌చారంలో పెట్ట‌గ‌ల స‌మ‌ర్థులు. మ‌నుషుల బ‌ల‌హీన‌త ఏమిటంటే.. మ‌తంతో ముడిప‌డిన అలాంటి ప్ర‌చారాల‌ను తేలిక‌గా న‌మ్మ‌డం. ఆ న‌మ్మ‌కాల పుణ్యంగా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతూ ఉన్నాయి.

భ‌క్తి ఎక్కువైన ఫ‌లితాలు ఇవి. భ‌క్తి లేక‌పోతే ప్ర‌మాదం ఏమో కానీ, భ‌క్తి ఎక్కువ అయితే మాత్రం చాలా ప్ర‌మాదాలు క‌నిపిస్తూ ఉన్నాయి. భ‌క్తితో పుణ్యం పొందాలనే తాప‌త్ర‌యంతో మొద‌టికే మోసం తెచ్చుకుంటున్నారు ప్ర‌జానీకం. భ‌క్తి కూడా అవ‌స‌ర‌మైన స్థాయిలో ఉండాల‌ని, భ‌క్తి కూడా పుణ్యం సంపాదించుకోవాల‌నే స్వార్థంగా మార‌కూడ‌ద‌ని ఆశించాలి. క‌నీసం ఏ దేవుడైనా, ఏ ప్ర‌వ‌చ‌న‌కారుడు అయినా.. భ‌క్తి అనేది వ్య‌క్తిగ‌తంగా పుణ్యం సంపాదించుకోవాల‌నే అతి స్వార్థానికి మార్గం కాద‌ని, పుణ్య‌స్నానాలు, ద్వార ద‌ర్శ‌నాల‌తోనే అంతా అయిపోద‌ని.. అవి కాస్త అటూ ఇటూ అయినా ఫ‌ర్వాలేద‌ని భ‌క్తి మార్గంలోని వారే ప్ర‌జ‌ల‌కు ప్ర‌బోధించాలి.

ఈ రోజుల్లో కూడా ఇలాంటి న‌మ్మ‌కాల‌తో ఎగ‌బ‌డి ప్రాణాల‌ను కోల్పోవ‌డం అజ్ఞాన‌మే అవుతుంది త‌ప్ప‌, అది ఏర‌క‌మైన జ్ఞానం కాద‌ని, అది వెనుక‌బాటుత‌నానికి ప్ర‌తీక అవుతుంది త‌ప్ప ప‌విత్ర గ్రంధాలు చెప్పే స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌కు కూడా అది ఎన్నో వేల మైళ్ల దూరం అని ప్ర‌వ‌చ‌న‌క‌ర్త‌లు అయినా బోధించాలి భ‌క్తాగ్రేస‌రుల‌కు!

20 Replies to “భ‌క్తి ఎక్కువైనా ప్ర‌మాద‌మే.. ఏ దేవుడు చెప్పాలి!”

  1. చెప్తే వింటారా? తిరుపతి ఘటన తర్వాత గరికిపాటి ఆయన నెత్తి నోరు బాదుకొని చెప్పాడు ఇటువంటి పిచ్చి నమ్మకాలు పెంచుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని. మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల నుంచే బయల్దేరి కుంభమేళా కి పోతున్నారు ఈ తొక్కిసలాట తర్వాత కూడా.

    పైగా ఇటువంటి చోట్ల చనిపోతే పుణ్యం అనుకునే మహానుభావులు కూడా కొంత మంది ఉంటారు. ఈ తరహా మూఢ భావాలు ఉన్నవాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకుని ప్రయోజనం లేదు. ఈ కుంభమేళా లో కుదరక పోతే ఇంకో పుష్కరాల్లో. వీళ్ళ్ళకి ప్రాణాల మీద కన్నా పుణ్యాల మీదే ఎక్కువ కోరిక. వీళ్ళకి లేని బాధ మనకెందుకు?

  2. ఏ దేవుడు చెప్పినా వినరు… కొంతమంది గొర్రెలు మాటలు మాత్రమే వింటారు….

  3. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి..

    అధికారం లోకి వచ్చాక.. మందు అమ్మితే గాని.. అమ్మ ఒడి ఇవ్వలేమని అసెంబ్లీ లో రొమ్ము ఇరుచుకుని ప్రకటించుకున్న ధీరుడు మన జగనన్న..

  4. వింతేమిటంటే.. హామీలు 100% చేసేసాయమని చెప్పేసుకొంటారు.. అది మనం వింటాం.. చప్పట్లు కొడతాం..

  5. వింతేమిటంటే.. హామీలు 100% చేసేసాయమని చెప్పేసుకొంటారు.. అది మనం వింటాం.. చప్పట్లు కొ డతాం..

  6. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి..

    అధికారం లోకి వచ్చాక.. మందు అమ్మితే గాని.. అమ్మ ఒడి ఇవ్వలేమని అసెంబ్లీ లో రొమ్ము ఇరుచుకుని ప్రకటించుకున్న ధీరుడు మన జగనన్న..

    వింతేమిటంటే.. హామీలు 100% చేసేసాయమని చెప్పేసుకొంటారు.. అది మనం వింటాం.. చప్పట్లు కొ డతాం..

    అందుకే జనాలు జోడు మెట్ల తో ఎడా పెడా కొ ట్టా రు..

  7. ఏది పుణ్యం ఏది పాపం ఏది సత్యం ఏది నిత్యమో తెలియునని ప్రవచనాల మహిమ

  8. నేను : బాబోరు 100 రోజుల్లో 100 IT కంపెనీస్ తెస్తా అన్నారు.. .. తెచ్చారా.. ?

    వాడు : ఏయ్ ఎం మాట్లాడుతున్నావ్.. మందు మీద ఇరవై రూపాయిలు తగ్గించాం.. చాలదా..

  9. మా A1 సీఎం అయ్యుంటే, హిందువుల మీదకక్షతో అసలు కుంభమేళా జరక్కుండా రద్దు చేసి పడేసేవాడు, ఇక తొక్కకిసలాట స్కోప్ ఉండేదే కాదు తెలుసా??

  10. మావోడు సీఎం అయ్యుంటే ఊరికో”త్రివేణి సంఘమం సెట్టింగ్” వేసి, ఇంటింటికీ వాలంటీర్స్ తో కుంభమేళా నీళ్లు అందించేవాడు తెలుసా??ఈ జనాలు ఉన్నారే.. 11 ఇంచులు దింపి లండన్ కి పారిపోయేట్టు చేశారు.. కోపంగా ఉంది.

  11. నీజమే. ఈ విధంగా ఆ రోజే వెళ్తే అక్కడ కే వేలెతేనే అది పుణ్యం మిగతా అంతా వృధా అనే మాటలు తప్పు . ఆ ప్లేస్ కాక పోతే దగ్గర్లో ఉన్న నదుల్లో అయిన మంచిది అని చెప్పాలి

  12. Shirk haraam halaal దశమ భాగాలు అన్యులు kaafirs చార్ నిఖా triple talaq darul islam ఎందుకురా cheppavu నిత్యం హిందుత్వం పై పడి ఏడకు…pastors terrorists mi….nor rap…es కూడా ప్రశ్నించి మాట్లాడు

  13. అధిక శాతం జనాలకి దేవుడు అంటే ఒక నమ్మకం.. నమ్మకానికి మూఢ నమ్మకానికి తేడా ఏమి లేదు.. మతం అంటేనే ఒక మూఢ నమ్మకం.. ఒక మతానికి నోరు లేదు కదాని దాని మీద మాత్రమే నోరు పారేసుకోడం కూడా ఒక మూఢ నమ్మకం…

  14. ఈ ఆర్టికల్ రాసిన మహానుభావా ఈ కంప్యూటర్ యుగంలో మీరు ముహూర్తాలు పెట్టుకోకుండా, ముహూర్తాలు బలాబలాలు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారా, ధైర్యం ఉంటే గుండె మీద చేయి వేసుకొని చెప్పండి

Comments are closed.