వైసీపీ అభ్య‌ర్థి అపార్ట్‌మెంట్ కూల్చేస్తాం!

ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ తిరుమ‌ల బైపాస్‌లో నెల‌కుంది. ఎందుకంటే ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణం జ‌రిగేది అక్క‌డే.

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక‌లో నెగ్గ‌డం సాధ్యం కాద‌ని తెలిసి, కూట‌మి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచ‌కానికి తెర‌లేపింద‌ని వైసీపీ తీవ్ర విమ‌ర్శ చేస్తోంది. ఈ నెల 3న తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. వైసీపీ త‌ర‌పున 42వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ శేఖ‌ర్‌రెడ్డిని వైసీపీ బ‌రిలో నిలిపింది.

అయితే టీడీపీకి అధికారికంగా ఒకే ఒక్క కార్పొరేట‌ర్ ఉన్నారు. ప‌ది మంది వ‌ర‌కూ వైసీపీ నుంచి కూట‌మి వైపు వెళ్లారు. దీంతో డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లో గెల‌వ‌లేమ‌ని కూట‌మి నేత‌ల‌కు అర్థ‌మైంది. అయితే అధికారంలో ఉన్న కార‌ణంతో, తిరుప‌తిలో వైసీపీ అభ్య‌ర్థి గెలిస్తే అవ‌మానంగా కూట‌మి నేత‌లు భావిస్తున్నారు. ఇక్క‌డి నుంచి జ‌న‌సేన ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

ఎలాగైనా డిప్యూటీ మేయ‌ర్ స్థానాన్ని సొంతం చేసుకోవాల‌ని కూట‌మి ప‌ట్టుద‌ల‌తో వుంది. అయితే బ‌లం లేని కార‌ణంగా, బ‌లాత్క‌రం చేయ‌డానికి కూడా వెనుకాడడం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. వైసీపీ అభ్య‌ర్థి శేఖ‌ర‌రెడ్డి, ఆయ‌న బంధువుల‌కు టీడీపీ, జ‌న‌సేన నాయకులు ఫోన్లు చేస్తూ తీవ్ర బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు.

శేఖ‌ర‌రెడ్డి అపార్ట్‌మెంట్ నిర్మాణాన్ని కూల‌దోస్తామ‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌ల ఫోన్ కాల్స్ బెదిరింపుల సారాంశం. ఈ క్ర‌మంలో న‌గ‌రంలోని క‌పిల‌తీర్థం స‌మీపంలో శేఖ‌ర‌రెడ్డి నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ నిర్మాణాన్ని కూల్చి వేసేందుకు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారుల్ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉసిగొల్పిన‌ట్టు తెలిసింది. డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో తిరుప‌తికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ చేరుకున్నారు.

ప్ర‌భుత్వ సామ‌దాన దండోపాయాలేవీ మెజార్టీ వైసీపీ కార్పొరేట‌ర్ల‌పై ప‌ని చేయ‌లేదు. మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి త‌న నాయ‌క‌త్వం బ‌లంతో మెజార్టీ కార్పొరేట‌ర్ల‌ను నిలుపుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం 8 గంట‌ల‌క‌ల్లా శేఖ‌ర‌రెడ్డి అపార్ట్‌మెంట్ ద‌గ్గ‌రికి టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, అలాగే పోలీసులు చేరుకోవాల‌నే మెసేజ్ కార్పొరేష‌న్ కార్యాల‌య అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది.

ఈ విష‌యం తెలిసి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్ వ‌ద్ద‌కు చేరుకున్నాయి. ఎలాంటి ప‌రిస్థితి అయినా ఎదుర్కోడానికి భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అభిన‌య్ నాయ‌క‌త్వంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు రెడీగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ తిరుమ‌ల బైపాస్‌లో నెల‌కుంది. ఎందుకంటే ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణం జ‌రిగేది అక్క‌డే.

18 Replies to “వైసీపీ అభ్య‌ర్థి అపార్ట్‌మెంట్ కూల్చేస్తాం!”

  1. నేను : బాబోరు 100 రోజుల్లో 100 IT కంపెనీస్ తెస్తా అన్నారు.. .. తెచ్చారా.. ?

    వాడు : ఏయ్ ఎం మాట్లాడుతున్నావ్.. మందు మీద ఇరవై రూపాయిలు తగ్గించాం.. చాలదా..

  2. వైసీపీ హయాంలో సర్పంచులు జడ్పిటిసి ఎంపిటిసి మున్సిపల్ ఎన్నికల్లో ఎంతోమంది పై అక్రమ కేసులు బనాయించే వారిని పోటీ చేయకుండా చేశారు.

    కొంతమంది మీద భౌతిక దాడి కూడా చేశారు .

    మరి కొంతమంది మీద హత్య ప్రయత్నం కూడా చేశారు . మరి అప్పుడు అనిపించలేదా ఇవన్నీ తప్పని . శేఖర్ రెడ్డి అపార్ట్మెంట్ అక్రమంగా కట్టిందో సక్రమంగా కట్టిందో విచారణ చేస్తే గాని తెలియదు కదా. అంతటి లోపల ఆయన మీదే కచ్చా కట్టారు అని ఎలా చెప్పగలరా గ్యాస్ ఆంధ్ర . ఇవన్నీ జరిగినప్పుడు ఐదేళ్లలో ఒక్కసారి కూడా నోరు చదవని కుక్కవి ఇప్పుడేందుకు మొరుగుతున్నావు రా గ్యాస్ ఆంధ్ర . కడుపుకి అన్నం తింటున్నావ్ కదా దానికి కొంచెం న్యాయం చెయ్ .

Comments are closed.