విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు అదే స్థాయి నాయకుడిని అని సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఆయన చేసిన ఈ కామెంట్స్ తర్కానికి సరితూగడంతో అమ్మ రాజు గారూ అని అంతా అనుకునేలా ఉంది. తాను చంద్రబాబు పవన్ ముగ్గురం శాసనసభా పక్ష నేతలమే అని ఆయన వివరించారు.
అసెంబ్లీలో టీడీపీకి బాబు, జనసేనకు పవన్ ఫ్లోర్ లీడర్స్ అయితే బీజేపీకి తాను ఉన్నాయని అలా తన హోదా ఏమిటో ఆయన చెప్పకనే చెప్పేశారు. తాను తలచుకుంటే చాలా పనులు అవుతాయని అన్నారు. తన సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరడం విశేషం.
తాను ఎవరికీ జడిసే మనిషిని కాను అని రాజు గారు చెప్పుకున్నారు. తాను అవినీతి చేయనని లంచాలు తీసుకోనని ఇక ఎవరికి భయపడాలని ఆయన అంటున్నారు. ఎమ్మెల్యే అన్నది పవర్ ఫుల్ పోస్టు అని తాను ఇపుడు ఫ్లోర్ లీడర్ గా ఉన్నానని అందువల్ల ప్రభుత్వం ద్వారా పనులు చేయించగలను అన్నారు.
అయిదు సార్లు హార్ట్ ఎటాక్ ను ఎదుర్కోని బయటకు వచ్చిన తాను దేనికీ బెదిరేది లేదని రాజు గారు అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం వారికోసమే వాడుతాను అన్నారు. రాజు గారు తన హోదా గురించి తన అధికారం గురించి ఎందుకు ఈ తరహా కామెంట్స్ ఈ సందర్భంలో చేశారో అని అంతా తర్కించుకుంటున్నారు.
రాజు గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన ఏకైక నాయకుడిగా ఉన్నారు. ఆయన అనుభవానికి సమర్ధతకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి ఉందని అంటున్నారు.
“పూ..”లెందుల MLA కూడా శాసనసభా పక్ష నేతే అనుకుంటా??
సరేకానీ ఇంతకీ మన” ప్రతిపక్ష నేత” లండన్ నుండి ఎప్పుడు వస్తాడంటావ్??
Gu muyi ra howle
jagan assembly ki vasthada reddy?